అధిక పేలోడ్ ను మోసుకుపోగలిగే, తక్కువ ఖర్చయ్యే, మళ్ళీ ఉపయోగించ గలిగే, వాణిజ్యం పరంగా లాభసాటి అయ్యే వాహక నౌకను అభివృద్ధి పరచనున్న ఇస్రో
తదుపరి తరం కృత్రిమ ఉపగ్రహ వాహక నౌకను అభివృద్ధి పరచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఆధునిక అంతరిక్ష వాహక నౌక (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్-ఎన్‌జిఎల్‌వి)ని అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ, దానిని నిర్వహించడానికీ ఈ అంతరిక్ష నౌక చాలా ముఖ్యం. 2040 సంవత్సరానికల్లా చంద్రగ్రహం మీదకు భారతీయ వ్యోమగాములను పంపించాలన్న ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసే దిశలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగు కానుంది. ప్రస్తుతం ఉన్న ఎల్‌విఎమ్3 తో పోలిస్తే ఒకటిన్నర రెట్ల అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ కన్నా మూడింతల పేలోడ్ ను మోసుకు పోయే సత్తా ఎన్‌జిఎల్‌వికి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునేందుకు కూడా అనువుగా ఎన్‌జిఎల్‌వి రూపొందనున్న కారణంగా విశ్వాన్ని అందుకోవడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రాకెట్ ను మండించడానికి పర్యావరణ హిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడం ఈ కొత్త వాహక నౌక ప్రత్యేకత.

ఈ అమృత కాలంలో భారతదేశం అనుసరించదలచుకున్న అంతరిక్ష కార్యక్రమ లక్ష్యాల్లో అధిక పేలోడ్ సామర్థ్యం, మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగిన, మానవుల్ని తీసుకుపోగలిగిన వాహక నౌకల అవసరం ఉంది. ఈ లక్ష్యాల్లో భాగంగానే తదుపరి తరానికి చెందిన వాహక నౌక (ఎన్‌జిఎల్‌వి)ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఎన్‌జిఎల్‌విని గరిష్ఠంగా 30 టన్నుల టన్నుల బరువును మోసుకుపోగలిగేలా రూపొందిస్తున్నారు. దీనిని భూమికి సమీప కక్ష్యలోకి మాత్రమే పంపేలా రూపొందిస్తారు. ఈ రాకెట్ ఒకటో దశను మళ్లీ ఉపయోగించుకునే వీలుంది. ప్రస్తుతానికి, భారతదేశం పిఎస్ఎల్‌వి, జిఎస్ఎల్‌వి, ఎల్‌విఎమ్3, ఎస్ఎస్ఎల్‌వి వాహక నౌకలు ఉన్నాయి. ఇవి కృత్రిమ ఉపగ్రహాలను 10 టన్నుల బరువు వరకూ భూ సమీప కక్ష్యలోకీ, 4 టన్నుల బరువును భూ స్థిర కక్ష్యలోకి మోసుకుపోగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. విశ్వ రవాణా వ్యవస్థలో భారతదేశం స్వయం సమృద్ధిని కలిగి ఉంది.

ఎన్‌జిఎల్‌వి అభివృద్ధి ప్రాజెక్టు అమలులో భారతీయ పరిశ్రమ వీలైనంత ఎక్కువ స్థాయిలో పాలుపంచుకోనుంది. అంతేకాకుండా, తయారీ దశ నుండే భారత పరిశ్రమ ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. తద్వారా ఈ వాహక నౌకను అభివృద్ధి పరచిన అనంతరం దీని ప్రయోగ శ వరకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా సాఫీగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొనేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అభివృద్ధి దశ 96 నెలల (8 సంవత్సరాల) కాలం లోపల పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం ఎన్‌జిఎల్‌వి ని మూడు దశల్లో (డి1, డి2, డి3) పరీక్షించనున్నారు.

దీనికి మొత్తం రూ. 8240.00 కోట్ల ఖర్చు చేయడానికి ఆమోద ముద్రను వేశారు.  ఈ మొత్తంలో వాహక నౌక అభివృద్ధి సంబంధిత వ్యయాలు, మూడు దశల ప్రయోగాలు, వాహక నౌక ప్రయోగ వేదిక ఏర్పాటు, కార్యక్రమ నిర్వహణ, ప్రచారం వంటి ఇతర ఖర్చులూ ఇందులో కలిసి ఉన్నాయి.

భారతీయ అంతరిక్ష కేంద్రం దిశగా అడుగులు

ఎన్‌జిఎల్‌విని అభివృద్ధి పరచడం వల్ల భారత అంతరిక్ష కేంద్రానికి మానవుల్ని తీసుకుపోవడంతోపాటు, భూ పరిశీలన ప్రధాన మానవ నిర్మిత ఉపగ్రహం సంచారం సహా, చంద్రగ్రహ యాత్ర/గ్రహాంతర అన్వేషణ యాత్రల వంటి జాతీయ, వాణిజ్య ప్రధాన సాహస యాత్రలను చేపట్టడానికి మార్గం సుగమం కానుంది. తత్ఫలితంగా దేశం యావత్తు అంతరిక్ష సంబంధిత వ్యవస్థ లాభపడనుంది. దక్షత, సామర్ధ్యాల పరంగా చూసినప్పుడు భారతదేశ అంతరిక్ష సంబంధిత వ్యవస్థకు పెద్ద దన్నుగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan

Media Coverage

Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi