The country lost Kalpana Chawla at a young age, but her life is an example for the entire world: PM Modi during #MannKiBaat
Nari Shakti has united the society, the world, with the thread of unity: PM Modi during #MannKiBaat
Today, women are leading from the front in every sphere. They are pioneering new achievements and establishing milestones: PM during #MannKiBaat
#MannKiBaat: PM says, our women-power is breaking the barriers of society and accomplishing unparalleled achievements and setting new records
Bapu's teachings are relevant even today, says Prime Minister Modi during #MannKiBaat
It is necessary for all the people of the society to truly benefit from the development, and for this our society should get rid of the social evils: PM during #MannKiBaat
Come, let us all take a pledge to end the evils from our society and let’s build a New India that is strong and capable: PM during #MannKiBaat
If a person is determined to do something then there is nothing impossible. Major transformations can be brought through Jan Andolan, says the PM #MannKiBaat
Our government changed the way Padma Awards were used to be given, now a common man can reach new heights: PM during #MannKiBaat
The path of peace and non-violence, that is the way of Bapu: PM Modi during #MannKiBaat

నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! 2018 సంవత్సరంలో ఇది మొదటి ’మనసులో మాట’. రెండు రోజుల క్రితమే మనం మన గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము. పది దేశాలకు చెందిన దేశాధ్యక్ష్యులు ఈ ఉత్సావంలో పాల్గోవడం దేశ చరిత్రలో మొదటిసారి.

 

నా దేశ ప్రజలారా, శ్రీ ప్రకాశ్ త్రిపాఠీ గారు నరేంద్ర మోదీ యాప్ కు ఒక పెద్ద లేఖను వ్రాసారు. తన లేఖలో పేర్కొన్న విషయాలను మనసులో మాటలో ప్రస్తావించవలసిందిగా కోరారు. వారేం రాసారంటే, ఫిబ్రవరి ఒకటవ తేదీ అంతరిక్ష్యం లోకి వెళ్ళిన కల్పనా చావ్లా వర్థంతి. కొలంబియా అంతరిక్ష్య యాన దుర్ఘటనలో ఆవిడ మనల్ని వదిలి వెళ్పోయినా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల యువతకు ప్రేరణను అందించారు. తన పొడవాటి లేఖలో మొదట కల్పనా చావ్లా గురించి ప్రస్తావించినందుకు సోదరులు ప్రకాశ్ గారికి నేను ఋణపడిఉంటాను. ఇంత చిన్నవయసులోనే కల్పనా చావ్లాగారిని కోల్పోవడం అందరికీ ఎంతో దు:ఖం కలిగించింది. కానీ ఆవిడ తన జీవితం ద్వారా యావత్ ప్రపంచానికీ, ముఖ్యంగా మన భారతదేశంలోని వేల మంది యువతులకు నారీశక్తి కి ఎలాంటి సరిహద్దులూ ఉండవని తెలియచేసారు.  కోరిక, ధృఢ సంకల్పం ఉంటే, ఏదైనా చెయ్యాలనే అభిలాష ఉంటే, అసాధ్యమైనదేది లేదు. ఇవాళ్టి రోజున భారతదేశంలో మహిళలందరూ ప్రతి రంగంలోనూ అభివృధ్ధి చెందుతూ దేశ గౌరవాన్ని పెంచుతున్నారు.

ప్రాచీన కాలం నుండీ మన దేశంలో మహిళలకు లభించిన గౌరవం, సమాజంలో వారికి లభించిన స్థానం, వారి సహకారం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. భారతదేశంలో ఎందరో విదూషీమణుల సంప్రదాయం ఉంది. వేదసార సంగ్రహిణలో ఎందరో భారతీయ విదుషీమణుల తోడ్పాటు ఉంది. లోపాముద్ర, గార్గి, మైత్రేయి లాంటి స్మరణీయులెందరో!  ఇవాళ మనం "ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివించు" లాంటి నినాదాలు చేస్తున్నాం కానీ చాలా కాలం క్రితమే మన శాస్త్రాల్లో, స్కందపురాణంలో ఏం చెప్పారంటే,

"దశ పుత్ర, సమా కన్యా, దశ పుత్రాన్ ప్రవర్థయన్

యత్ ఫలం లభతే మర్త్య తత్ లభ్యం కన్యకైకయా"

(दशपुत्र, समाकन्या, दशपुत्रान प्रवर्धयन् | यत् फलं लभतेमर्त्य, तत् लभ्यं  कन्यकैकया ||)

 

