షేర్ చేయండి
 
Comments

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్ స్ మిశెల్ ఆహ్వానించిన మీదట  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శనివారం నాడు జరిగిన భారతదేశం- ఇయు నేత ల సమావేశం లో పాల్గొన్నారు.  ఈ సమావేశాన్ని హైబ్రిడ్ ఫార్మేట్ లో నిర్వహించడమైంది.  దీని లో యూరోపియన్ యూనియన్ (ఇయు) కు చెందిన 27 సభ్యత్వ దేశాల నేతల తో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిశన్ అధ్యక్షుడు కూడా పాలుపంచుకొన్నారు.  ఇయు+27 ఫార్మేట్ లో భారతదేశం తో జరిగిన ఒక సమావేశానికి ఇయు ఆతిథేయి గా వ్యవహరించడం ఇదే మొదటి సారి.  ఈ సమావేశం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ తాలూకు అధ్యక్ష పదవి ని నిర్వహిస్తున్న పోర్చుగల్ చొరవ తో ఏర్పాటైంది.

సమావేశం సాగిన క్రమం లో నేత లు ప్రజాస్వామ్యం, మౌలిక స్వతంత్రత, చట్టాలకు అనుగుణం గా పాలన, బహుపక్ష వాదం ల కోసం ఉమ్మడి  వచనబద్ధత ల ఆధారం గా ఏర్పడ్డ భారతదేశం- ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా పటిష్టపరచుకోవాలని ఉందంటూ వారి అభిలాష ను  వ్యక్తం చేశారు.  1). విదేశీ విధానం- భద్రత, 2) కోవిడ్-19, జలవాయు మరియు పర్యావరణం, 3) వ్యాపారం-సంధానం మరియు సాంకేతిక విజ్ఞానం.. ఈ మూడు కీలకమైనటువంటి రంగాల ను గురించి వారు వారి ఆలోచనల ను వెల్లడించారు.   ప్రపంచ వ్యాప్త వ్యాధి అయిన కోవిడ్-19 తో పోరాడడం లో, ఆర్థిక వ్యవస్థ లు పుంజుకొనేటట్టు చేయడం లో, జలవాయు పరివర్తన ను ఎదుర్కోవడం లో, బహుపక్ష సంస్థల ను సంస్కరించడం లో సన్నిహిత సహకారాన్ని ఏర్పరచుకోవడాన్ని గురించి వారు చర్చించారు.  భారతదేశం కోవిడ్-19 తాలూకు సెకండ్ వేవ్ తో పోరాటం సాగించడం లో ఇయు తో పాటు ఇయు సభ్యత్వ దేశాలు అందించిన సత్వర సహాయాన్ని భారతదేశం ప్రశంసించింది.సమతులమైనటువంటి, సమగ్రమైనటువంటి స్వేచ్ఛాయుత వ్యాపారం మరియు పెట్టుబడి ఒప్పందాల కోసం సంప్రదింపులను పున:ప్రారంభించాలని తీసుకొన్న నిర్ణయాన్ని నేత లు స్వాగతించారు.   రెండు ఒప్పందాల నూ త్వరగాను, ఒకే సారిగాను కొలిక్కి తేవాలి అనే ఉద్దేశం తో వ్యాపారం మరియు పెట్టుబడి ఒప్పందాల పై సంప్రదింపుల ను సమాంతర దిశ లో కొనసాగించడం జరుగుతుంది.  ఆర్థిక భాగస్వామ్యం తాలూకు అవకాశాల ను పూర్తి స్థాయి లో ఉభయ పక్షాల వినియోగించుకొనేందుకు వీలు ను కల్పించే ఓ ప్రధానమైన పరిణామం ఇది.  డబ్ల్యు టిఒ అంశాలు, రెగ్యులేటరీ కోఆపరేశన్, మార్కెట్ లభ్యత అంశాలు, సప్లయ్ చైన్ రిజిలియన్స్ ను అనుసరించడం లపై ప్రత్యేకమైన సంభాషణల ను జరపాలని, అలాగే ఆర్థిక బంధాన్ని ఇంకా కాస్త వైవిధ్యభరితం గాను, విస్తృతమైంది గాను మలచుకోవాలన్న అభిమతాన్ని భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ లు చాటిచెప్పాయి.

శక్తి, రవాణా, ప్రజలకు- ప్రజలకు మధ్య సంధానాలను, డిజిటల్ కనెక్టివిటి ని ఇప్పటి కంటే ఎక్కువ గా వృద్ధి చెందించడంపై శ్రద్ధ వహించగల ఒక మహత్వాకాంక్షభరితమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ‘కనెక్టివిటి పార్ట్ నర్ శిప్’ ను భారతదేశం, ఇయు లు ప్రారంభించాయి.  సామాజిక, ఆర్థిక, విత్తపరమైన, జలవాయు సంబంధిత, పర్యావరణ పరమైన దీర్ఘకాలికత్వం, అంతర్జాతీయ చట్టం మరియు వచనబద్ధత ల పట్ల గౌరవం వంటి ఉమ్మడి సిద్ధాంతాలపై ఈ భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది.  సంధాన పథకాల కు ప్రయివేట్ ఫైనాన్సింగ్ ను, పబ్లిక్ ఫైనాన్సింగ్ ను ఈ భాగస్వామ్యం  ప్రోత్సహిస్తుంది.  ఈ భాగస్వామ్యం ఇండో- పసిఫిక్ సహా ఇతర దేశాల లో సంధాన సంబంధి కార్యక్రమాలకు అండదండలను అందించడం కోసం కొత్త సహక్రియల ను కూడా ప్రోత్సహిస్తుంది.

