PM Narendra Modi wishes Shri Atal Bihari Vajpayee on his birthday
Atal ji's exemplary service & leadership has had a very positive impact on India's growth trajectory: PM Modi
 
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కి ఆయన జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపారు.

“మన అత్యంత ప్రియమైన మరియు ఎంతో మంది గౌరవించే అటల్ గారు సంతోషభరితమైన పుట్టిన రోజును జరుపుకోవాలంటూ నేను ఆయనకు నా శుభకామనలను తెలియజేస్తున్నాను. ఆయన చక్కని ఆరోగ్యంతో ఉండాలని, దీర్ఘ కాలం పాటు జీవించేటట్లుగా ఈశ్వరుని ఆశీర్వాదం ఆయనకు లభించాలని నేను ప్రార్థిస్తున్నాను.

అటల్ గారి మార్గదర్శకమైన సేవ మరియు నాయకత్వం భారతదేశ వృద్ధి గతి పైన చాలా సకారాత్మక ప్రభావాన్ని ప్రసరింపచేశాయి. ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం అభిమానం రేకెత్తిస్తుంది” అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Modi era: From the resolve of a developed India to the renaissance of Devbhoomi

Media Coverage

Modi era: From the resolve of a developed India to the renaissance of Devbhoomi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై… భారత ప్రధానమంత్రిగా అత్యధిక కాలం కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకుల అభినందనలు
June 09, 2026

   ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, త్యధిక కాలం భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచ నేతలు హృదయపూర్వకంగా అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాల నాయకులు ఆయన పరిణామాత్మక పాలనను, వర్ధమాన దేశాల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. సార్వజనీన, గతిశీల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించడంపై ఆయన దార్శనికతను వారు వేనోళ్ల ప్రశంసించారు.

ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గౌరవనీయ అనూర కుమార దిసనాయక ఈ నెల 8వ తేదీన రాసిన లేఖలో తమ ప్రభుత్వం, ప్రజల తరపున ప్రధానమంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “మీ పదవీకాలానికే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ నాయకుడుగా ప్రజలు మీ సామర్థ్యంపై పలుమార్లు ప్రదర్శించిన విశ్వాసం, నమ్మకానికి ఈ ఘనత ఓ నిదర్శనం” అని ఆ సందేశంలో పేర్కొన్నారు. భారత్‌ సాధించిన అద్భుత ఆర్థిక, సామాజిక రూపాంతరీకరణను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- శ్రీలంక వంటి పొరుగు దేశాలు సహా సరిహద్దుల ఆవల కూడా అనేక మందికి ప్రధానమంత్రి మోదీ దార్శనికత స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి మోదీ 2025 ఏప్రిల్ 4 నుంచి 6 వరకు శ్రీలంకలో పర్యటించారు. ఆ ద్వీప దేశాన్ని ఆయన సందర్శించడం అది నాలుగోసారి. ఆ సందర్భంగా ఒక విదేశీ ప్రముఖుడికి శ్రీలంక ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారం ‘మిత్ర విభూషణ్‌’ను ఆయనకు ప్రదానం చేశారు. ‘పొరుగుకు అగ్ర ప్రాధాన్యం’ అనే భారత విదేశీ విధానాన్ని నాటి పర్యటన ద్వారా ఆయన చాటిచెప్పారు. భారత్‌తో సుస్థిర భాగస్వామ్యం వల్ల అత్యధిక లబ్ధి పొందిన దేశాల్లో శ్రీలంక ఒకటి. ముఖ్యంగా 2022లో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి  శ్రీలంకను గట్టెక్కించడంలో భారత్‌ కీలకపాత్ర పోషించింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పపువా న్యూ గినీ ప్రధానమంత్రి హెచ్.ఇ.జేమ్స్ మారాపే అభినందనలు తెలుపుతూ ఒక  వ్యక్తిగత వీడియో సందేశం పంపారు. “ఆదర్శప్రాయ, సమర్థ నాయకుడు”గా ప్రధానమంత్రి మోదీని అందులో కొనియాడారు. “భారత్‌లో 20 కోట్ల మందికిపైగా ప్రజలను పేదరిక విముక్తులను చేయడం ద్వారా వారికి జీవన సౌలభ్యం కల్పించడం ఒక అద్భుతం” అని పేర్కొన్నారు. భారత్‌తో ఆత్మీయ స్నేహాన్ని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనే ఆకాంక్షను ప్రధానమంత్రి మారాపే వెలిబుచ్చారు. ప్రధానమంత్రి మోదీ 2023 మే నెలలో ‘ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్’ సదస్సులో పాల్గొనేందుకు పపువా న్యూ గినీ పర్యటనకు రావడం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. భారత ప్రధానమంత్రి ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం అదే తొలిసారి. వర్ధమాన దేశాల నిబద్ధతగల భాగస్వామిగా భారత్‌ వ్యవహరిస్తుండటాన్ని ఈ పర్యటన ప్రస్ఫుటం చేసింది.

ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రి కమ్లా పర్సాద్-బిస్సెసర్ ప్రధానమంత్రి మోదీకి ఒక అభినందన సందేశం పంపారు. “ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన అంతర్జాతీయ అంశాలపై భారత్ బలమైన గళం వినిపించే దేశంగా ఎదిగింది” అని అందులో పేర్కొన్నారు. నిరాడంబర నేపథ్యం నుంచి వచ్చిన మోదీ 140 కోట్ల జనాభాగల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం ద్వారా  యావత్‌ ప్రపంచ ప్రశంసలను అందుకోవడం ముదావహమని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వాన విదేశాంగ విధానం, ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక-ఆర్థిక పురోగమనంలో భారత్ గణనీయ విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ట్రినిడాడ్-టొబాగోకు భారతీయుల వలసకు 180 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2025 జూలై 3-4 తేదీల్లో ప్రధానమంత్రి మోదీ ఆ దేశంలో పర్యటించడం ద్వారా 26 ఏళ్లలో తొలిసారి సందర్శించిన భారత ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.