బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో చేసిన పోస్టులో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘సామాజిక న్యాయానికి ప్రతినిధి, ప్రజాసేవ పట్ల అంకితభావం ఉన్న నేత, బీహార్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ పుణ్యతిథి సందర్భంగా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సమాజంలో అణగారిన, దోపిడీకి గురయిన వర్గాల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారు. రాజకీయాలకూ, దేశ నిర్మాణానికీ ఆయన చేసిన కృషి మరువలేనిది’’
”
सामाजिक न्याय के प्रतीक और जनसेवा के प्रति समर्पित बिहार के लोकप्रिय नेता और पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी को उनकी पुण्यतिथि पर मेरी भावभीनी श्रद्धांजलि। उन्होंने हमेशा समाज के वंचित और शोषित समुदायों के कल्याण के लिए कार्य किया। राजनीति के साथ-साथ राष्ट्र निर्माण के…
— Narendra Modi (@narendramodi) October 8, 2025


