షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ఈ రోజు న జ‌రిగిన ‘Gandhi@150’ స్మారకోత్సవాల జాతీయ సంఘం రెండో స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

మాన్య రాష్ట్రప‌తి గారి అధ్యక్షతన ఈ స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశం లో మాన‌నీయ ఉప రాష్ట్రప‌తి తో పాటు కేంద్ర మంత్రి మండ‌లి స‌భ్యులు, వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, జాతీయ సంఘం లోని ఇత‌ర స‌భ్యులు సహా ప్ర‌ముఖ గాంధేయవాదులు మరియు ఇతరులు పాల్గొన్నారు. సంఘం లో సభ్యత్వం కలిగినటువంటి ఒకే విదేశీ ప్ర‌ధాని, పోర్చుగల్ ప్రధాని శ్రీ ఎంటోనియో కోస్టా కూడా ఈ స‌మావేశం లో పాలు పంచుకొన్నారు.

మాన్య రాష్ట్రప‌తి గారు త‌న ప్ర‌సంగం లో జాతి పిత యొక్క 150వ జ‌యంతి ఉత్స‌వాల ను ఒక ‘జ‌న ఆందోళ‌న’గా మార్చినందుకు ప్ర‌ధాన మంత్రి ప్రత్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ లో ప‌ని చేస్తున్న‌టువంటి కార్య‌నిర్వాహ‌క సంఘాన్ని అభినందించారు. స్వ‌చ్ఛ్ భార‌త్ వంటి కార్య‌క్ర‌మాల కు ప్ర‌ధాన మంత్రి స్వ‌యం గా నాయ‌క‌త్వం వ‌హించ‌డం, ప్లాస్టిక్ ను ఒక సారి వినియోగించ‌డాన్ని మానివేసే దిశ గా ఒక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టడం వంటి చొర‌వ‌ ల ద్వారా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌న్న మ‌హాత్ముని బోధ‌న‌ల ను ప్రచారం చేస్తున్నార‌ని రాష్ట్రప‌తి ఈ సంద‌ర్భం లో గుర్తు కు తెచ్చారు.

గాంధీ గారి ని గురించి విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ కూర్చినటువంటి ఒక సంకలన గ్రంథాన్ని, అలాగే సంస్కృతి మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి స్మారకోత్సవాల గ్రంథాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించి, రాష్ట్రప‌తి కి ప్ర‌దానం చేశారు. సంక‌లన గ్రంథం లో ప్ర‌పంచ వ్యాప్తం గా 126 మంది ప్ర‌ముఖులు గాంధీ గారి ప్ర‌బోధాలు త‌మ‌కు పంచిపెట్టినటువంటి అనుభ‌వాల ను గురించి వివ‌రించారు. ప్ర‌పంచం అంత‌టా జ‌రుపుకొంటున్న ‘Gandhi@150’ స్మారకోత్సవ కార్యకలాపాల ను క‌ళ్ళ‌ కు క‌ట్టేటటువంటి ఒక ల‌ఘు చిత్రాన్ని సైతం ఈ స‌మావేశం లో ప్ర‌ద‌ర్శించారు.

ఈ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, గాంధీ మహాత్ముడు ప్రజల భాగస్వామ్యం కోసం ఇచ్చిన లోచనల కు అద్దం పడుతూ ఒక సంస్మ‌ర‌ణాత్మ‌క కార్య‌క్ర‌మాని కి రూప‌క‌ల్ప‌న చేయడం లో సంఘం ఒక‌టో స‌మావేశం లో స‌భ్యులు చేసిన సూచ‌న‌ ల స్ఫూర్తి స‌హాయ‌కారి గా నిలచిందన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచం గాంధీ గారి ని గురించి తెలుసుకోవాల‌ని కుతూహ‌లాన్ని క‌న‌బ‌ర‌చ‌డమే కాక ఆయ‌న నేతృత్వాన్ని అంగీక‌రించేందుకు సిద్ధం గా కూడా ఉంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ కార‌ణం గా ప్రపంచం గాంధీ మ‌హాత్ముని ప్రాసంగిక‌త కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని గుర్తు చేయవ‌ల‌సిన బాధ్య‌త భార‌త‌దేశానిదే అవుతుంది అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

భార‌త‌దేశం లోను, పోర్చుగ‌ల్ లోను ఏడాది పొడవు న సాగే స్మార‌క కార్య‌క‌లాపాల లో స్వ‌యం గా పాలు పంచుకోవడం కోసం కాలాన్ని వెచ్చిస్తున్నందుకుగాను పోర్చుగ‌ల్ ప్రధాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