అనగా ఒక కుమార్తె పది కుమారులతో సమానం. పది మంది పుత్రుల వల్ల కలిగే పుణ్యం ఒక్క కుమార్తె తోనే లభిస్తుంది. ఇది మన సమాజంలో స్త్రీ ప్రాముఖ్యాన్ని చూపెడుతుంది. అందుకే మన సమాజంలో స్త్రీ ని శక్తి స్వరూపంగా భావిస్తారు. ఈ స్త్రీ శక్తి మొత్తం దేశాన్ని, సమాజాన్నీ, కుటుంబాన్నీ ఏక త్రాటిపై నిలుపుతుంది. వైదిక కాల విదుషీమణులైన లోపాముద్ర, గార్గి, మైత్రేయి ల విద్వత్తైనా; అక్కమహాదేవి, మీరాబాయిన భక్తి, జ్ఞానాలైనా; అహల్యాబాయి హోల్కర్ పరిపాలనా వ్యవస్థ అయినా; రాణి లక్ష్మీబాయి వీరత్వమైనా, స్త్రీ శక్తే ఎప్పుడూ కూడా మనకెంతో ప్రేరణను అందిస్తూ, దేశ గౌరవమర్యాదలను కాపాడుతోంది.

 

శ్రీ ప్రకాశ్ త్రిపాఠీ గారు ఎన్నో ఉదాహరణలను సూచించారు. మన సాహసవంతురాలైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సుఖోయి 30 యుధ్ధ విమాన ప్రయాణం స్త్రీలందరికీ ఎంతో ప్రేరణను ఇస్తుందన్నారు. వర్తికా జోషీ నేతృత్వంలో భారతీయ నౌకాదళ మహిళా సభ్యులు ఐ.ఎన్.ఎస్.వి .తరిణిపై ప్రపంచ యాత్ర చేస్తున్నారు. వారి గురించి కూడా ప్రస్తావించారు. భావనా కంఠ్, మోహనా సింహ్, అవనీ చతుర్వేదీ అనే ముగ్గురు సాహస వనితలు ఫైటర్ పైలెట్స్ అయ్యి, సుఖోయి 30 యుధ్ధవిమాన శిక్షణ తీసుకుంటున్నారు. క్షమతా వాజపేయి నేతృత్వంలో ఆల్ విమెన్ క్రూ ఢిల్లీ నుండి అమెరికా లోని సెన్ఫ్రాన్సిస్కో కి, తిరిగి ఢిల్లీ వరకూ ఏర్ ఇండియా బోయింగ్ జట్ విమానాన్ని నడిపారు. వారందరూ మహిళలే. వారు సరిగ్గా చెప్పారు - ఇవాళ  ప్రతి రంగంలోనూ స్త్రీలు రాణించడమే కాకుండా నేతృత్వాన్ని వహిస్తున్నారు. ఇవాళ ప్రతి రంగంలో కూడా అందరి కంటే ఎక్కువగా మన స్త్రీలే ఏదో ఒకటి సాధించి చూపెడుతున్నారు. పునాదిరాళ్లను వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గౌరవనీయులైన రాష్ట్రపతిగారు ఒక కొత్త పనిని ప్రారంభించారు.

 

వారి వారి రంగాల్లో మొట్టమొదటిగా ఏదో ఒకటి సాధించిన ఒక అసాధారణ మహిళల బృందాన్ని రాష్ట్రపతిగారు కలిసారు. దేశంలోని ఈ మహిళా సాధకుల్లో , మొదటి మహిళా మర్చెంట్ నేవీ కేప్టెన్, పాసింజరు ట్రైన్ తాలూకూ మొదటి మహిళా ట్రైన్ డ్రైవర్, మొదటి అగ్నిమాపక సిబ్బంది(ఫైర్ ఫైటర్), మొదటి మహిళా బస్ డ్రైవర్, అంటార్క్టికా చేరిన మొదటి మహిళ, ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళ, ఇలా ప్రతి రంగంలోని మొదటి మహిళలను కలిసారు. మన స్త్రీ శక్తి, సమాజంలోని సాంప్రదాయక కట్టుబాట్లను అధిగమిస్తూ అసాధారణ విజయాలను సాధించారు. ఒక రికార్డుని నెలకొల్పారు. కష్టపడి, ఏకాగ్రత, ధృఢసంకల్పాలతో పని చేస్తే, ఎన్నో అవాంతరాలనూ, బాధలనూ అధిగమిస్తూ ఒక నూతన మార్గాన్ని తయారు చేయవచ్చు అని వారు నిరూపించారు. ఆ మార్గం తమ సమకాలీనులనే కాక రాబోయే తరాల వారికి కూడా ప్రేరణను అందించి, వారికి ఒక కొత్త ఉత్సాహాన్ని అందించేదిగా అది నిలుస్తుంది. దేశం మొత్తం ఈ స్త్రీ శక్తి గురించి తెలుసుకోవడానికి, వారి జీవితాల నుండి, వారి పనుల నుండి ప్రేరణను పొందేందుకు వీలుగా ఈ women achievers, first ladies  పై ఒక పుస్తకం కూడా తయారైంది. ఇది నరేంద్ర మోదీ వెబ్సైట్ లో ఈ-పుస్తకం రూపంలో లభ్యమౌతోంది.

 

ఇవాళ దేశంలోనూ, సమాజంలోనూ జరుగుతున్న సానుకూలమైన మార్పుల్లో దేశ స్త్రీ శక్తి తాలూకూ ముఖ్యంమైన పాత్ర ఉంది. ఇవాళ మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక రైల్వే స్టేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మహిళా సాధికారత కూ, ఒక ఒక రైల్వే స్టేషన్ కూ గల సంబంధం ఏమిటా అని మీరు అనుకోవచ్చు. ముంబయ్ లోని మాటుంగా స్టేషన్ మొత్తం మహిళా సిబ్బందితో నిండిన భారత దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ . అక్కడ అన్ని విభాగాల్లోనూ మహిళా సిబ్బందే. వాణిజ్య విభాగంలోనూ, రైల్వే పోలీస్ లో, టికెట్ చెకింగ్ లో, అనౌన్స్ మెంట్ సిబ్బంది లో, పోయింట్ పర్సన్ లోనూ, నలభై కంటే అధికంగా అందరూ మహిళా సిబ్బందే. ఈసారి గణతంత్ర దినోత్సవ పెరేడ్ చూసిన తర్వాత చాలామంది ప్రజలు ట్విట్టర్, ఇతర సాంఘిక మాధ్యమాల ద్వారా పెరేడ్లో వారు గమనించిన ముఖ్యమైన అంశం గురించే రాసారు. అది అందరూ మహిళలే పాల్గొన్న సాహసవంతమైన ప్రయోగం BSF Biker Contingent  గురించే! ఈ సాహసవంతమైన ప్రయోగ దృశ్యం విదేశాలనుండి వచ్చిన అతిధులందరినీ కూడా ఆశ్చర్య చకితులను చేసింది. ఇది మహిళా సాధికారతకూ, ఆత్మవిశ్వాసానికీ ఒక రూపం. ఇవాళ మన మహిళలు నాయకత్వాన్ని వహిస్తున్నారు. స్వశక్తులుగా మారుతున్నారు. ఇలాంటిదే మరొక విషయం నా దృష్టికి వచ్చింది. ఛత్తీస్ గడ్ కు చెందిన మన ఆదివాసీ మహిళలు ఒక గొప్ప పని చేసారు. ఒక గొప్ప ఉదాహరణను చూపెట్టారు. ఆదీవాసీ మహిళల విషయం అనగానే అందరి మనసుల్లో ఒక ఖచ్చితమైన చిత్రం కనబడుతుంది. ఒక అడవి, అందులో తలపాగాల చుట్టలపై కట్టేల మూటల బరువుని మోసు నడుస్తున్న మహిళల చిత్రం కనబడుతుంది. కానీ ఛత్తీస్ గడ్ కు చెందిన మన ఆదివాసీ మహిళలు దేశానికి ఒక కొత్త చిత్రాన్ని చూపించారు. ఛత్తీస్ గడ్ లో దంతేవాడ ప్రాంతంలో హింస, అత్యాచారాలతో, బాంబులు, తుపాకులతో, మావోయిస్టులు ఒక భయంకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఉంచారు. అలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో ఆదివాసీ మహిళలు ఈ-రిక్షా ను నడిపి తమ కాళ్లపై తాము నిలబడ్డారు. అతికొద్ది సమయంలోనే ఎందరో మహిళలు ఇందులో కలిసారు. దీనివల్ల మూడు లాభాలు జరుగుతున్నాయి. ఒకవైపు స్వయంఉపాధి వారిని స్వశక్తులుగా తయారుచేసింది. మరోవైపు మవోవాద ప్రభావమున్న ఆ ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయి. వీటితో పాటూ పర్యావరణ పరిరక్షణకు కూడా బలం చేకూరుతోంది. ఇందుకు అక్కడి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అభినందిస్తున్నాను. దీనికి అవసరమైన ధన సహాయాన్ని అందించడం మొదలుకొని వారికి శిక్షణను ఇవ్వడం వరకూ, ఈ మహిళల విజయానికి జిల్లా అభికార యంత్రాంగం ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది.

