ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ప్రతినిధులతో పాటు దేశం నలుమూలలకు చెందిన 3,000 మంది యువ నాయకులతో ముచ్చటించనున్న ప్రధానమంత్రి
ఎంపిక చేసిన ప్రతినిధులచే జాతీయ ప్రాధాన్యమున్న పది కీలక అంశాలపై ప్రధానికి ప్రజెంటేషన్
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో పాల్గొన్న 50 లక్షల మంది

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి జనవరి 12, సాయంత్రం 4:30 గంటలకు ఆయన హాజరవుతారు.

ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ప్రతినిధులతో పాటుగా దేశం నలుమూలలకు చెందిన 3,000 మంది యువతతో ప్రధానమంత్రి ముచ్చటిస్తారు. ఎంపిక చేసిన వారు 10 కీలకాంశాలపై ప్రధానమంత్రికి తమ ప్రజెంటేషన్ ఇస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న రంగాల్లో యువతకున్న దృక్పథాలు, ఆచరణ సాధ్యమైన ఆలోచనలను వారు వివరిస్తారు.

ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026 వ్యాసాల సంకలనాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. దీనిలో దేశాభివృద్ధి ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక దేశ నిర్మాణ లక్ష్యాల గురించి యువత రాసిన వ్యాసాల నుంచి ఎంపిక చేసిన వాటిని ప్రచురించారు.

భారత యువత, జాతీయ నాయకత్వం మధ్య నిర్మాణాత్మక అనుసంధానాన్ని అందించే జాతీయ వేదికగా రెండో విడత వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌‌ను రూపొందించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను ఈ రంగంలోకి తీసుకురావాలని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఉంది. ఇది వికసిత్ భారత్ కోసం వారి ఆలోచనలు వాస్తవరూపం దాల్చేలా జాతీయ వేదికను అందిస్తుంది.

2026 జనవరి 9 నుంచి 12 వరకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026ను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. డిజిటల్ క్విజ్, వ్యాసరచన పోటీలు, రాష్ట్ర స్థాయి విజన్ ప్రజెంటేషన్లతో ఈ పోటీలను మూడు దశలుగా నిర్వహించారు. ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు యువ నాయకులను ఎంపిక చేశారు.

మొదటి సంచికకకు కొన్ని కీలకమైన మార్పులు చేసి రెండో సంచికను రూపొందిచారు. దీనిలో డిజైన్ ఫర్ భారత్, టెక్ ఫర్ వికసిత్ భారత్ - హ్యాక్ ఫర్ ఏ సోషల్ కాజ్, మరింత విస్తరించిన ఇతివృత్తాలు ఉన్నాయి. వీటితో పాటుగా మొదటిసారిగా అంతర్జాతీయ భాగస్వామ్యానికి చోటు కల్పించారు. ఇవి ఈ కార్యక్రమ పరిధిని, ప్రభావాన్ని మరింత బలోపేతం చేశాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 జూలై 2026
July 14, 2026

From Local Fields to Global Recognition: PM Modi’s ‘Vocal for Local’ is Now Delivering Real Global Respect