Ms. Julie Bishop MP, Foreign Minister of Australia meets PM Modi
Prime Minister Modi welcomes Australia’s joining of the International Solar Alliance

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జూలీ బిషప్ ఈ రోజు భేటీ అయ్యారు.


2017 ఏప్రిల్ లో ప్రధాని శ్రీ టర్న్ బుల్ పర్యటన విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా ఆత్మీయంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. 2014లో తాను స్వయంగా ఆస్ట్రేలియాలో పర్యటించిన నాటి నుండే ద్వైపాక్షిక సంబంధాలు గాఢతరం అయ్యాయని శ్రీ మోదీ అన్నారు.

2017 ఏప్రిల్ లో ప్రధాని శ్రీ మాల్ కమ్ టర్న్ బుల్ భారతదేశంలో పర్యటించినప్పటి నుండి ద్వైపాక్షిక సంబంధాలలో చోటు చేసుకొన్న పురోగతిని గురించి మంత్రి బిషప్ ప్రధాన మంత్రి శ్రీ మోదీకి సంక్షిప్తంగా వివరించారు.

ప్రధాన మంత్రి మరియు బిషప్ లు పరస్పర ప్రయోజనాలతో ముడిపడినటువంటి ప్రాంతీయ అంశాలపైనా, ప్రపంచ అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు.


ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ లో ఆస్ట్రేలియా చేరికను ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్వాగతించారు. ఆస్ట్రేలియా సభ్యత్వం ఈ అలయన్స్ కు గొప్ప ఉత్తేజాన్ని అందించగలదని ఆయన అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Led by iPhones, India sees highest Q1 smartphone exports by value

Media Coverage

Led by iPhones, India sees highest Q1 smartphone exports by value
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 జూలై 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond