షేర్ చేయండి
 
Comments

 

గౌరవనీయులైన మిత్రులారా!

వాతావరణ అనుసరణ సదస్సును భారదేశం స్వాగతిస్తోంది, ఈ విషయంపై నాయకత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి మార్క్ రుట్టే నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది. 

గతంలో కంటే ఈ రోజున వాతావరణ అనుసరణ చాలా ప్రధానమైన అంశంగా ఉంది.

దీనికి తోడు, ఇది భారతదేశ అభివృద్ధి ప్రయత్నాలలో, కీలకమైన అంశంగా ఉంది.

మనకు మనమే ఈ కింది విషయాల్లో వాగ్దానం చేసుకున్నాము : 

*     మనం మన పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడమే కాదు, వాటిని మించి సాధిద్దాం;

*     మనం పర్యావరణ క్షీణతను అరికట్టడంతో పాటు, పర్యావరణాన్ని పునరుద్ధరించుకుందాం.  

*     మనం క్రొత్త సామర్థ్యాలను సృష్టించడంతో పాటు, వాటిని ప్రపంచ మంచి కోసం ఉపయోగపడేలా చేద్దాం.  

మా చర్యలే, మా నిబద్ధతను చాటుతాయి. 

2030 నాటికి 450 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. 

ఎల్.ఈ.డి. లైట్లను ప్రోత్సహిస్తున్నాము; ఏటా 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తున్నాము. 

2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించబోతున్నాం.

80 మిలియన్ల గ్రామీణ గృహాలకు వంట కోసం స్వచ్ఛమైన ఇంధనాన్ని అందిస్తున్నాము.

64 మిలియన్ల గృహాలకు పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాము. 

దీనికి తోడు, మా కార్యక్రమాలు, కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు.

అంతర్జాతీయ సౌర కూటమి లోనూ, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలోనూ, మేము నిర్వహించే పాత్ర,  ప్రపంచ వాతావరణ భాగస్వామ్య శక్తిని చాటుతోంది.

ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణను పెంపొందించడానికి, సి.డి.ఆర్.‌ఐ. తో కలిసి పనిచేయాలని, అనుసరణపై ప్రపంచ కమీషన్ను, నేను ఆహ్వానిస్తున్నాను.

అదేవిధంగా, ఈ ఏడాది చివర్లో భారతదేశంలో జరిగే విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలపై నిర్వహించే మూడవ అంతర్జాతీయ సమావేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.

గౌరవనీయులైన మిత్రులారా!

భారతదేశ నాగరిక విలువలు ప్రకృతికి అనుగుణంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తాయి.

 

 

అదే విధంగా, భూ గ్రహంతో మనకున్న సంబంధం తల్లి, బిడ్డల అనుబంధం వంటిదని, మన పురాతన గ్రంథం యజుర్వేదం, మనకు బోధిస్తోంది.

మనం, భూ మాతను జాగ్రత్తగా చూసుకుంటే, ఆమె మనలను చక్కగా పెంచి, పోషిస్తూనే ఉంటుంది.

వాతావరణ మార్పులను అనుసరించడానికి వీలుగా, మన జీవన విధానాలు కూడా ఈ ఆదర్శానికి అనుగుణంగా ఉండాలి.

ఈ విశ్వాసమే,  మనం ముందుకు సాగడానికి,  మార్గనిర్దేశం చేయాలి.

 

మీకు నా ధన్యవాదములు !

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
How India is becoming self-reliant in health care

Media Coverage

How India is becoming self-reliant in health care
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 అక్టోబర్ 2021
October 26, 2021
షేర్ చేయండి
 
Comments

PM launches 64k cr project to boost India's health infrastructure, gets appreciation from citizens.

India is making strides in every sector under the leadership of Modi Govt