 

"మాలో మార్పు రాదు..మేమింతే" అనే మాటలు కొందరి నుండి మనం పదే పదే వింటూంటాం. ఆ విషయం ఏమిటంటే వినమ్రత, పరివర్తన. మన చేతుల్లో లేనిదాన్ని వదిలెయ్యాలి, అవసరమైన చోట మార్పులు స్వీకరించాలి. తనను తాను సరిదిద్దుకోవడం మన సమాజంలోని ప్రత్యేకత. ఇటువంటి భారతీయ సాంప్రదాయం, ఇటువంటి సంస్కృతి మనకు వారసత్వంగా లభించాయి. తనని తాను సరిదిద్దుకునే పధ్ధతే ప్రతి చైతన్యవంతమైన సమాజపు లక్షణం. యుగాలుగా మన దేశంలో వ్యక్తిగతంగానూ, సామాజిక స్థాయిలో కూడా సామాజంలోని మూఢనమ్మకాలకు, చెడు పధ్ధతులకు వ్యతిరేకంగా నిలబడి ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీహార్ ఒక ఆసక్తికరమైన కొత్త తరహా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని సామాజంలోని చెడు పధ్ధతులను వేళ్లతో పెకిలించివెయ్యడానికి పదమూడువేల కంటే ఎక్కువ కిలోమీటర్ల ప్రపంచంలోనే అతిపెద్ద మానవహారం(Human Chain ) చేసారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను బాల్య వివాహాలకు, వరకట్న దురాచారాలకూ వ్యతిరేకంగా అప్రమత్తులను చేసారు. బాల్య వివాహాలకు, వరకట్న దురాచారాలు మొదలైన చెడు పధ్ధతులకు వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రం పోరాటం చెయ్యాలని సంకల్పించింది. పిల్లలు, పెద్దలు, ఉత్సాహంతో నిండిన యువత, తల్లులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగమయ్యారు. పట్నా లోని చారిత్రక గాంధీ మైదానం నుండి మొదలైన ఈ మానవ హారం రాష్ట్ర సరిహద్దుల వరకూ అనూహ్యంగా ప్రజలను కలుపుకుంటూ సాగింది. సమాజంలో ప్రజలందరికీ సరైన విధంగా అభివృధ్ధి ఫలితాలు అందాలంటే, సమాజం ఇటివంటి చెడు పధ్ధతుల నుండి విముక్తి చెందాలి. రండి, మనందరమూ కలిసి ఇలాంటి చెడు పధ్ధతుల సమాజం నుండి నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఒక నవ భారత దేశాన్నీ, ఒక సశక్తమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. నేను బిహార్ రాష్ట్ర ప్రజలనూ, ముఖ్యమంత్రినీ, అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని, ఆ మానవహారంలో పాల్గొన్న ప్రతి వ్యక్తినీ వారి సమాజ కల్యాణం దిశగా ఇంతటి విశిష్టమైన, విస్తృతమైన ప్రయత్నం చేసినందుకుగానూ అభినందిస్తున్నాను.

 

నా ప్రియమైన దేశప్రజలారా, కర్ణాటక లోని మైసూర్ కు చెందిన దర్శన్ గారు మై గౌ యాప్ లో ఏం రాసారంటే,  వారి తండిగారి వైద్యానికి నెలకు ఆరువేలు ఖర్చు అయ్యేవిట. వారికి ముందర ప్రధానమంత్రి జన ఔషధీ పథకం గురించి తెలీదట. జన ఔషధీ కేంద్రం గురించి తెలిసిన తర్వాత అక్కడ మందులు కొనటం మొదలుపెట్టాకా, అతనికి మందుల ఖర్చు 75 శాతం వరకూ తగ్గిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకుని, ఎక్కువమంది ప్రజలు లాభం పొందాలనే ఉద్దేశంతో ’మనసులో మాట ’ కార్యక్రమంలో నేనీ విషయాన్ని ప్రస్తావించాలని వారు కోరారు. కొద్ది కాలంగా ప్రజలు ఈ విషయాన్ని నాకు రాస్తున్నారు. చెప్తున్నారు. ఈ పథకం ద్వారా లాభం పొందిన వారి వీడియోలు సామాజిక మాధ్యమాలలో నేను చూశాను. ఇటువంటి సమాచారం తెలిస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎంతో సంతోషం లభిస్తుంది. తనకు లభించినది ఇంకెందరికో కూడా లభించాలనే దర్శన్ గారి ఆలోచన నాకెంతో నచ్చింది. హెల్త్ కేర్ ను  అందుబాటులోకి తేవడం, ఈజ్ ఆఫ్ లివింగ్ ను ప్రోత్సహించడం ఈ పథకం వెనుక ఉద్దేశం. జన ఔషథ కేంద్రాల్లో లభించే మందులు బజార్లో అమ్మకమయ్యే బ్రాండెడ్ మందుల కన్నా ఏభై నుండీ తొంభై శాతం వరకూ చవకగా లభిస్తాయి. ఇందువల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిత్యం మందులు వాడే వయోవృధ్ధులకు ఎంతో ఆర్థిక సహాయం లభిస్తుంది. డబ్బు ఆదా కూడా అవుతుంది. ఇందులో కొనుగోలు అయ్యే జెనిరిక్ మందులు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ణయించిన స్థాయిలోనే ఉంటాయి. ఈ కారణంగా మంచి క్వాలిటీ మందులు తక్కువ ధరకే లభిస్తాయి. ఇవాళ దేశం మొత్తంలో మూడు వేల జన ఔషథ కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఇందువల్ల మందులు చవకగా లభించడమే కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకునేవారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. చవక ధరల్లోని మందులు భారతీయ ప్రధానమంత్రి జన ఔషథ కేంద్రాల్లోనూ, ఆసుపత్రుల్లోని ’అమృత్ స్టోర్స్ ’ లోనూ అభ్యమౌతాయి. దేశంలోని ప్రతి నిరుపేద పౌరుడికీ నాణ్యమైన ఆరోగ్యసేవలను అందుబాటులో ఉండే విధంగా చెయ్యాలనేదే ఈ పథకం ఉద్దేశం. తద్వారా ఆరోగ్యకరమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడమే ముఖ్యోద్దేశం.

 

నా ప్రియమైన దేశప్రజలారా, మహారాష్ట్రకు చెందిన మంగేష్ గారు నరేంద్ర మోదీ యాప్ కు ఒక ఫోటోను పంపించారు. నా దృష్టిని ఆవైపుకి తిప్పుకునేలా ఆ ఫోటో ఉంది. అందులో ఒక మనవడు, తన తాతయ్యతో కలిసి క్లీన్ మోర్నా నదిని శుభ్రపరిచే కార్యక్రమంలో పలుపంచుకుంటున్నాడు. అకోలా లోని ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోర్నా నదిని శుభ్రపరచడానికి పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్నా నది ఇదివరకూ పన్నెండు నెలలలోనూ ప్రవహించేది. ఇప్పుడు అది కొన్ని నెలలలో మాత్రమే ప్రవహిస్తోంది. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, నది పూర్తిగా కలుపు, గుర్రపు డెక్కతో నిండిపోయింది. నడి ఒడ్డున కూడా చాలా చెత్త పారేస్తున్నారు. అందుకని ఒక ఏక్షన్ ప్లాన్ తయారుచేసుకుని, మకర సంక్రాంతి ముందరి రోజు నుండీ, అంటే జనవరి పదమూడు నుండీ ‘Mission Clean Morna’  లో మొదటి భాగంగా నాలుగు కిలోమీటర్ల పరిధిలో పధ్నాలుగు స్థానాల్లో మోనా నదికి ఇరువైపులా శుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. ‘Mission Clean Morna’ పేరన జరిగిన ఈ మంచి కార్యక్రమంలో అకోలా కు చెందిన ఆరువేలకు పైగా ప్రజలు, వందకు పైగా ఎన్.జీ.ఓలు, కళాశాలలూ, విద్యార్థులు, పిల్లలు, వృధ్ధులు, తల్లులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. 20  జనవరి 2018 నాడు కూడా ఈ పరిశుభ్రతా కార్యక్రమం జరిగింది. మోర్నా నది పూర్తిగా శుభ్రపడేవరకూ, ప్రతి శనివారం ఉదయం ఈ శుభ్రతా కార్యక్రమం జరుగుతుందని నాకు చెప్పారు. మనిషి ఏదైనా సాధించాలని పట్టుపడితే, సాధించలేనిదేదీ లేదని ఈ విషయం నిరూపిస్తుంది. ప్రజాఉద్యమాల ద్వారా పెద్ద పెద్ద మార్పులు తీసుకురావచ్చు. నేను అకోలా ప్రజలకూ, అక్కడి జిల్లా, నగర పురపాలక శాఖకూ, ఈ పనిని ప్రజాఉద్యమంగా మార్చిన ప్రతి పౌరుడికీ, వారి వారి ప్రయత్నాలకు గానూ ఎంతగానో అభినందిస్తున్నాను. మీ ఈ ప్రయత్నం దేశంలోని ఎందరికో ప్రేరణని ఇస్తుంది.

 

 

నా ప్రియమైన దేశప్రజలారా, ఈమధ్య పద్మ పురస్కారాలపై జరుగుతున్న చర్చలను మీరూ వినే ఉంటారు. వార్తాపత్రికలు, టివీ ఈ విషయంపై మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాస్త నిశితంగా గమనిస్తే మీకు గర్వంగా అనిపిస్తుంది. ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన మధ్య ఉన్నారో అని గర్వం కలుగుతుంది. మన దేశంలో సామాన్య వ్యక్తులు కూడా ఏ రకమైన సహాయం లేకుండా అంతటి స్థాయికి చేరుకుంటున్నందుకు స్వాభావికంగానే మనకి గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఏడాదీ పద్మ పురస్కారాలను ఇచ్చే సంప్రదాయం ఉంది కానీ గత మూడేళ్ళుగా పద్మ పురస్కారాల ప్రక్రియ మారింది. ఇప్పుడు ఏ పౌరుడైనా ఈ పురస్కారానికై ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. ప్రక్రియ అంతా ఆన్లైన్ లోకి రావడంతో పారదర్శకత వచ్చింది. ఒకరకంగా ఈ పురస్కారాల ఎన్నిక ప్రక్రియ మొత్తం మారిపోయింది. చాలా సాధారణమైన వ్యక్తులకు కూడా పద్మ పురస్కారాలు లభించడం మీరూ గమనించే ఉంటారు. సాధారణంగా టీవీల్లోనూ, పెద్ద పెద్ద నగరాల్లో, వార్తాపత్రికలలోనూ, సభల్లోనూ కనబడని వ్యక్తులకు పద్మ పురస్కారాలు లభిస్తున్నాయి. ఇందువల్ల పురస్కారాన్ని ఇవ్వడం కోసం వ్యక్తి పరిచయానికి కాకుండా అతడు చేస్తున్న పని ప్రాముఖ్యం పెరుగుతోంది.  ఐ.ఐ.టి కాన్పూర్ విద్యార్థి అయిన అరవింద్ గుప్తా గారు పిల్లలకు బొమ్మలు తయారుచెయ్యడంలోనే తన పూర్తి జీవితాన్ని గడిపేసారన్న సంగతి విని మీరు ఆనందిస్తారు. పిల్లలలో విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచడానికి ఆయన గత నలభై ఏళ్ళుగా , పనికిరాని వస్తువులతో బొమ్మలు తయారుచేస్తున్నారు. పిల్లలు పనికిరాని వస్తువులతో విజ్ఞానపరమైన ప్రయోగాలు చెయ్యడానికి ప్రేరణ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన దేశవ్యాప్తంగా మూడు వేల పాఠశాలకు వెళ్ళి 18 భాషల్లో తయారైన చలనచిత్రాలను చూపెట్టి పిలల్లకు ప్రేరణను అందిస్తున్నారు. ఎంతటి అద్భుతమైన జీవితమో! ఎంతటి అద్భుతమైన సమర్పణా భావమో!

 

ఇలాంటి కధే కర్నాటక కు చెందిన సీతవ్వ జోదట్టి (SITAVAA JODATTI) ది కూడా. వీరికి ’ महिला-सशक्तीकरण की देवी ’ అనే బిరుదు ఊరికే రాలేదు. ఆవిడ గత ముఫ్ఫై ఏళ్ళుగా బెలాగవీ (BELAGAVI) లో లెఖ్ఖలేనందరు మహిళల జీవితాలు మార్పు చెందటానికి గొప్ప సహకారాన్ని అందించారు. ఏడేళ్ళ వయసులోనే దేవదాసిగా మారారు. తర్వాత దేవదాసీల అభివృధ్ధి కోసమే తన పూర్తి జీవితాన్ని అంకితం చేసారు. ఇంతేకాక వీరు దళిత మహిళల జీవితాల కోసం కూడా  అపూర్వమైన కార్యక్రమాలు చేసారు.

 

మధ్యప్రదేశ్ కు చెందిన బజ్జూ శ్యామ్ గురించి కూడా మీరు వినే ఉంటారు. వీరు ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. జీవితం గడుపుకోవడానికి ఒక మామూలు ఉద్యోగం చేసేవారు. కానీ ఆయనకు సాంప్రదాయ ఆదివాసీల చిత్రాలు వేసే అలవాటు ఉండేది. ఇదే వ్యాపకం ఆయనకు భారతదేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా కూడా ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. నెదర్ల్యాండ్స్, జర్మనీ, ఇంగ్లాండ్, ఇటలీ లాంటి ఎన్నో దేశాల్లో ఈయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. విదేశాలలో భారతదేశం కీర్తిని పెంచిన బజ్జూ శ్యామ్ గారి ప్రతిభను గుర్తించి, ఆయనకు పద్మశ్రీని ఇచ్చారు.

 

కేరళకు చెందిన లక్ష్మీ కుట్టి కథను విని మీరు ఆనందాశ్చర్యాలతో ఉండిపోతారు. ఆవిడ కల్లార్ లో ఉపాధ్యాయురాలు. ఇప్పటికీ ఆవిడ దట్టమైన అడవుల్లో ఆదివాసుల ప్రాంతంలో తాటాకులతో నిర్మించిన పాకలో నివసిస్తున్నారు. ఆవిడ తన స్మృతి ఆధారంగా ఐదువందల మూలికా మందులు తయారు చేసారు. మూలికలతో మందులు తయారు చేసారు. పాముకాటుకు ఉపయోగించే మందు తయారుచెయ్యడంలో ఆవిడ సిధ్ధహస్తురాలు. మూలుకా మందులలో తనకున్న పరిజ్ఞానంతో లక్ష్మి గారు నిరంతరం ప్రజల సేవ చేస్తున్నారు. ఈ అజ్ఞాత వ్యక్తిని గుర్తించి ఆవిడ చేసిన సమాజ్ సేవకు  గానూ ఆమెను పద్మశ్రీతో గౌరవించారు.

 

ఇవాళ మరొక పేరును కూడా ప్రస్తావించాలని నాకు అనిపిస్తోంది. పశ్చిమ బెంగాలు కు చెందిన డెభ్భై ఐదు ఏళ్ల సుభాషిణీ మిస్త్రీ. వారిని కూడా పద్మ పురస్కారానికి ఎన్నుకున్నారు. ఒక ఆసుపత్రిని నిర్మించడానికి సుభాషిణీ మిస్త్రీ గారు ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమారు, కూరగాయలు అమ్మారు. ఇరవై మూడేళ్ల వయసులో వైద్యసదుపాయం అందక ఆవిడ భర్త మరణించారు. ఆ సంఘటన ఆవిడలో పేదవారి కోసం ఆసుపత్రి నిర్మించాలనే సంకల్పాన్ని కల్గించింది. ఇవాళ ఆవిడ ఎంతో కష్టంతో నిర్మించిన ఆసుపత్రిలో ఎందరో వేలమంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మన బహురత్న భారతభూమిలో ఎవరికీ తెలియని, ఎవరూ గుర్తించని ఇలాంటి నర,నారీ రత్నాలెందరో ఉన్నారని  నాకు ఎంతో నమ్మకం. ఇలాంటి వ్యక్తులకు గుర్తింపు లేకపోవడం సమాజానికే నష్టం. మన చుట్టుపక్కల  సమాజం కోసం జీవిస్తున్న వారు, సమాజం కోసం జీవితాలను అంకితం చేసేవారు, ఏదో ఒక ప్రత్యేకతతో జీవితమంతా లక్ష్యంతో పనిచేసేవారు ఉన్నారు. వారిని ఎప్పటికైనా సమాజంలోకి తీసుకురావాలి. అందుకు పద్మ పురస్కారాలు ఒక మాధ్యమం. వారు గౌరవమర్యాదలను కోరుకోరు. వాటి కోసం పనిచెయ్యారు. కానీ వారి పనుల ద్వారా మనకు ప్రేరణ లభిస్తుంది. పాఠశాలకూ, కళాశాలలకూ పిలిచి వారి అనుభవాలను అందరూ వినాలి. పురస్కారాలను దాటుకుని కూడా సమాజంలో కొన్ని ప్రయత్నాలు జరగాలి.

