ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బాడ్ మింటన్ చాంపియన్ శిప్ స్ లో ఫైనల్ కు చేరుకొన్న భారతీయ శట్ లర్ శ్రీ లక్ష్య సేన్ ను ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మిమ్మల్ని చూస్తే గర్వం గా ఉంది శ్రీ @lakshya_sen. మీరు ప్రశంసాయోగ్యమైన సాహసాన్ని, గట్టి పట్టుదల ను చాటారు. ఉత్సాహభరితమైన రీతి న పోరాడారు. మీ రాబోయే ప్రయత్నాల లో మీరు రాణించాలని కోరుకొంటున్నాను. సఫలత యొక్క నూతన శిఖరాల ను మీరు అధిరోహిస్తూనే ఉంటారు అనే నమ్మకం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
Proud of you @lakshya_sen! You’ve shown remarkable grit and tenacity. You put up a spirited fight. Best wishes for your future endeavours. I am confident you will keep scaling new heights of success.
— Narendra Modi (@narendramodi) March 20, 2022


