షేర్ చేయండి
 
Comments

జ‌ల శ‌క్తి అభియాన్‌

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నాటి త‌న ‘మ‌న్ కీ బాత్’ (‘మ‌న‌సులో మాట‌’) కార్య‌క్ర‌మం లో భాగం గా జ‌ల శ‌క్తి ప్ర‌చార ఉద్య‌మం ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తో వేగ‌వంత‌మైన‌టువంటి మ‌రియు విజ‌య‌వంత‌మైన‌టువంటి రీతి లో ముందుకు సాగిపోతున్నద‌ని పేర్కొన్నారు.  కొన్ని విస్తృత‌మైన‌టువంటి మ‌రియు వినూత్న‌మైన‌టువంటి జ‌ల సంర‌క్ష‌ణ ప్ర‌య‌త్నాలు దేశం లోని మూల మూల‌ న పురోగ‌మిస్తున్నాయ‌ని శ్రోత‌ల దృష్టి కి ఆయన తీసుకువ‌చ్చారు.

రాజ‌స్థాన్ లోని జాలౌర్ జిల్లా ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘అక్క‌డ రెండు చరిత్రాత్మ‌క‌మైన‌టువంటి మెట్ల బావులు మురికి నీటి తో మ‌రియు వ్య‌ర్థ ప‌దార్థాల తో నిండిపోయాయి.  అయితే, ఒక మంచిరోజు చూసి థానావాలా, ఇంకా భ‌ద్రాయన్ పంచాయ‌తీల‌ కు చెందిన వంద‌ల మంది ప్ర‌జ‌లు జ‌ల శ‌క్తి ప్ర‌చార ఉద్య‌మం లో భాగం గా వాటి ని పున‌రుద్ధ‌రించాల‌ని ఒక సంక‌ల్పాన్ని తీసుకొన్నారు.  వర్షకాలం రాక ముందే ప్ర‌జ‌లు ఆ చోటు లను శుభ్ర‌ప‌ర‌చే బాధ్య‌త ను వారి భుజాల పైన వేసుకొని ఆ ప‌ని లో నిమగ్నం అయ్యారు.  ఈ ప్ర‌చార ఉద్య‌మం కోసం కొంత మంది డ‌బ్బు ను విరాళం గా ఇచ్చారు; మ‌రికొంద‌రు కాయ‌క‌ష్టం చేయడానికి ముందుకు వచ్చారు.  త‌త్ఫ‌లితం గా ఆ మెట్ల బావులు ప్ర‌స్తుతం వారికి ప్రాణాధారం గా స‌రిక్రొత్త రూపు ను సంత‌రించుకొన్నాయి.’’

అదే విధం గా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బారాబ‌ంకీ లో గ‌ల స‌రాహీ స‌ర‌స్సు పల్లెవాసుల ఉమ్మ‌డి కృషి ద్వారా తిరిగి ఊపిరి పోసుకోవ‌డం జ‌రిగింది.  ఉత్త‌రాఖండ్ లో అల్ మోడా-హల్ద్వానీ హైవే ను ఆనుకొని ఉన్న స్యూన్ రాకోట్ గ్రామం లో ప్ర‌జ‌ల ప్రాతినిధ్యం మ‌రొక ఉదాహ‌ర‌ణ గా ఉంది.  అక్క‌డి గ్రామస్థులు నీరు త‌మ గ్రామాని కి చేరుకొనేట‌ట్లు చూడాల‌ని త‌ల‌చారు.  వారు ధ‌నాన్ని స‌మీక‌రించి, శ్ర‌మ‌కోర్చారు.   గ్రామం వ‌ర‌కు ఒక గొట్ట‌పు మార్గాన్ని వేసుకొని, ఒక పంపింగ్ స్టేశన్ ను వారు ఏర్పాటు చేసుకొన్నారు.  దీనితో ద‌శాబ్ద కాలం నాటి నీటి స‌మ‌స్య కు ప‌రిష్కార‌ం లభించింది.

జ‌ల సంర‌క్ష‌ణ‌, ఇంకా ఇంకుడు గుంత‌ల కు సంబంధించినటువంటి ప్ర‌య‌త్నాల తాలూకు గాథ‌ల ను ప్ర‌తి ఒక్క‌రు #Jalshakti4India ను ఉప‌యోగించి ఇత‌రుల దృష్టి కి తీసుకు రావల‌సింది గా ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

నీటి సంర‌క్ష‌ణ మ‌రియు జ‌ల భ‌ద్ర‌త లు ధ్యేయం గా జ‌ల శ‌క్తి అభియాన్ పేరు తో ఒక ప్ర‌చార ఉద్య‌మాన్ని 2019వ సంవ‌త్స‌రం జులై లో ఆరంభించ‌డ‌మైంది.  నీటి ఎద్ద‌డి కి గురి అయిన బ్లాకులు మ‌రియు జిల్లాల పై ఈ ప్ర‌చార ఉద్య‌మం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ను తీసుకొంటున్న‌ది.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report

Media Coverage

Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
జమ్ము, కశ్మీర్ లో జరిగినరోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
October 28, 2021
షేర్ చేయండి
 
Comments
బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం చెల్లించడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు

జమ్ము, కశ్మీర్ లోని డోడా లో ధాథ్ రీ కి దగ్గర లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇప్పించడానికి కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జమ్ము, కశ్మీర్ లోని డోడా లో గల థాథ్ రీ సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దుఃఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

గాయపడ్డ వారు అతి త్వరలోనే కోలుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi

జమ్ము, కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతుల పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయాలు ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొన్నారు.