PM Narendra Modi to inaugurate digital exhibition – “Uniting India – Sardar Patel” on October 31
Digital exhibition showcasing the integration of India and contribution of Sardar Vallabhbhai Patel previewed by PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం నాడు న్యూ ఢిల్లీ లోని నేషనల్ సైన్స్ సెంటర్ లో “యునైటింగ్ ఇండియా: సర్దార్ పటేల్” అంశంపై సంస్కృతి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆ ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందుగా తిలకించారు.

ఈ డిజిటల్ ఎగ్జిబిషన్ భారతదేశ ఏకీకరణకు, అందులో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అందించిన తోడ్పాటుకు అద్దం పడుతుంది. ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రేరణతో ఈ ప్రదర్శన రూపుదిద్దుకొంది.

ఈ ప్రదర్శనలో సుమారు 30 వస్తువులను ఉంచారు. వాటిలో దాదాపు 20 వేరు వేరు ఇంటరాక్టివ్ మరియు మీడియా ఎక్స్ పీరియన్సెస్ కలసి ఉన్నాయి. ఈ ప్రదర్శన భారతదేశ ఏకీకరణలో సర్దార్ పటేల్ పోషించిన పాత్రను గురించి వివరించే వివిధ డిజిటల్ ఇన్ స్టాలేషన్స్ తో మమేకం అయ్యే అవకాశాన్ని సందర్శకులకు కల్పిస్తుంది. 3D చిత్రాలు (కళ్లద్దాలు లేకుండా), హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్, కైనటిక్ ప్రొజెక్షన్, ఆక్యులస్ బేస్ డ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ వగైరా సాంకేతిక విజ్ఞానాలను ఈ ప్రదర్శనలో ఉపయోగార్థం ఉంచారు.

సందర్భ శుద్ధి గల ప్రమాణ పత్ర రచనను నేషనల్ ఆర్కైవ్ జ్ ఆఫ్ ఇండియా నుండి సంస్కృతి మంత్రిత్వ శాఖ సంపాదించి, తెచ్చింది. ప్రదర్శన ఆకృతిని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అందజేసింది.

సర్దార్ పటేల్ జయంతి దినమైన 2016 అక్టోబరు 31 నాడు ఈ ప్రదర్శనను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Govt bolsters Agri Stack with ₹6,000 crore allocation to empower farmers

Media Coverage

Govt bolsters Agri Stack with ₹6,000 crore allocation to empower farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జూన్ 2025
June 15, 2025

Citizens Appreciate PM Modi’s Decade of Transformation - Empowering India, Inspiring the World