‘Gandhi@150’ కేవ‌లం ఒక సంవ‌త్స‌రం పాటు అమ‌లు అయ్యే కార్య‌క్రమం కాదు అన్న వాస్త‌వాన్ని ప్ర‌ధాన మంత్రి నొక్కి వ‌క్కాణించారు. గాంధేయ భావ‌జాలాన్ని మ‌రియు దార్శ‌నిక‌త ను పౌరులు అంద‌రూ వారి వారి జీవితాల లో ఇముడ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం తో పాటు గాంధేయ భావ‌జాలాన్ని మ‌రియు దార్శ‌నిక‌త ను రానున్న కాలం లో సైతం ముందుకు తీసుకుపోవ‌ల‌సిన ఆవశ్యకత ఉంది అని ప్‌ంధాన మంత్రి చెప్పారు. శ‌తాబ్దుల స్మార‌కోత్స‌వాల ను ప్రభుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతూ ఉండేవే కాగా ‘Gandhi@150’ స్మార‌కోత్స‌వాలు ఒక సంద‌ర్భాని క‌న్నా మిన్న‌ గా మారినట్లు ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. అవి జ‌న స‌మాన్యం పాలు పంచుకొనేట‌టువంటి ఒక కార్య‌క్ర‌మం గా ఎదిగాయ‌ని, అంతేకాకుండా భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రూ గ‌ర్వించే అంశం గా నిల‌చాయ‌ని ఆయ‌న చెప్పారు.

పౌరులంద‌రికీ ఎర్ర‌కోట మీది నుండి తాను ఇదివ‌ర‌కు ఇచ్చినటువంటి ‘‘స్థానిక వ‌స్తువుల‌ ను కొనుగోలు చేయండి’’ అనేట‌టువంటి సందేశాన్ని ప్ర‌ధాన మంత్రి ఈ కార్య‌క్ర‌మం లోనూ పున‌రుద్ఘాటించారు. అభ్యున్నతి కి దారి తీసే ఈ గాంధీ గారి యొక్క మౌలిక తర్కాని కి భార‌త‌దేశం అభివృద్ధి చెంది పురోగతి పథం లో మునుముందుకు సాగ‌డం లో స‌హాయ‌కారి కాగ‌లిగే సత్తా ఉన్నదని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ సందేశాన్ని పౌరులు 2022వ సంవ‌త్స‌రం లో దేశం స్వాతంత్య్ర 75వ సంవ‌త్స‌రాల ను ఉత్స‌వం గా జ‌రుపుకొనేటంత వ‌ర‌కు ఆచ‌రిస్తూ ఉండాల‌ని, ఆ త‌రువాత కూడా ఈ సందేశాన్ని ఒక జీవ‌న మార్గం గా ఎంచి వారు దీని ని అనుస‌రించాలంటూ ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

ఇటీవల రాజ్య స‌భ 250వ స‌మావేశాన్ని జ‌రుపుకొన్నపుడు స‌భ్యుల ను వారి వారి స్థానిక భాష‌ల లో మాట్లాడ‌టాని కి ముందుకు రావ‌ల‌సింది గా ప్రోత్స‌హించ‌డం జరిగిందని, ఇది ఒక గ‌ర్వ‌కార‌ణ‌మైన అంశం అని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు. గాంధీ గారి సందేశాన్ని ప్ర‌పంచాని కి చాటేందుకు మ‌నం కృషి చేస్తూనే, గాంధీ మ‌హాత్ముని యొక్క సందేశాన్ని దేశ‌వ్యాప్తం గా సామాన్య మాన‌వునికి సందర్భోచితమైందిగా మలచడం కోసం కూడా న‌డుం క‌ట్ట‌వ‌ల‌సివుంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం ప‌ట్ల, ఇతరుల పట్ల ఒక వ్య‌క్తి తన విధుల ను తాను నెర‌వేర్చ‌డం ద్వారా ఇత‌రుల ప్రాథ‌మిక హ‌క్కులు భ‌ద్రం గా ఉండేటట్టు ఆ వ్యక్తి త‌నంత‌ తాను పూచీ ప‌డ‌తాడు అని గాంధీ గారు ఎలా న‌మ్మే వారో ప్ర‌ధాన మంత్రి వివరించారు. ప్ర‌తి ఒక్క‌రు ఈ మార్గం లో సాగి తన విధుల ను శ్రద్ధ తో నిర్వ‌ర్తించిన పక్షం లో భార‌త‌దేశం యొక్క క‌ల‌లు పండుతాయని చెప్తూ ప్ర‌ధాన మంత్రి త‌న ఉప‌న్యాసాన్ని ముగించారు. 

 
Pariksha Pe Charcha with PM Modi
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Cumulative vaccinations in India cross 18.21 crore

Media Coverage

Cumulative vaccinations in India cross 18.21 crore
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 మే 2021
May 16, 2021
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi reviewed preparations to deal with the impending Cyclone Tauktae

PM Modi’s governance – Sabka Saath Sabka Vikas