ఈ రోజు అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న మూడు ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రాంత సోదరీ సోదరులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో ముందకు సాగుతూ జీవన రంగంలోనూ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నిరంతర కృషి, ప్రగతి స్ఫూర్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు.
సంస్కృత శ్లోకం-
“చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి
సూర్యాస్య పశ్య శ్రేమాణం న మామార్ న జీర్యతి”
నిరంతరం శ్రమించే వ్యక్తులే ప్రగతి ఫలపు మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. అలుపు లేకుండా, అంతరాయం లేకుండా సూర్యుడు తన శక్తితో ప్రపంచానికి వెలుగులు పంచినట్టే.. మనం నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి- అని ఆ శ్లోకం వివరిస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర నేడు అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్రాల సోదరీ సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిరంతర కృషితో జీవన రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి
సూర్యాస్య పశ్య శ్రేమాణం న మామార్ న జీర్యతి.’’
आज नॉर्थ ईस्ट के तीन राज्य मणिपुर, मेघालय और त्रिपुरा अपना स्थापना दिवस मना रहे हैं। इस अवसर पर यहां के अपने सभी भाई-बहनों को मेरी बहुत-बहुत शुभकामनाएं। अपने प्रयासों से जीवन के हर क्षेत्र में उन्हें सफलता मिले, यही कामना है।
— Narendra Modi (@narendramodi) January 21, 2026
चरैवेति चरैवेति चरन्वै मधु विन्दति।
सूर्यास्य पश्य… pic.twitter.com/N7WIyxV60d


