QuoteOur government’s mantra is ‘Sabka Saath, Sabka Vikas’: Prime Minister Modi
QuoteCentral Government is committed to connecting every citizen of the country with the mainstream of development: PM Modi
QuoteNo stone will be left unturned for development of Leh, Ladakh and Kargil: PM Modi

లేహ్‌, జ‌మ్ము, ఇంకా శ్రీ‌న‌గ‌ర్ ల‌లో తన ఒక రోజు ప‌ర్య‌ట‌న తొలి ద‌శ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ల‌ద్దాఖ్‌ లోని లేహ్ కు వ‌చ్చారు. ఆయన వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ ను ప్రారంభించ‌డమే కాక మ‌రికొన్న అభివృద్ధి ప‌థ‌కాల కు శంకుస్థాప‌న లు కూడా చేశారు.

|

వణకు పుట్టించే చలి లోనూ త‌ర‌లివ‌చ్చిన జ‌న స‌మూహాన్ని ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొంటూ, “కఠినమైనటువంటి ప‌రిస్థితుల‌ లో ఉండే వారు ప్ర‌తి ఒక్క క‌ష్టాని కి ఎదురొడ్డి నిలుస్తారు. మీ స్నేహమే నకు మ‌రింత‌ క‌ష్టించి ప‌ని చేయ‌డానికి గొప్ప ప్రేర‌ణ ను ఇస్తోంది” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

ఆయ‌న ల‌ద్దాఖ్‌ విశ్వ‌విద్యాల‌యాన్ని ప్రారంభించారు. “ల‌ద్దాఖ్ లోని జనాభా లో 40 శాతం యువ విద్యార్థులే. ఈ ప్రాంతం లో విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు కావ‌ల‌న్నది దీర్ఘ‌కాల కోరిక. యూనివ‌ర్సిటీ ఆఫ్ ల‌ద్దాఖ్ శుభారంభం తో ఈ కోరిక తీరుతుంది’’ అని ఆయన అన్నారు. ఈ విశ్వ‌విద్యాల‌యం లేహ్‌, కార్ గిల్‌, నుబ్రా, జాంస్ కర్‌, డ్రాస్, ఇంకా ఖాల్ స్తీ ల లోని డిగ్రీ క‌ళాశాల‌ల తో నిర్మితమయ్యే ఒక క్ల‌స్ట‌ర్ యూనివ‌ర్సిటీ గా ఉంటుంది; విద్యార్థుల సౌల‌భ్యం కోసం లేహ్ లో, కార్ గిల్ లో ప‌రిపాల‌న కార్యాల‌యాలు ఏర్పాట‌వుతాయి అని ఆయ‌న చెప్పారు.

|

దాతాంగ్ గ్రామానికి స‌మీపం లోని దాహ్ లో 9 మెగావాట్ సామ‌ర్ధ్యం తో దాహ్ జ‌ల విద్యుత్ ప‌థ‌కాన్ని, అలాగే 220 కెవి సామ‌ర్ధ్యం క‌లిగిన‌టువంటి శ్రీ‌న‌గ‌ర్ – అల్‌స్టెంగ్‌ – ద్రాస్ -కార్ గిల్ – లేహ్ ప్ర‌సార వ్య‌వ‌స్థ ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప‌థ‌కాల‌ ను ప్రారంభిస్తూ, ‘‘జాప్యాల సంస్కృతి కి మేం స్వ‌స్తి ప‌లికాం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. తాను పునాది రాళ్లను వేసిన అన్ని ప‌థ‌కాల ను స్వయంగా తానే ప్రారంభించేట‌ట్లు త‌న ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ తీసుకొంటుంద‌ని కూడా ఆయ‌న తెలిపారు.

|

లేహ్ లో ఒక ఫ‌ల‌కాన్ని ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించ‌డం ద్వారా కుశోక్ బకులా రిమ్పోఛే (కెబిఆర్‌) విమానాశ్ర‌య నూత‌న ట‌ర్మిన‌ల్ భ‌వ‌నాని కి శంకుస్థాప‌న చేశారు. ఈ కొత్త ట‌ర్మిన‌ల్ అన్ని ఆధునిక స‌దుపాయాల తో కొలువుదీరి ప్ర‌యాణికుల కు ఎటువంటి అంత‌రాయం ఎదురవని విధంగా వారి రాక‌పోక‌ల కు అనువుగా ఉండబోతోంది.

|

ఈ ప‌థ‌కాలు మ‌రింత చ‌క్క‌ని సంధానాన్ని, విద్యుత్తు ల‌భ్య‌త ను క‌ల్పిస్తాయి, త‌ద్వారా ఈ ప్రాంతం లో ప‌ర్య‌ట‌కుల రాక అధికం అవుతుంది అని కూడా ఆయన చెప్పారు. ఇది అనేక గ్రామాల లో మెరుగైన జీవ‌నోపాధి అవ‌కాశాల ను సైతం ప్ర‌సాదిస్తుంద‌న్నారు.

|

వీటి కి తోడు, సంర‌క్షిత క్షేత్రం అనుమ‌తి చెల్లుబాటు గ‌డువు ను 15 రోజుల వరకు పెంచ‌డమైంది. ఇక పర్యటకులు అధిక కాలం పాటు లేహ్ లో వారి యాత్ర యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతారు.

ఎల్ఎహెచ్‌డిసి చ‌ట్టం లో కొన్ని మార్పుల ను చేయ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. వ్య‌యాల‌ కు సంబంధించినంత వ‌ర‌కు కౌన్సిల్ కు మ‌రిన్ని హ‌క్కులు ద‌త్తం అయ్యాయ‌ని ఆయ‌న అన్నారు. ఇక‌ మీదట ఈ ప్రాంతం అభివృద్ధి కి పంపిన ధ‌నాన్ని అటాన‌మ‌స్ కౌన్సిల్ యే విడుద‌ల చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

తాత్కాలిక బ‌డ్జెటు ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, షెడ్యూల్డు తెగ‌ల సంక్షేమం కోసం కేటాయింపు లో 30 శాతం మేర‌కు పెరుగుదల చోటు చేసుకొందని, అదే విధంగా షెడ్యూల్డు కులాల వికాసం కోసం దాదాపు 35 శాతం పెరుగుద‌ల ఉంద‌న్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
From Ghana to Brazil: Decoding PM Modi’s Global South diplomacy

Media Coverage

From Ghana to Brazil: Decoding PM Modi’s Global South diplomacy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూలై 2025
July 12, 2025

Citizens Appreciate PM Modi's Vision Transforming India's Heritage, Infrastructure, and Sustainability