పారిస్ ఒప్పందం లక్ష్యాల ను సాధించడానికి కృషి చేయాలని భారతదేశం, ఇయు నేత లు వారి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.  అలాగే జలవాయు పరివర్తన తాలూకు ప్రభావాలను తగ్గించడానికి ఆ ప్రభావాల ను అనుసరించి ప్రతిఘాతకత్వాన్ని పెంచుకోవడానికి జరుగుతున్న సంయుక్త ప్రయాసల ను బలోపేతం చేయాలని, దీనితో పాటు సిఒపి26 సందర్భం లో ఆర్థిక సాయం అందించడం సహా కార్యాచరణ కు దోహదపడాలనే అంశం లో సైతం నేత లు వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.  సిడిఆర్ఐ లో చేరాలని ఇయు తీసుకొన్న నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది.  5జి, ఎఐ, క్వాంటమ్, ఇంకా హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ల వంటి డిజిటల్, నవోన్మేష సాంకేతికత ల విషయం లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని భారతదేశం, ఇయు లు సమ్మతించాయి.  ఏఐ, డిజిటల్ ఇన్ వెస్ట్ మెంట్ ఫోరమ్ పై ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ దళాన్ని వీలయినంత ముందుగా పనిచేయించడం దీనిలో ఒక భాగం గా ఉంటుంది.  

ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలవడం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర సంబంధి సహకారం సహా ప్రాంతీయ అంశాల లోను, ప్రపంచ అంశాల లోను సమన్వయం పెరుగుతూ ఉండడాన్ని నేతలంతా గమనించి సంతృప్తి ని వ్యక్తం చేశారు.  స్వేచ్ఛాయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి, నియమాలపై ఆధారపడినటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలనే విషయాన్ని నేత లు ఒప్పుకొన్నారు.  ఆ ప్రాంతం లో కలసి పనిచేయాలని వారు అంగీకరించారు. ఈ నేపథ్యం లో  ఇండో-పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి భారతదేశం చేపట్టిన కార్యక్రమాన్ని, ఇండో-పసిఫిక్ ప్రాంతం పైన ఇయు రచించిన నూతన వ్యూహాన్ని కూడా వారు లెక్క లోకి తీసుకొన్నారు.  

నేత ల సమావేశం తో పాటే మరో పక్క జలవాయు, డిజిటల్, ఆరోగ్య సంరక్షణ సంబంధి అంశాల లో సహకారం తాలూకు సిద్ధాంతాలను గురించి ప్రముఖం గా ప్రకటించడానికి ఒక ఇండియా- ఇయు బిజినెస్ రౌండ్ టేబుల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  పుణే మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 150 మిలియన్ యూరో విలువైన ఒక ఆర్థిక సహాయ ఒప్పంద పత్రం పైన భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ, యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకు లు సంతకాలు చేశాయి.

వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక కొత్త దిశ ను అందించడం ద్వారాను, 2020వ సంవత్సరం జులై లో జరిగిన భారతదేశం- ఇయు 15వ శిఖర సమ్మేళనం లో ఆమోదించినటువంటి మహత్వాకాంక్షయుతమైన భారతదేశం-ఇయు మార్గసూచీ 2025 ని అమలుపర్చడం కోసం ఒక సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తూను భారతదేశం- ఇయు నేత ల సమావేశం ఒక ప్రముఖమైన మైలురాయి ని స్థాపించింది.

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves rise $3.07 billion to lifetime high of $608.08 billion

Media Coverage

Forex reserves rise $3.07 billion to lifetime high of $608.08 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the passing away of legendary athlete Shri Milkha Singh
June 19, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the passing away of legendary athlete Shri Milkha Singh Ji. Shri Modi has described him as a colossal sportsperson who captured the nation's imagination and had a special place in the hearts of countless Indians.

In a series of tweets, the Prime Minister said, "In the passing away of Shri Milkha Singh Ji, we have lost a colossal sportsperson, who captured the nation’s imagination and had a special place in the hearts of countless Indians. His inspiring personality endeared himself to millions. Anguished by his passing away.

I had spoken to Shri Milkha Singh Ji just a few days ago. Little did I know that it would be our last conversation. Several budding athletes will derive strength from his life journey. My condolences to his family and many admirers all over the world."