PM launches Gangajal Project to Provide Better and More Assured Water Supply in Agra
Making Agra Tourist Friendly Smart City - Integrated Command and Control Centre for Agra Smart City To be Built
PM Lays Foundation Stone for Upgradation of SN Medical College, Agra
Panchdhara - Five Facets of Development Holds Key to Progress of Nation: PM

ఆగ్రా లో ప‌ర్యాట‌క రంగ సంబంధిత మౌలిక స‌దుపాయాల ను అభివృద్ధి ప‌ర‌చ‌డానికి ప్రోత్సాహాన్ని అందించే చ‌ర్య‌ల లో భాగం గా ఆగ్రా న‌గ‌రాని కి, ఆ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల కు 2,900 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

గంగాజ‌ల్ ప‌థ‌కాన్ని దేశ ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి అంకితం చేశారు.  ఈ ప‌థ‌కం అంచ‌నా వ్య‌యం 2880 కోట్ల రూపాయ‌లు.  ఇది ఆగ్రా కు మెరుగైన నీటి స‌ర‌ఫ‌రా కు పూచీ ప‌డుతుంది.  గంగాజ‌ల్ ప‌థ‌కం ఆగ్రా కు 140 క్యూసెక్కుల గంగా జ‌లాన్ని ఇవ్వ‌డానికి ఉద్దేశించిన‌టువంటిది.  ఇది న‌గ‌ర త్రాగునీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌డం లో దోహ‌దం చేయ‌నుంది.

ఆగ్రా స్మార్ట్ సిటీ కై త‌ల‌పెట్టిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ కు ప్ర‌ధాన మంత్రి పునాదిరాయి ని వేశారు.  ఈ ప‌థ‌కం లో భాగం గా ఆగ్రా న‌గరం అంత‌టా సిసి టివి ల‌ను అమ‌ర్చ‌నున్నారు.  త‌ద్వారా న‌గ‌రం సుర‌క్షితం గాను, భ‌ద్రం గాను ఉండేట‌ట్లు నిఘా ను ఏర్ప‌ర‌చి, ప‌ర్య‌వేక్షించ‌డం ఈ ప్రాజెక్టు ధ్యేయం.  ఇది ఒక ప్ర‌ధాన‌మైన యాత్రా స్థ‌లం గా ఆగ్రా కు ఉన్న‌టువంటి ఖ్యాతి కి త‌గిన‌ట్లు 285 కోట్ల రూపాయ‌ల మొత్తం వ్య‌యం తో న‌గ‌రాన్ని ప్ర‌పంచ శ్రేణి స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్ద‌డం లో స‌హాయ‌కారి కానుంది.

ఆగ్రా లోని కోఠీ మీనా బ‌జార్ లో ఒక ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి నేడు ప్ర‌సంగిస్తూ, ‘‘గంగాజ‌ల్ ప‌థ‌కం మ‌రియు సిసి టివి కామెరా ల వంటి స‌దుపాయాల తో ఆగ్రా ను ఒక స్మార్ట్ సిటీ గా రూపొందించే దిశ‌ గా మేం చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌’’న్నారు.  ఈ స‌దుపాయాలు యాత్రికుల‌ దృష్టి ని కూడా ఆక‌ర్షించగలుగుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

‘ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌’ లో భాగం గా ఆగ్రా లో ఎస్ఎన్ మెడిక‌ల్ కాలేజి స్థాయి పెంపు ప‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు.  దీనిలో భాగం గా మ‌హిళ‌ల ఆసుప్ర‌తి లో 200 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యం తో 100 ప‌డ‌క‌ల ప్ర‌సూతి విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.  ఇది స‌మాజం లో బ‌ల‌హీన వ‌ర్గాల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ కు, మాతృత్వ సంర‌క్ష‌ణ‌ కు తోడ్ప‌నుంది.  ‘ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న’ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  100 రోజుల వ్య‌వ‌ధి లోప‌లే ఈ ప‌థ‌కం లో  7 ల‌క్ష‌ల మంది కి పైగా ప్ర‌జ‌లు ప్ర‌యోజ‌నాల‌ ను పొందార‌ని ఆయ‌న తెలిపారు.

జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల కోసం 10 శాతం రిజ‌ర్వేష‌న్ అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ చ‌ర్య స‌రి అయిన దిశ‌ లో వేసినటువంటి అడుగు అని పేర్కొన్నారు.  ఇత‌ర కేట‌గిరీ విద్యార్థులు న‌ష్ట‌పోకుండా చూడ‌టానికి గాను విద్యా సంస్థ‌ల లో మ‌రింత సంఖ్య‌ లో సీట్ల‌ ను ప్ర‌భుత్వం జత చేస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ‘‘జ‌న‌ర‌ల్ కేట‌గిరీ కి చెందిన పేద‌ల‌ కు రిజ‌ర్వేష‌న్ తో పాటు,  ఉన్న‌త విద్య, సాంకేతిక విద్య మ‌రియు వృత్తి విద్య సంస్థ ల‌లో విద్యా సౌక‌ర్యాల‌ ను స‌మ‌కూర్చ‌డం కోసం మేం ఒక ప్ర‌ధాన‌మైన అడుగు ను వేశాం.  మేము ఉన్న‌త విద్య సంస్థ‌ల లో సీట్ల‌ను కూడా 10 శాతం మేర పెంచాం.  ఏ ఒక్క‌రి హ‌క్కు కు భంగం క‌లిగించే వ్య‌వ‌స్థ కు మేం తావు ఇవ్వం’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

“అవినీతి కి వ్య‌తిరేకం గా కృషి చేయవలసిందంటూ నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల కింద‌ట మీరు నాకు ఇచ్చిన‌టువంటి ఆదేశాన్ని పూర్తి స్థాయి లో నెరవేర్చడం కోసం  నేను ప్రయత్నిస్తున్నాను.  కొంత మంది ఈ చౌకీదార్ కు వ్య‌తిరేకం గా గుమికూడుతుండటానికి కార‌ణం ఇదే’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  త‌న ప్ర‌భుత్వం యొక్క ప్రాధాన్యాల‌ను ఆయ‌న విశ‌దీక‌రిస్తూ, దేశ పురోగ‌తి కి అభివృద్ధి తాలూకు అయిదు ముఖాలు.. పంచ్‌ధార ను గురించి పున‌రుద్ఘాటించారు.  వీటి లో- బాల‌ల‌ కు విద్య‌, రైతు కు సాగునీరు, యువ‌త‌ కు ఉపాధి, వృద్ధుల‌ కు మందులు, ప్ర‌తి ఒక్క‌రి కి వారి ఫిర్యాదు ప‌రిష్కారం- ఉన్నాయ‌న్నారు.

ఆగ్రా యొక్క ప‌శ్చిమ ప్రాంతానికి  ఎఎమ్ఆర్‌యుటి (‘అమృత్‌’) ప‌థ‌కం లో భాగం గా ఉద్దేశించిన మురుగు పారుద‌ల నెట్ వ‌ర్క్ ప్రాజెక్టు కు ప్ర‌ధాన మంత్రి పునాదిరాయి ని వేశారు.  ఈ ప్రాజెక్టు 50,000కు పైగా గృహాల లో మెరుగైన పారిశుధ్య స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు తోడ్ప‌డనుంది.
 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security