‘వోకల్ ఫార్ లోకల్’, ఆత్మ నిర్భర్ అభియాన్ ల సఫలత మన యువజనుల పై ఆధారపడి ఉంది: ప్రధాన మంత్రి
టీకామందు ను గురించి అవగాహన కల్పించాలని ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ ఇతర సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు

రాబోయే గణతంత్ర దిన కవాతు లో పాలుపంచుకోనున్న ఆదివాసి అతిథులు, ఎన్ ‌సిసి కేడెట్ లు, ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అనగా 2021 జనవరి 14న జరిగిన స్వాగత సత్కారం (‘ఎట్ హోమ్’) కార్యక్రమం లో మాట్లాడారు.  ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింహ్, శ్రీ అర్జున్ ముండా, శ్రీ కిరెన్ రిజీజూ, శ్రీమతి రేణుకా సింహ్ సరూతా లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భం లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గణతంత్ర దిన కవాతు లో ఆదివాసి అతిథులు, కళాకారులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌ సిసి కేడెట్ ల భాగస్వామ్యం ప్రతి ఒక్క పౌరుని లో/పౌరురాలి లో శక్తి ని నింపుతుందన్నారు.  దేశం తాలూకు గొప్ప వైవిధ్యాన్ని వారు ప్రదర్శించడం ప్రతి ఒక్కరిని గర్వంతో నింపివేస్తుంది.  గణతంత్ర దిన కవాతు భారతదేశం ఘన సామాజిక, సాంస్కృతిక వారసత్వాలకు, ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి జీవం పోసిన రాజ్యాంగానికి మనం అందించే ఒక బహుమానం లాంటిదంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు.

ఈ సంవత్సరం లో భారతదేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతోందని, ఈ సంవత్సరం లో మనం గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాష్ పర్వ్ ను జరుపుకొంటున్నామని ప్రధాన మంత్రి తెలిపారు.  దీనికి అదనం గా, ఈ ఏడాది లో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి కూడా ఉంది, దానిని ‘పరాక్రమ్ దివస్‌’ గా జరుపుకోవాలని ప్రకటించడమైంది.  ఈ ఘట్టాలు మనం మన దేశం కోసం మరొక్క సారి అంకితం చేసుకోవడానికి ప్రేరణను ఇస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం తన దేశవాసుల ఆకాంక్ష తాలూకు సామూహిక బలానికి ప్రతిరూపం అని ప్రధాన మంత్రి యువ అతిథులతో అన్నారు.  భారతదేశం అంటే అనేక రాష్ట్రాలు- ఒకే దేశం; అనేక సముదాయాలు- ఒకే భావన; అనేక మార్గాలు- ఒకే లక్ష్యం; అనేక ఆచారాలు, సంప్రదాయాలు- ఒకే విలువ; అనేక భాష లు- ఒకే అభివ్యక్తి; అనేక రంగులు- ఒకే మువ్వన్నెల జెండా అని ఆయన అన్నారు.  మరి అందరి సమాన గమ్యం ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ యే.  ఒకరి ఆచారాలు, వంటకాలు, భాషలు, కళలపైన మరొకరికి జాగృతి ని పెంచడానికి కృషి చేయాలని, దేశం లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువ అతిథులకు ఆయన విజ్ఞప్తి చేశారు.  ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ కార్యక్రమం ‘లోకల్ ఫార్ వోకల్’ కు బలాన్ని ఇస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.  ఒక ప్రాంతం లో ఉత్పత్తి అయ్యే వస్తువు ను మరొక ప్రాంతం గౌరవం గా భావించి, ప్రోత్సహించినప్పుడే స్థానిక ఉత్పత్తులకు జాతీయ స్థాయి అందుబాటు, ప్రపంచ స్థాయి అందుబాటు లు లభిస్తాయి.  ‘లోకల్ ఫార్ వోకల్’, ఆత్మ నిర్భర్  అభియాన్ ల సఫలత మన యువతపైన ఆధారపడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశ యువత లో సరైన నైపుణ్యం ఏర్పడవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.  నైపుణ్యం తాలూకు ఈ మహత్త్వాన్ని స్పష్టం చేయడానికి నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2014 లో ఏర్పాటైందని, 5.5 కోట్ల మంది యువతీయువకుల కు వివిధ నైపుణ్యాలను అందజేయడం జరిగిందని, స్వతంత్రోపాధి , ఉద్యోగ కల్పన లో తోడ్పడిందని ఆయన అన్నారు.

ఈ నైపుణ్యం కొత్త జాతీయ విద్య విధానం లో స్పష్టం గా కనుపిస్తోంది, జాతీయ విద్య విధానం లో జ్ఞానాన్ని ఉపయోగం లోకి తీసుకురావడానికి పెద్ద పీట ను వేయడం జరిగింది.  ఎవరైనా వారికి ఇష్టమైన విషయాన్ని ఎంపిక చేసుకోవడం లో వెసులుబాటు అనేది ఈ విధానం లో ఒక ముఖ్యమైన అంశం గా ఉంది.  వృత్తి విద్య ను విద్య తాలూకు ప్రధాన స్రవంతి లోకి  తీసుకు రావడానికి గంభీరమైన ప్రయత్నం జరిగింది.  6వ తరగతి తరువాత నుంచి, విద్యార్థి తన ఆసక్తి, స్థానిక అవసరాలు, వృత్తి విద్యలకు అనుగుణం గా ఏదైనా ఒక పాఠ్యక్రమాన్ని ఎంపిక చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.  ఆ తరువాత, మధ్య స్థాయి లో, విద్య విషయాలను వృత్తిపరమైన విషయాలను జోడించుకోవాలని ప్రతిపాదించడం జరిగింది.

దేశానికి అవసరమైన సమయం లో, ముఖ్యం గా కరోనా కాలం లో, ఎన్ ‌సిసి, ఎన్ ‌ఎస్‌ఎస్ ‌లు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.  మహమ్మారి కి వ్యతిరేకం గా పోరాటం తదుపరి దశ లో ఈ  కృషి ని మరింత ముందుకు తీసుకు పోవాలి అని ఆయన కోరారు.  టీకామందును ఇప్పించే కార్యక్రమం లో సాయపడడానికి, టీకామందు విషయం లో చైతన్యాన్ని వ్యాప్తి లోకి తీసుకురావడానికి దేశం లోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ సమాజం లోని ప్రతి కేంద్రం లోనూ వారి పరిధి ని ఉపయోగించాలంటూ ఆయన సూచించారు.  "టీకామందు ను తయారు చేయడం ద్వారా, మన శాస్త్రవేత్తలు వారి కర్తవ్యాన్ని నెరవేర్చారు, ఇప్పుడు మన వంతు వచ్చింది.  మనం అసత్యాన్ని, వదంతులను వ్యాప్తి చేసే ప్రతి ప్రయత్నాన్ని నిష్ఫలం చేయాలి” అని ప్రధాన మంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Centre hikes MSP on jute by Rs 315, promises 66.8% returns for farmers

Media Coverage

Centre hikes MSP on jute by Rs 315, promises 66.8% returns for farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జనవరి 2025
January 23, 2025

Citizens Appreciate PM Modi’s Effort to Celebrate India’s Heroes