షేర్ చేయండి
 
Comments

ద్రవ్య సృ జన కోసం  విజ్ఞాన శాస్త్రం లో విలువ ‌ను సృష్టించ‌డాన్ని విస్త‌రించండి అంటూ శాస్త్రవేత్త‌ల స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న  పిలుపునిచ్చారు.  నేశ‌న‌ల్ మెట్రాల‌జీ కాన్‌క్లేవ్ 2021 సంద‌ర్భం లో ఆయ‌న పాల్గొని, ప్ర‌సంగించారు.  ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  ‘నేశ‌న‌ల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భార‌తీయ నిర్దేశ‌క్ ద్ర‌వ్య ప్ర‌ణాళి’ ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.  అంతేకాకుండా, నేశ‌న‌ల్ ఇన్‌వైర‌న్ మంట‌ల్ స్టాండ‌ర్డ్స్ లబారటరి కి  శంకుస్థాప‌న కూడా చేశారు.
 
చ‌రిత్ర ప‌రంగా చూస్తే, ఏ దేశం అయినా విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్స‌హించ‌డానికి చేసిన తన ప్రయాసలను ప్రోత్సహించిన తాలూకు ప్ర‌త్య‌క్ష ఫ‌లాల‌ను అందుకొంది అ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దీనినే విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ప‌రిశ్ర‌మ రంగాల‌లో విలువ సృష్టించే ప్ర‌క్రియ అని ఆయ‌న అభివ‌ర్ణించారు.  దీనిపై ఆయ‌న మ‌రింత గా విపులంగా వివరిస్తూ, విజ్ఞాన శాస్త్ర ప‌రంగా ఒక కొత్త ఆవిష్క‌ర‌ణ చోటు చేసుకొన్న‌ప్పుడు అది ఒక సాంకేతిక‌త‌ ను అందిస్తుంద‌ని, మ‌రి ఆ సాంకేతిక విజ్ఞానం ప‌రిశ్ర‌మ అభివృద్ధి కి దారి తీస్తుంద‌ని చెప్పారు.  ప‌రిశ్ర‌మ త‌న వంతు గా కొత్త ప‌రిశోధ‌న ‌కు అండ‌గా నిలవడా‌నికి  విజ్ఞాన శాస్త్రం లో పెట్టుబ‌డి పెడుతుందని ఆయ‌న అన్నారు.  ఈ ప్ర‌క్రియ మ‌న‌ను స‌రికొత్త అవ‌కాశాల దిశ‌ లో ముందుకు న‌డిపిస్తుంది అ‌ని ఆయ‌న చెప్పారు.  ఈ విలువ తాలూకు ప్ర‌క్రియ‌ ను ముందుకు తీసుకుపోవ‌డం లో సిఎస్ఐఆర్‌-ఎన్‌పిఎల్ ఒక ప్ర‌ధాన పాత్ర‌ ను పోషించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈ విధం గా ద్రవ్య సృజన కోసం విలువ ను ఆవిష్క‌రించే ప్ర‌క్రియ నేటి ప్రపంచం లో మ‌రింత అధిక ప్రాధాన్యాన్ని సంత‌రించుకొందని శ్రీ మోదీ అన్నారు.  ఇదే తరుణం లో దేశం కూడా ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి ముందంజ వేస్తోంది అంటూ శ్రీ మోదీ గుర్తు చేశారు.

సిఎస్ఐఆర్‌-ఎన్‌పిఎల్ నేశ‌న‌ల్ అటామిక్ టైమ్ స్కేల్ ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ దానిని ఈ రోజు న మాన‌వాళి కి అంకితం చేశారు.  నానో సెకండ్ పరిధి లో సమయాన్ని కొలిచే ప్ర‌క్రియ ‌లో భార‌త‌దేశం స్వ‌యంస‌మృద్ధి ని సాధించింది అ‌ని ఆయ‌న అన్నారు.  2.8 నానో సెకండ్ తాలూకు ఖ‌చ్చిత‌మైన ప్రమాణాన్ని సాధించ‌డమనేది దానంత‌ట అదే ఒక భారీ సామ‌ర్ధ్యం.  ప్ర‌స్తుతం భార‌త ప్రామాణిక సమయం అనేది 3 నానో సెకండ్ క‌న్నా త‌క్కువ ఖ‌చ్చిత‌త్వ ప్రమాణం తో కూడిన అంత‌ర్జాతీయ ప్రామాణిక సమయం తో తుల‌ తూగుతోంది అ‌ని ఆయ‌న అన్నారు.  ఇది అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం తో ప‌నిచేసే ఐఎస్ఆర్ఒ వంటి సంస్థ‌ల‌కు ఒక పెద్ద తోడ్పాటు కాగ‌ల‌దు అ‌ని ఆయ‌న చెప్పారు.  ఈ కార్య‌సాధ‌న ద్వారా బ్యాంకింగ్‌, రైల్వేలు, ర‌క్ష‌ణ‌, ఆరోగ్యం, టెలికం, వాతావ‌ర‌ణ అంచనా, విప‌త్తు నిర్వ‌హ‌ణ ల‌తో పాటు ఇదే విధమైన అనేక రంగాలకు సంబంధించిన ఆధునిక, సాంకేతిక విజ్ఞానం ఎంత‌గానో లాభ‌ప‌డుతుంది అ‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇండ‌స్ట్రీ 4.0 లో భార‌త‌దేశం తాలూకు పాత్ర‌ ను బ‌లోపేతం చేయ‌డంలో టైమ్ స్కేల్ పోషించే భూమిక ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి స‌వివ‌రంగా మాట్లాడారు.  భార‌త‌దేశం ప‌ర్యావ‌ర‌ణం రంగం లో ఒక నాయ‌క‌త్వ స్థానం దిశ ‌గా ప‌య‌నిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.  ఇంత జ‌రుగుతున్నా గాలి నాణ్య‌త‌, ఉద్గారాలు.. వీటిని కొల‌వ‌డం లో సాంకేతిక విజ్ఞానం  కోసం, ప‌రిక‌రాల కోసం భార‌త‌దేశం ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డుతోంది అని ఆయ‌న అన్నారు.  ఈ కార్య‌సాధ‌న ఈ రంగం లో స్వ‌యంస‌మృద్ధి కి బాట ‌వేస్తుంది, అంతేకాదు కాలుష్య నియంత్ర‌ణ కు తోడ్ప‌డే మ‌రింత ప్ర‌భావ‌శీల‌మైనటువంటి, చౌకైనటువంటి ప‌రిక‌రాల‌ను ఆవిష్క‌రించేందుకు కూడా ఇది దారితీస్తుంది అని ఆయ‌న అన్నారు.  అలాగే, వాయుప‌ర‌మైన నాణ్య‌త లో‌, ఉద్గార సంబంధిత సాంకేతిక విజ్ఞానం తాలూకు ప్ర‌పంచ బ‌జారు లో భారతదేశం వాటా ను సైతం ఇది వృద్ధి చేస్తుంది అ‌ని ఆయన అన్నారు.  మ‌నం మన శాస్త్రవేత్త‌ల నిరంత‌ర ప్రయాసల వ‌ల్ల‌నే దీనిని సాధించుకొన్నాం అని ఆయ‌న అన్నారు.

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's crude steel output up 21.4% at 9.4 MT in June: Worldsteel

Media Coverage

India's crude steel output up 21.4% at 9.4 MT in June: Worldsteel
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 2nd August 2021
August 02, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens elated as PM Narendra Modi to be First Indian Prime Minister to Preside Over UNSC Meeting

Citizens praise Modi Govt’s resolve to deliver Maximum Governance