షేర్ చేయండి
 
Comments
India will emerge stronger only when we empower our daughters: PM Modi
In almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years: PM
Our government is extensively working to enhance quality of life for the poor and middle class: Prime Minister

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు హ‌రియాణా లో కురుక్షేత్ర ను సంద‌ర్శించారు.  మ‌హిళా స‌ర్పంచుల తో ఏర్పాటు చేసిన‌ స్వ‌చ్ఛ్ శ‌క్తి-2019 స‌ద‌స్సు లో ఆయ‌న పాలుపంచుకొని, దేశ‌వ్యాప్తం గా త‌ర‌లి వ‌చ్చిన మ‌హిళా స‌ర్పంచు ల‌కు స్వ‌చ్ఛ్ శ‌క్తి-2019 పుర‌స్కారాల ను అంద‌జేశారు.  కురుక్షేత్ర లో ఏర్పాటైన స్వ‌చ్ఛ్ సుంద‌ర్ శౌచాల‌య్ ప్ర‌ద‌ర్శ‌న ను ప్ర‌ధాన మంత్రి సందర్శించారు.  హ‌రియాణా లో అనేక అభివృద్ధి ప‌థ‌కాల ను ఆయ‌న ప్రారంభించారు; మ‌రికొన్ని ప‌థ‌కాల కు శంకుస్థాప‌న చేశారు.  ఈ సంద‌ర్భం గా హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ ఖట్టర్ మరియు ప‌లువురు ఇత‌ర ప్ర‌ముఖులు హాజరయ్యారు.

దేశం లోని వివిధ ప్రాంతాల నుండి స్వ‌చ్ఛాగ్రహీ లు త‌ర‌లిరావ‌డం తో ఒక ‘న్యూ ఇండియా’ కోసం స్వ‌చ్ఛ్ భార‌త్ ను ఆవిష్క‌రించే సంక‌ల్పం బ‌లోపేత‌ం అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

హ‌రియాణా ప్ర‌జ‌ల తో ఒక భావోద్వేగ భ‌రిత‌మైన బంధాన్ని ప్ర‌ధాన మంత్రి ఏర్ప‌ర‌చుకొంటూ, ఈ రాష్ట్రం ‘ఒక ర్యాంకు, ఒక పెన్శన్’ కు, బేటీ బ‌చావో, బేటీ ప‌ఢావో కు మార్గదర్శకం కావడంతో పాటు  ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం తొలి ల‌బ్దిదారు గా హ‌రియాణా కు చెందిన ఒక కుమార్తె నిలిచారని గుర్తు కు తెచ్చారు.

సాధికారిత ను సంత‌రించుకొన్న మ‌హిళ‌లే ఒక సాధికార స‌మాజాన్ని మ‌రియు ఒక బ‌ల‌మైన దేశాన్ని ఆవిష్క‌రించ‌గ‌లుగుతార‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  బేటీ బ‌చావో బేటీ ప‌ఢావో, ఉజ్జ్వ‌ల యోజ‌న‌, రాష్ట్రీయ పోష‌ణ్ అభియాన్‌, ప్ర‌ధాన మంత్రి సుర‌క్షిత్ మాతృత్వ అభియాన్, ప్ర‌సూతి సెల‌వులు 12 వారాల నుండి 26 వారాల‌కు పొడిగింపు, ఇంకా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న లో భాగం గా గృహాల యాజ‌మాన్యాన్ని ముందుగదా మ‌హిళ‌ల‌ కు అప్ప‌గించ‌డం వంటి కార్య‌క్ర‌మాలు మ‌హిళ‌ల స‌శ‌క్తీక‌ర‌ణ లో ఏ విధంగా ఒక కీల‌క‌ పాత్ర‌ ను పోషించిందీ ఆయ‌న వివ‌రించారు.  ‘‘అత్యాచారాల‌ కు మ‌ర‌ణ శిక్ష‌ను విధించిన తొలి ప్ర‌భుత్వం మేమే’’ అని కూడా ఆయ‌న అన్నారు.

ముద్ర (MUDRA)లో భాగం గా మంజూరు చేసిన రుణాల లో దాదాపు 75 శాతం రుణాల ను మ‌హిళా న‌వ‌పారిశ్రామికుల‌ కు ఇవ్వ‌డ‌మైంద‌ని ఆయ‌న అన్నారు.  సుమారు 6 కోట్ల మంది మ‌హిళ‌లు దీన్ ద‌యాళ్ అంత్యోద‌య ప‌థ‌కం లో భాగంగా స్వ‌యం స‌హాయ బృందాల లో చేరిన‌ట్లు, మ‌రి అలాగే ఆ విధ‌మైన స్వ‌యం స‌హాయ బృందాల‌ కు 75 వేల  కోట్ల రూపాయ‌ల కు పైగా రుణాల ను అందించ‌డం జ‌రిగిన‌ట్లు తెలిపారు.  ఈ మొత్తం 2014వ సంవ‌త్స‌రం క‌న్నా మునుప‌టి నాలుగు సంవ‌త్స‌రాల లో కేటాయించిన దానికి రెండున్న‌ర రెట్లు అధిక‌మ‌ని వివ‌రించారు.