 

ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదిని మనం ప్రవాస భారతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. గాంఢీగారు ఇదే తేదీన సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజున మనం భారతదేశంలోనూ, ప్రపంచంలోని నలుమూలల్లోనూ నివసిస్తున్న భారతీయులందరి మధ్యనున్న వీడని బంధానికి ఉత్సవాన్ని జరుపుకుంటాము. ఈసారి ప్రవాస భారతీయ దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు, మేయర్ల ను అందరికీ మనం ఒక కార్యక్రమానికి ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో Malaysia, New Zealand, Switzerland, Portugal, Mauritius, Fiji, Tanzania, Kenya, Canada, Britain, Surinam, దక్షిణ ఆఫ్రికా, ఇంకా అమెరికాల నుండి, ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ మన భారత సంతతికి చెందిన మేయర్లున్నారో, ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ మన భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, వారంతా పాల్గొన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు, ఆయ దేశాల సేవలు చేస్తూనే, భారత దేశంతో కూడా తమ సంబంధాలను బలంగా నిలుపుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈసారి ఐరోపా సంఘం నాకొక కేలెండర్ ను పంపించింది. అందులో వారు యూరప్ లో వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ద్వారా విభిన్న రంగాల్లో వారు చేస్తున్న పనులను మంచిగా చూపించారు. యూరప్ లో వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల కొందరు సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తుంటే, కొందరు ఆయుర్వేదానికి అంకితమయ్యారు. కొందరు తమ సంగీతంతోనూ, మరికొందరు కవిత్వంతోనూ సమాజాన్ని రంజింపజేస్తున్నారు. కొందరు వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తే, కొందరు భారతీయ గ్రంధాలపై పనిచేస్తున్నారు. ఒకరు ట్రక్ నడిపి గురుద్వారా నిర్మిస్తే, మరొకరు మసీదు నిర్మించారు. మన భారతీయులు ఎక్కడ ఉన్నా వారు అక్కడ ఉన్న భూమిని ఏదో ఒకరకంగా అలంకరించారు. ఇటువంటి చెప్పుకోదగ్గ కార్యక్రమానికి గానూ, భారతీయ మూలాలున్న ప్రజలను గుర్తించడానికీ, వారి మాధ్యమం ద్వారా ప్రపంచంలోని ప్రజలకు వారి సమాచారాన్ని తెలిపినందుకు గానూ  ఐరోపా సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

 

జనవరి ముఫ్ఫై వ తేదీ మనందరికీ సరైన మార్గాన్ని చూపిన పూజ్య బాపూజీ వర్థంతి.  ఆరోజు మనం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. ఆ రోజున దేశరక్షణకు తమ ప్రాణాలను అర్పించిన గొప్ప అమరవీరులకు పదకొండు గంటలకు శ్రధ్ధాంజలి అర్పిస్తాము. శాంతి, అహింసల మార్గమే బాపూజీ మార్గం. భారతదేశమైన, ప్రపంచమైనా, ఒక వ్యక్తి అయినా, కుటుంబమయినా, సమాజం యావత్తూ పూజించే బాపూజీ ఏ ఆదర్శాల కోసమై జీవించారో, ఏ విషయాలు మనకు చెప్పారో, అవి నేటికి కూడా అవి అత్యంత ఉపయుక్తమైనవి. అవి కేవలం కాయితపు సిధ్ధాంతాలు మాత్రమే కాదు. ప్రస్తుత కాలంలో కూడా మనం అడుగడుగునా బాపూజీ మాటలు ఎంట నిజమైనవో చూశ్తున్నాం. మనం బాపూజీ బాటలో నడవాలని సంకల్పించి, ఎంత నడవగలమో అంత నడిస్తే అంతకు మించిన శ్రధ్దాంజలి బాపూజీకి ఏమి ఉంటుంది?

 

నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ 2018 కి గానూ శుభాకాంక్షలు తెలుపుతూ, నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi distributes 6.5 million 'Svamitva property' cards across 10 states

Media Coverage

PM Modi distributes 6.5 million 'Svamitva property' cards across 10 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates the Indian women’s team on winning the Kho Kho World Cup
January 19, 2025

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian women’s team on winning the first-ever Kho Kho World Cup.

He wrote in a post on X:

“Congratulations to the Indian women’s team on winning the first-ever Kho Kho World Cup! This historic victory is a result of their unparalleled skill, determination and teamwork.

This triumph has brought more spotlight to one of India’s oldest traditional sports, inspiring countless young athletes across the nation. May this achievement also pave the way for more youngsters to pursue this sport in the times to come.”