నేడు పవిత్ర పండగ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పవిత్ర రోజున అందరిలో సోదరభావం, దయా గుణం పెంపొందాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.
ఈద్ ముబారక్!”
Best wishes on Eid-ul-Fitr. May this day further brotherhood and kindness all around. May everyone be happy and healthy.
— Narendra Modi (@narendramodi) March 21, 2026
Eid Mubarak!