‘‘ఆరోగ్య‌వంత‌మైన మ‌రుగుదొడ్ల కొర‌త కార‌ణంగా మ‌న మాతృ మూర్తులు, పుత్రిక‌లు నిరంత‌రం సంఘ‌ర్ష‌ణ కు లోన‌వ‌డం న‌న్ను బాధించింది.  మ‌రి నేను ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి స్వ‌చ్ఛ్ భార‌త్ ప్ర‌తిజ్ఞ‌ ను స్వీక‌రించాను.  స్వాతంత్య్రం సిద్ధించిన సుమారు 75 సంవ‌త్స‌రాల లో స్వ‌స్థ‌త ప‌రిధి దాదాపు 40 శాతం గా ఉండింది.  అది ప్ర‌స్తుతం 98 శాతాని కి చేరుకొంది.  10 కోట్ల కు పైగా విశ్రాంతి గ‌దుల‌ ను నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  600 జిల్లాల లో 5 ల‌క్ష‌ల ప‌ల్లెలు బ‌హిరంగ ప్ర‌దేశాల లో మ‌ల‌ మూత్ర విస‌ర్జ‌న కు తావు లేనివి గా మారాయి.  ఇది వారి కి ఒక గౌర‌వ ప్ర‌ద‌మైన జీవ‌నాన్ని ఇచ్చింది’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ఝ‌జ్జ‌ర్ జిల్లా లో గ‌ల బాఢ్‌సా గ్రామం లో జాతీయ కేన్స‌ర్ సంస్థ (ఎన్‌సిఐ)ని ప్ర‌ధాన మంత్రి కురుక్షేత్ర నుండే ప్రారంభించారు.
 
అంద‌రికీ.. ప్ర‌త్యేకించి ఆ స‌దుపాయం యొక్క వ్య‌యాన్ని భ‌రించ‌లేని వారికి, అందుకు ఎంతో ఖ‌రీదు అవుతుంద‌ని త‌ల‌చే వారికి.. ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాన్ని అందించాలని ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  త‌న ప్ర‌భుత్వం చేస్తున్న కృషి ని గురించి ఆయ‌న మ‌రింత‌గా వివ‌రిస్తూ, ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల మ‌రియు సంస్థ‌ ల సంఖ్య ను చెప్పుకోద‌గిన స్థాయి లో పెంచ‌డం జ‌రిగింద‌న్నారు.  దేశం లో 21 ఎఐఐఎమ్ఎస్ లు కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డ‌మో, లేదా శీఘ్ర‌ గ‌తి న నిర్మాణాధీనం లో ఉండ‌ట‌మో జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.  ఈ 21 ఎఐఐఎమ్ఎస్ ల‌లో 14 ఎఐఐఎమ్ఎస్ లు 2014 వ సంవ‌త్స‌రం త‌రువాత ఆరంభం అయ్యాయ‌న్నారు.  ప్ర‌స్తుతం ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల వెల్‌నెస్ సెంట‌ర్లు ఏర్పాటు కావ‌డం తో పాటు ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం ద్వారా మేము అంద‌రికీ ఆరోగ్యం అందేట‌ట్లుగా ఏక‌ కాలం లో కృషి చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

కురుక్షేత్ర లో శ్రీ‌కృష్ణ ఆయుష్ యూనివ‌ర్సిటీ కి ప్ర‌ధాన మంత్రి పునాదిరాయి ని వేశారు.  ఇది ప్ర‌పంచం లోనే ఈ త‌ర‌హా తొలి విశ్వ‌విద్యాల‌యం.  ఇక్క‌డ ఆయుర్వేద‌, యోగ‌, యునానీ, సిద్ధ‌, ఇంకా హోమియోప‌తి వైద్య ప‌ద్ధ‌తుల లో విద్య ను బోధించ‌డం తో పాటు చికిత్స ను అందించ‌డం జ‌రుగుతుంది.

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం గా క‌ర్ నాల్ లో పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ కు, పంచ్‌ కుల లో నేశ‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కు మ‌రియు ఫ‌రీదాబాద్ లో ఇఎస్ఐసి వైద్య క‌ళాశాల మ‌రియు ఆసుప‌త్రి కి శంకుస్థాప‌న లు చేశారు.  

‘బాటిల్స్ ఆఫ్ పానీప‌త్ మ్యూజియ‌మ్’కు ప్ర‌ధాన మంత్రి శంకు స్థాప‌న చేస్తూ, పానీప‌త్ సంగ్రామం ‘ఏక్ భార‌త్ శ్రేష్ఠ భార‌త్’ కు ఒక స‌జీవ ఉదాహ‌ర‌ణ అంటూ అభివ‌ర్ణించారు.

ఈ ప‌థ‌కాల‌న్నీ హ‌రియాణా పౌరుల జీవనాన్ని ఆరోగ్య‌క‌రం గా, స‌ర‌ళ‌త‌రం గా మార్చివేయ‌డమే కాక యువ‌తీయువ‌కుల‌ కు ఉపాధి సంబంధిత నూత‌న అవ‌కాశాల ను తీసుకువస్తాయ‌ని స్ప‌ష్టీక‌రించారు.

స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ ఏ విధంగా విస్త‌రించిందీ తెలుసుకోవడం కోసం ఈ పథకాన్ని నైజీరియా లో కూడా ఎలా అమలు చేయాలనేది ఆకళింపు చేసుకోవడం కోసం నైజీరియా కు చెందిన ప్ర‌తినిధివ‌ర్గం అధ్యయన యాత్ర కు వ‌చ్చిందంటూ  ప్ర‌ధాన మంత్రి వెల్లడించి ఆ ప్ర‌తినిధివ‌ర్గాన్ని ప్రశంసించారు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Swachhata and governance reforms will shape Modi's legacy: Hardeep Singh Puri

Media Coverage

Swachhata and governance reforms will shape Modi's legacy: Hardeep Singh Puri
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates H. E. Jonas Gahr Store on assuming office of Prime Minister of Norway
October 16, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated H. E. Jonas Gahr Store on assuming the office of Prime Minister of Norway.

In a tweet, the Prime Minister said;

"Congratulations @jonasgahrstore on assuming the office of Prime Minister of Norway. I look forward to working closely with you in further strengthening India-Norway relations."