షేర్ చేయండి
 
Comments

అయిదు ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడం కోసం సంబంధిత రంగాల వారందరు ఉమ్మడి గా కృషి చేయాలని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  ప్రధాన మంత్రి వేరు వేరు సీనియర్ ఆర్థికవేత్తలు, ప్రైవేటు ఎక్విటి/వెంచర్ కేపిటలిస్టులు, తయారీ, ప్రయాణం మరియు పర్యటన రంగం, దుస్తులు మరియు ఎఫ్ఎమ్ సిజి లకు చెందిన వ్యాపార ప్రముఖులు, వ్యవసాయం, విజ్ఞ‌నశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞ‌నం ఇంకా ఆర్థిక రంగాలకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్టు లు, విశ్లేషకుల తో సమావేశమై వారి తో మాట్లాడారు. 

బడ్జెటు కన్నా ముందు జరిగే అభ్యాసం లో భాగం గా న్యూ ఢిల్లీ లోని నీతి ఆయోగ్ లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

రెండు గంటల సేపు అరమరికలు లేకుండా సాగిన ఈ సమావేశం ఆయా రంగాల లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క మరియు క్షేత్ర స్థాయి లోని వ్యక్తుల యొక్క అనుభవాన్ని తెర ముందుకు తీసకురాగలగడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు.

ఇది విధాన రూపకర్తల కు మరియు వేరు వేరు సంబంధిత వర్గాల వారికి మధ్య మేలు కలయిక కు దారితీస్తుందని ఆయన అన్నారు.

 

5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ అనే ఆలోచన అకస్మాత్తుగా ఊడిపడ్డటువంటిది ఏమీ కాదని, అది దేశం యొక్క శక్తుల పట్ల గాఢమైనటువంటి అవగాహన పై ఆధారపడినటువంటిది అని ప్రధాన మంత్రి వివరించారు.

 

భారతదేశానికి ఉన్న బలమైనటువంటి ఇముడ్చుకొనే సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలికమైన పునాదుల శక్తి ని, తిరిగి పుంజుకొనేందుకు దాని కి ఉన్నటువంటి శక్తి ని  చాటుతోంది అని ఆయన అన్నారు.

 

పర్యటన, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ల వంటి రంగాల కు ఆర్థిక వ్యవస్థ ను ముందుకు తీసుకుపోయేటటువంటి మరియు ఉద్యోగాలను సృష్టించేటటువంటి ఒక గొప్ప సత్తా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.

 

బాహాటంగా జరిగిన చర్చ లు మరియు ఈ తరహా వేదిక లలో సాగిన మేధోమధనం ఒక ఆరోగ్యకర చర్చ తో పాటు సమస్య లను అర్థం చేసుకోవడానికి దారి తీసినట్లు ఆయన పేర్కొన్నారు.

 

ఇది ఒక సకారాత్మకమైనటువంటి మానసికావస్థ ను పెంచి, సమాజం లో ‘‘చేయగలుగుతాము’’ అనే స్ఫూర్తి ని పోషించగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం అపరిమిత అవకాశాలను కలిగివున్నటువంటి దేశం అని ఆయన చెప్తూ, వాస్తవానికి మరియు గ్రహణశక్తి కి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి సంబంధిత వర్గాల వారంతా వారి వంతు ప్రయత్నాలు చేయాలని కోరారు.

 ‘‘మనం అందరం కలసి పనిచేసి తీరాలి అంతే కాదు ఒక జాతి వలె ఆలోచించడం మొదలుపెట్టాలి’’ అని ఆయన అన్నారు.

 

చర్చల లో పాలుపంచుకొన్న 38 మంది ప్రతినిధుల లో శ్రీ శంకర్ ఆచార్య, శ్రీ ఆర్. నాగరాజ్, ఫర్జానా అఫ్ రీదీ, వెంచర్ కేపిటలిస్టు శ్రీ ప్రదీప్ శాహ్, పారిశ్రామికవేత్త లు శ్రీ అప్పారావు మల్లవరపు, శ్రీ దీప్ కాల్ రా, శ్రీ పతంజలి గోవింద్ కేస్ వానీ, శ్రీ దీపక్ సేఠ్, శ్రీ శ్రీకుమార్ మిశ్రా, విషయ నిపుణులు శ్రీ ఆశీశ్ ధవన్ మరియు శ్రీ శివ్ సరీన్ లు కూడా ఉన్నారు.

 

ఈ సమావేశాని కి దేశీయాంగ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్, రహదారి రవాణా & హైవేస్ మరియు ఎమ్ఎస్ఎమ్ ఇ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, రైల్వేలు మరియు వాణిజ్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఇంకా వ్యవసాయం రైతుల సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర తోమర్, వివిధ మంత్రిత్వ శాఖ ల కార్యదర్శులు, నీతి ఆయోగ్ వైస్ చైర్ మన్ శ్రీ రాజీవ్ కుమార్ మరియు నీతి ఆయోగ్ చైర్ మన్ శ్రీ అమితాభ్ కాంత్ లు హాజరు అయ్యారు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
‘పరీక్ష పే చర్చ 2022’లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించిన ప్రధాన మంత్రి
Explore More
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
Income Tax refunds worth Rs 1.62 lakh crore issued so far this fiscal

Media Coverage

Income Tax refunds worth Rs 1.62 lakh crore issued so far this fiscal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to Lala Lajpat Rai on his Jayanti
January 28, 2022
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Lala Lajpat Rai on his Jayanti.

In a tweet, the Prime Minister said;

"पंजाब केसरी लाला लाजपत राय को उनकी जयंती पर सादर नमन। स्वतंत्रता आंदोलन में उनके साहस, संघर्ष और समर्पण की कहानी देशवासियों के लिए सदैव स्मरणीय रहेगी।"