భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
శ్రీ సెర్జియో గోర్ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ని కలవటం సంతోషంగా ఉంది. ఆయన పదవీకాలంలో భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నాకు నమ్మకం ఉంది’’.
Glad to receive Mr. Sergio Gor, Ambassador-designate of the US to India. I’m confident that his tenure will further strengthen the India–US Comprehensive Global Strategic Partnership.@SergioGor pic.twitter.com/WSzsPxrJXv
— Narendra Modi (@narendramodi) October 11, 2025


