PM Modi hands over keys to mark the Grihapravesh of Prime Minister Awas Yojana- Grameen (PMAY-G) beneficiaries in Maharashtra
Being amongst people during the auspicious occasion of Dussehra gives me energy and renewed vigour to work for the betterment of the country: PM Modi
Shri Saibaba's teachings gives usthe mantra to build a strong unified society and toserve humanity with love: PM Modi
People getting their own homes is a big step towards the fight against poverty: PM Modi
In the last four years, our Government has built over 1.25 crore houses: PM Modi
PM Modi appreciates people of Maharashtra for making the state Open Defecation Free
Under Ayushman Bharat (PMJAY), modern medical infrastructure is getting readied: PM Modi
PM Modi underlines the efforts taken by the Government to deal with drought faced by Maharashtra

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మ‌హారాష్ట్ర‌ లోని శిర్డీ ని సంద‌ర్శించారు. ఈ సందర్భంగా జ‌రిగిన ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం లో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్ర‌స్ట్ అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల‌కు శంకు స్థాప‌న సూచకం గా ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్క‌రించారు. శ్రీ సాయిబాబా స‌మాధి యొక్క శ‌తాబ్ది ని పురస్కరించుకొని ఒక వెండి నాణాన్ని కూడా ఆయన విడుదల చేశారు.

అలాగే మ‌హారాష్ట్ర‌ లో ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్‌ యోజ‌న‌(పిఎంఎవై- జి) కార్య‌క్ర‌మం ల‌బ్ధిదారుల‌ కు గృహ‌ప్ర‌వేశ‌ కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకొని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల తాళంచెవులను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అంద‌జేశారు. ఆయన వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా మ‌హారాష్ట్ర‌ లోని స‌తారా, లాతూర్, నందుర్‌బార్‌, అమ‌రావ‌తీ, ఠాణే, సోలాపుర్‌, నాగ్ పుర్ వంటి వివిధ జిల్లాలకు చెందిన లాభార్థుల‌ తో మాట్లాడారు. లాభార్థుల లో ఎక్కువ మంది మ‌హిళ‌లే ఉన్నారు. వారు మంచి నాణ్య‌మైన ఇళ్ల‌ ను నిర్మించి ఇచ్చినందుకు, పిఎంఎవై-జి లో భాగం గా రుణం సుల‌భంగా ల‌భించే ఏర్పాటు చేసినందుకు, అవినీతి కి తావ లేనటువంటి ప్రక్రియ ను తీసుకువచ్చినందుకు ప్ర‌ధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఆ తరువాత ప్ర‌ధాన మంత్రి అక్కడ గుమికూడిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మొదట దేశ ప్ర‌జ‌లంద‌రికీ ద‌సరా యొక్క శుభాకాంక్ష‌లను తెలియజేశారు. ద‌సరా శుభ సందర్భం గా దేశ వాసుల కోసం పనిచేసే శక్తి, ఇంకా ఉత్సాహం త‌న‌కు లభిస్తోంద‌న్నారు.

స‌మాజానికి శ్రీ సాయిబాబా అందించినటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, వారు చేసిన ప్రబోధాలు మనకు ఒక బ‌ల‌మైన‌టువంటి ఐక్య సమాజాన్ని నిర్మించేందుకు మరియు ప్రేమ‌ తో మానవ జాతి కి సేవ‌ చేసేందుకు ఒక మంత్రాన్ని ప్రసాదిస్తున్నాయని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డం లో శిర్డీ ఎల్ల‌ప్పుడూ స‌మున్న‌తంగా నిలుస్తూ వ‌స్తున్న‌ద‌ని చెప్పారు. సాయిబాబా చూపిన బాట‌ లో శిర్డీ సాయిబాబా సంస్థాన్ న‌డుస్తోంద‌ంటూ ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. విద్య‌ ద్వారా, ఆధ్యాత్మిక‌ బోధ‌న‌ల ద్వారా సామాజిక సాధికారిత దిశ‌ గా ట్ర‌స్టు అందిస్తున్న‌ సేవ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి కొనియాడారు.

