బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
బీహార్ రాష్ట్రం భారతీయ వారసత్వానికి ఎంతో కాలంగా వైభవం, దివ్యత్వాన్ని ప్రసాదిస్తోందని పేర్కొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.. ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం బీహార్ ప్రతిరోజూ ప్రగతిలో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోందని ఆయన చెప్పారు. కష్టపడి పనిచేసే తత్వం, శక్తిసామర్థ్యాలు కలిగిన బీహార్ ప్రజల అంకితభావం.. 'వికసిత భారత్'తో పాటు 'వికసిత బీహార్' సంకల్పాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న గట్టి నమ్మకాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. భారతీయ వారసత్వానికి భవ్యత, దివ్యత్వాన్ని ప్రసాదించిన మన ఈ రాష్ట్రం.. నేడు ప్రగతి పథంలో అనునిత్యం సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోంది. కష్టపడి పనిచేసే తత్వం, అపార శక్తిసామర్థ్యాలు కలిగిన ఇక్కడి ప్రజల అంకితభావం.. 'వికసిత భారత్'తో పాటు 'వికసిత బీహార్' సంకల్పాన్ని సాకారం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను."
बिहार दिवस के अवसर पर राज्य के अपने सभी परिवारजनों को अनेकानेक शुभकामनाएं। भारतीय विरासत को भव्यता और दिव्यता प्रदान करने वाला हमारा यह प्रदेश आज प्रगति के नित-नए अध्याय गढ़ने में जुटा है। मुझे विश्वास है कि विकसित बिहार के साथ विकसित भारत के संकल्प को साकार करने में यहां के…
— Narendra Modi (@narendramodi) March 22, 2026


