అంతర్జాతీయ ఆటోమోటివ్ పరిశ్రమ దిగ్గజం ఒసాము సుజుకీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఒసాము సుజుకి దూరదృష్టి వాహన రంగంలో ప్రపంచ దృక్పథాన్ని మార్చేసిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని ఆవిష్కరణలు, విస్తరణతో అంతర్జాతీయ శక్తిగా ఎదిగిందని అన్నారు.

‘‘ఎక్స్‌’’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమ దిగ్గజం ఒసాము సుజుకీ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన దూరదృష్టి వాహన రంగంలో ప్రపంచ దృక్పథాన్ని మార్చేసింది. ఆయన నాయకత్వంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని ఆవిష్కరణలు, విస్తరణతో అంతర్జాతీయ శక్తిగా ఎదిగింది. భారత్ అంటే ఆయనకు అవ్యాజమైన ప్రేమ. మారుతీతో ఆయన భాగస్వామ్యం దేశంలో ఆటోమొబైల్ మార్కెట్లో విప్లవాన్ని తీసుకొచ్చింది’’.

 

‘‘సుజుకీతో నిర్వహించిన చర్చల జ్ఞాపకాలను మనసులో నిక్షిప్తం చేసుకుంటూ, ఆయన ఆచరణాత్మకమైన, వినయపూర్వక విధానాన్ని గౌరవిస్తాను. కష్టపడి పనిచేసే తత్వం, ప్రతి అంశంపై నిశిత దృష్టి, నాణ్యతలో రాజీలేని తత్వంతో ఉదాహరణగా నిలిచారు. ఆయన కుటుంబానికి, సహచరులకు, అసంఖ్యాకమైన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From school to PG, girls now outnumber boys

Media Coverage

From school to PG, girls now outnumber boys
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 మే 2026
May 01, 2026

From Stolen Treasures to Smart Trains: PM Modi’s Blueprint for a Proud, Connected, Self-Reliant India