షేర్ చేయండి
 
Comments
స‌మాజం, ప్ర‌జ‌లు, మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటులో ముందుండాలి: ప్ర‌ధాన‌మంత్రి
వాక్సిన్ ఏమాత్రం వృధాకాని ద‌శ‌కు మ‌నం చేరుకోవాలి : ప్ర‌ధాన‌మంత్రి
టీకా ఉత్స‌వానికి వ్య‌క్తిగ‌త‌, సామాజిక‌, పాల‌నా స్థాయిలో ల‌క్ష్యాలు నిర్ణ‌యించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలి : ప్ర‌ధాన‌మంత్రి

నా ప్రియమైన దేశవాసులారా!

   జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నేడు… అంటే- ఏప్రిల్ 11న మనం ‘టీకా ఉత్సవ్’ను ప్రారంభించుకుంటున్నాం. ఈ ‘టీకా ఉత్సవ్’ ఏప్రిల్ 14దాకా… అంటే- బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకల వరకూ కొనసాగుతుంది. ఒక విధంగా ఈ ఉత్సవం కరోనాపై మరో కీలక యుద్ధానికి శ్రీకారం. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకే కాకుండా సామాజిక శుభ్రతకూ మనం ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా మనం నాలుగు అంశాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి:

  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరికి టీకా వేయించాలి… అంటే- స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని పెద్దలు, పెద్దగా చదువుకోని వారికి సాయం చేయాలి.
  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరిని ఆదరించాలి… అంటే- టీకా అందుబాటుకు సంబంధించిన సదుపాయాల గురించి తెలియనివారికి లేదా అందుకు అవకాశం లేనివారికి సాయం చేయాలి.
  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరిని రక్షించాలి… అంటే- ‘‘నేను కచ్చితంగా మాస్కు ధరించి నన్ను నేను రక్షించుకోవవడంతోపాటు ఇతరుల ప్రాణాలకూ రక్షణ కల్పిస్తాను’’ అని ప్రతినబూనాలి.

   ఇక నాలుగో ముఖ్యమైన అంశం ఏమిటంటే- ఎవరికైనా కరోనా సోకినపుడు ఆ పరిసర ప్రదేశాల్లో ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పక్షంలో ఆ వ్యక్తి కుటుంబసభ్యులు సంబంధిత ప్రాంతంలోని ఇతరులు కూడా ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటు చేసుకోవాలి.

   అధిక జనసాంద్రతగల భారత్ వంటి దేశంలోనైనా కరోనాపై పోరులో ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటు ఒక కీలక తరణోపాయం. అలాగే ఏ ఒక్కరికి వ్యాధి నిర్ధారించబడినా అందరూ అప్రమత్తమై, మిగిలినవారంతా పరీక్ష చేయించుకునేలా శ్రద్ధ వహించాలి. అదే సమయంలో సామాజికంగానే కాకుండా పాలన యంత్రాంగం పరంగానూ అర్హులైన వారందరూ  టీకా వేయించుకునేలా కృషిచేయాలి. ఒక్క టీకా కూడా వ్యర్థం కారాదన్నది మన లక్ష్యం కావాలి. ఆ మేరకు అసలు టీకా వృథా అన్నమాటకే తావు లేకుండా జాగ్రత్త వహించాలి. ఈ కృషిలో భాగంగా దేశంలోని టీకా సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకునేలా చూడాలి. మన టీకా ఉత్పాదక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడానికి ఇదీ ఒక మార్గమే.

  • మన విజయం – ‘సూక్ష్మ నియంత్రణ మండలం’పై అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది.
  • మన విజయం – అనవసరంగా ఇళ్లనుంచి బయటకు వెళ్లకపోవడంలోనే ఉంటుంది.
  • మన విజయం – అర్హులైన వారందరికీ టీకా వేయించడంపైనే నిర్ణయించబడుతుంది.
  • మన విజయం – మనం మాస్క్ ధరించడం, ఇతర నిబంధనలను పాటించడంపైనా ఆధారపడి ఉంటుంది.

మిత్రులారా!

   ఈ నాలుగు రోజుల ‘టీకా ఉత్సవ్’లో వ్యక్తిగత, సామాజిక, పాలన యంత్రాంగం స్థాయులలో లక్ష్యాలను సాధించే దిశగా మనం అన్నివిధాలా కృషిచేయాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో మనం మరోసారి కరోనాను నియంత్రించగలమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

గుర్తుంచుకోండి – మందులు వాడటమే కాదు… విధివిధానాలకు కట్టుబాటు కూడా ముఖ్యం.

 

ధన్యవాదాలు!

మీ

నరేంద్ర మోదీ

 

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2021
July 24, 2021
షేర్ చేయండి
 
Comments

PM Modi addressed the nation on Ashadha Purnima-Dhamma Chakra Day

Nation’s progress is steadfast under the leadership of Modi Govt.