ద‌సరా రోజు న ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న- గ్రామీణ్ కార్య‌క్ర‌మం లో భాగం గా 2 ల‌క్ష‌ల‌ మందికి పైగా లాభితుల‌కు నూతన గృహాల ను అందించ‌డం ఆనందంగా ఉంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. పేద‌రికానికి వ్య‌తిరేకం గా జ‌రిపే పోరాటం లో ఇది ఒక పెద్ద ముంద‌డుగు అని ఆయ‌న అన్నారు. 2022 కల్లా అందరికీ గృహ వ‌స‌తి ని క‌ల్పించే ప్ర‌భుత్వ ల‌క్ష్యం గురించి ప్ర‌స్తావిస్తూ, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వం 1.25 కోట్ల ఇళ్ల‌ ను నిర్మించినట్లు తెలిపారు. ప్ర‌భుత్వం నిర్మించి ఇస్తున్న ప్ర‌తి ఇల్లు మంచి నాణ్య‌త‌ తో కూడిందే కాక ఆ ఇళ్లకు టాయిలెట్ , విద్యుత్తు కనెక్షన్, గ్యాస్ క‌నెక్ష‌న్ సౌక‌ర్యాలను క‌ల్పిస్తున్నామ‌న్నారు.

మ‌హారాష్ట్ర‌ ను బ‌హిరంగ మ‌ల మూత్రాదుల విస‌ర్జ‌న ర‌హిత (ఒడిఎఫ్) రాష్ట్రం గా తీర్చిదిద్దినందుకు ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాన‌ మంత్రి అభినందించారు. స్వ‌చ్ఛ్ భార‌త్ యోజన దిశ గా మహారాష్ట్ర‌ ప్ర‌భుత్వం యొక్క కృషి ని కూడా ప్ర‌ధాన‌ మంత్రి శ్లాఘించారు. ఈ సంద‌ర్బం లో ప్ర‌ధాన‌ మంత్రి.. ‘ప్ర‌ధాన‌ మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న’ (పిఎంజెఎవై) ని గురించి మాట్లాడారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు ఒక ల‌క్ష‌ మంది ఈ ప‌థ‌కం లో భాగం గా ప్ర‌యోజ‌నాన్ని పొందారని ప్ర‌ధాన‌ మంత్రి వెల్లడించారు. పిఎంజెఎవై లో భాగం గా ఆధునిక వైద్య సంబంధ మౌలిక స‌దుపాయాలను సిద్ధ‌ం చేస్తున్నట్లు చెప్పారు.

క‌ర‌వును ఎదుర్కొనేందుకు మ‌హారాష్ట్ర చేప‌ట్టిన‌చ‌ర్య‌లను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. కృషి సించాయి యోజ‌న‌, ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వ‌ జ‌ల‌యుక్త్ శిబిర్ అభియాన్ ల‌ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. నీటిపారుద‌ల కాలువ‌ ల‌లో పూడిక తొలగింపు నకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మం లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని ప్ర‌ధాన మంత్రి అభినందించారు.

బి.ఆర్‌. ఆంబేడ్ కర్‌, జ్యోతిరావ్ ఫులే, ఇంకా ఛ‌త్ర‌ప‌తి శివాజీ లను ప్రధాన మంత్రి స్మరిస్తూ, వారి గొప్ప ఆదర్శాలను, బోధ‌న‌ ల‌ను దేశ‌ ప్ర‌జ‌లు అనుస‌రిస్తూ ఒక బ‌ల‌మైన‌టువంటి, అవిభాజ్యమైనటువంటి స‌మాజాన్ని నిర్మించే దిశ గా కృషి చేయాల‌ంటూ పిలుపునిచ్చారు. ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్‌’, ఇంకా ‘‘ఏక్ భారత్‌- శ్రేష్ఠ్ భార‌త్’’ లను సాధించే పథంలో ముందుకు సాగాల‌ంటూ ప్ర‌ధాన‌ మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

అంత‌క్రితం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ సాయిబాబా స‌మాధి మందిర పరిసరాలను సంద‌ర్శించడం తో పాటు ప్రార్థ‌న‌లు కూడా నిర్వ‌హించారు. ఆయన శ్రీ సాయిబాబా యొక్క శ‌తాబ్ది ఉత్స‌వ ముగింపు కార్య‌క్ర‌మం లోనూ పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Freed Banks From NPA Illness': PM Modi Discusses Reforms, Economy, Trade Deals, World Order

Media Coverage

Freed Banks From NPA Illness': PM Modi Discusses Reforms, Economy, Trade Deals, World Order
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Congratulates India’s U-19 Cricket Team on World Cup Victory
February 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, has lauded the outstanding performance of India’s Under-19 cricket team for clinching the World Cup title.

Prime Minister commended the team for playing very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too, he added.

In a message on X, Shri Modi said:

“India’s cricketing talent shines!

Proud of our U-19 team for bringing home the World Cup. The team has played very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too. Best wishes to the players for their upcoming endeavours.”