ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు అమెరికా అధ్యక్షుడు, డోనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్నారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించారు. ప్రధానమంత్రి మోదీ మీడియాకు క్లుప్తమైన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ, తనకు ప్రెసిడెంట్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ అందించిన సాదరస్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు.






