చండీగఢ్, జంజ్గిర్లో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పునాది వేశారు
బిలాస్పూర్-అనూప్పూర్ మూడవ రైలు ట్రాక్ ప్రాజెక్ట్ కోసం ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
భూసార కార్డులు, ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమాన్ని భరోసా యిస్తున్నాం: ప్రధాని మోదీ
మేము అందరికీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, 2022 నాటికి ప్రతి తలపై పైకప్పును నిర్ధారించాలనుకుంటున్నాము: ప్రధాని మోదీ
మేము అభివృద్ధికి అంకితమై, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం 'అని ప్రధాని మోదీ చత్తీస్గఢ్లో అన్నారు.

ముఖ్య‌మైన‌ మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఇందులో భాగంగా జాంజ్‌గిర్‌-చాంపాలో ఏర్పాటు చేసిన సంప్రదాయ చేనేత, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆ తర్వాత జాతీయ రహదారి ప్రాజెక్టులతోపాటు పెండ్రా-అనుప్పూర్ మార్గంలో మూడో రైల్వే లైనుకు శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంపికచేసిన పలువురు లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన కిసాన్ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆనాడు మూడు కొత్త రాష్ట్రాలు… ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లను సృష్టించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధిపై ఆయన దార్శనికత కారణంగానే అన్ని రాష్ట్రాలూ నేడు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధి సాధనకు ప్రతినబూనిందని, ఆ దిశగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజా జీవన సౌలభ్యం మెరుగుపడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసమో, ఎన్నికలలో విజయం కోసమో పథకాలను అమలు చేయడంలేదని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సరికొత్త, అత్యాధునిక ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు.

 

‘‘అందరి తోడ్పాటుతో అందరి అభివృద్ధి’’ అన్న నినాదం ఆధారంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రధాని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుద్వారా రైతులకు లబ్ధిపై ఇచ్చిన హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన’ రైతులకు తోడ్పాటునిస్తున్నదని వివరించారు. సాంకేతిక ఆవిష్కరణలద్వారా రైతు సంక్షేమానికి భరోసా ఇస్తున్నామని, ఇందులో భాగంగా ‘భూసార కార్డుల జారీ, పంటల బీమా యోజన’ వంటివి ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఈ పథకాలతో రైతులు ఎంతో లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలవల్ల ఒకనాడు ప్రత్యేకించి కొందరు మాత్రమే లబ్ధిపొందేవారని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా అంతులేని అవినీతి ఫలితంగా పాలన వ్యవస్థ నాశనమైందని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు ‘అందరికీ అభివృద్ధి’ నినాదానికి కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ 2022నాటికల్లా తలదాచుకునేందుకు గూడు కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఒకటని ఆయన వివరించారు. 

ప్రజారోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ఉద్యమ స్థాయిలో చేపట్టిందని గుర్తుచేశారు. అలాగే ‘ఉజ్వల యోజన’ కింద పేదలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని, నేడు ‘సౌభాగ్య యోజన’ కింద ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిందని ఆయన వివరించారు.

Click here to read PM's speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Auto retail sales surge to all-time high of over 52 lakh units in 42-day festive period: FADA

Media Coverage

Auto retail sales surge to all-time high of over 52 lakh units in 42-day festive period: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister visits Shri LK Advani ji on his birthday
November 08, 2025

The Prime Minister, Shri Narendra Modi went to Shri LK Advani Ji's residence and greeted him on the occasion of his birthday, today. Shri Modi stated that Shri LK Advani Ji’s service to our nation is monumental and greatly motivates us all.

The Prime Minister posted on X:

“Went to Shri LK Advani Ji's residence and greeted him on the occasion of his birthday. His service to our nation is monumental and greatly motivates us all.”