ఈ రోజు అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న మూడు ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రాంత సోదరీ సోదరులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో ముందకు సాగుతూ  జీవన రంగంలోనూ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నిరంతర కృషి, ప్రగతి స్ఫూర్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు.

సంస్కృత శ్లోకం-

“చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి

సూర్యాస్య పశ్య శ్రేమాణం న మామార్ న జీర్యతి”

నిరంతరం శ్రమించే వ్యక్తులే ప్రగతి ఫలపు మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. అలుపు లేకుండా, అంతరాయం లేకుండా సూర్యుడు తన శక్తితో ప్రపంచానికి వెలుగులు పంచినట్టే.. మనం నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి- అని ఆ శ్లోకం వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర నేడు అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి.  ఈ సందర్భంగా ఆ రాష్ట్రాల సోదరీ సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిరంతర కృషితో జీవన రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.  

 

చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి

సూర్యాస్య పశ్య శ్రేమాణం న మామార్ న జీర్యతి.’’  

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA

Media Coverage

India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 మార్చి 2026
March 07, 2026

Reform, Perform and Transform: PM Modi’s Mantra for India’s Growth