I. ఒప్పందాలు ఎంవోయూలు

క్రమ సంఖ్య

ఒప్పందాలు

విభాగాలు

1.

ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి ప్రకటన

రక్షణ, భద్రత

2.

ఉమ్మడి భారత్-జర్మనీ ఆర్థిక, పెట్టుబడుల కమిటీలో భాగంగా ముఖ్య కార్యనిర్వహణాధికారుల ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉమ్మడి ప్రకటన

 


 

వాణిజ్యం, ఆర్థికం

3.

భారత్-జర్మనీ సెమీ కండక్టర్ వ్యవస్థ భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన

కీలకమైన, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

4.

కీలకమైన ఖనిజాల రంగంలో సహకారానికి ఉమ్మడి ప్రకటన

కీలకమైన, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

5.

టెలికమ్యూనికేషన్ల రంగంలో సహకారానికి ఉమ్మడి ప్రకటన

 

కీలకమైన, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

6.

జాతీయ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ, ఇన్ఫీనియాన్ టెక్నాలజీస్ ఏజీ మధ్య అవగాహనా ఒప్పందం

కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు

7.

అఖిల భారత ఆయుర్వేద సంస్థ, జర్మనీకి చెందిన షారిటే విశ్వవిద్యాలయం మధ్య అవగాహనా ఒప్పందం

సంప్రదాయ ఔషధాలు

8.

పెట్రోలియం, సహజవాయు నియంత్రణా బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ)కి, జర్మన్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అసోసియేషన్ ఫర్ గ్యాస్ అండ్ వాటర్ ఇండస్ట్రీస్ (డీవీజీడబ్ల్యూ) మధ్య అవగాహనా ఒప్పందం

పునరుత్పాదక ఇంధనం

9.

భారతీయ సంస్థ ఏఎం గ్రీన్, జర్మనీ సంస్థ యూనీపర్ గ్లోబల్ కమోడిటీస్ మధ్య గ్రీన్ అమ్మోనియాపై ఉత్పత్తి విక్రయ ఒప్పందం

హరిత హైడ్రోజన్

10.

జీవ ఆర్థిక వ్యవస్థపై పరిశోధనాభివృద్ధిలో ఉమ్మడి సహకారానికి సంయుక్త ప్రకటన

సైన్సు, పరిశోధన

11.

ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజీఎస్‌టీసీ) కాలపరిమితిని పొడిగిస్తూ.. ఉమ్మడి ప్రకటన

సైన్సు, పరిశోధన

12.

ఉన్నత విద్యపై ఇండో-జర్మన్ ప్రణాళిక

విద్య

13.

న్యాయంగా, నైతికంగా, నిలకడైన విధానంలో ఆరోగ్య నిపుణుల నియామకం కోసం అంతర్జాతీయ నైపుణ్య భాగస్వామ్య నియమావళికి ఉమ్మడి ప్రకటన

నైపుణ్యం, రవాణా

14.

హైదరాబాద్‌లోని జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రంలో పునరుత్పాదక ఇంధనంలో నైపుణ్యాల కోసం జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి ప్రకటన

నైపుణ్యం, రవాణా

15.

గుజరాత్‌లోని లోథాల్‌లో ఉన్న జాతీయ మారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి కోసం కేంద్ర ఓడరేవులు, షిప్పింగు, జలరావాణా మంత్రిత్వశాఖ, లోథాల్‌లోని జాతీయ మారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌కు జర్మనీలోని బ్రెమెర్‌హావెన్‌లో ఉన్న జర్మన్ మారీటైమ్ మ్యూజియం-లైబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మారీటైమ్ హిస్టరీ మధ్య అవగాహనా ఒప్పందం.

సాంస్కృతిక, ప్రజా సంబంధాలు

16.

క్రీడల్లో సహకారానికి ఉమ్మడి ప్రకటన

సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు

17.

తపాలా సేవల రంగంలో సహకారానికి ఉమ్మడి ప్రకటన

సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు

18.

కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని తపాలా విభాగం, డ్యూచే పోస్ట్ ఏజీ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు

19.

హాకీ ఇండియాకు, జర్మన్ హాకీ ఫెడరేషన్ (డ్యూచెర్ హాకీ-బుండ్ ఏ.ఫౌ) మధ్య యూత్ హాకీ అభివృద్ధి కోసం అవగాహనా ఒప్పందం

సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు

 

II. ప్రకటనలు

క్రమసంఖ్య

ప్రకటనలు

విభాగాలు

20.

భారత పాస్‌పోర్టు కలిగి ఉండి జర్మనీ మీదుగా ప్రయాణించేవారికి వీసా రహిత ప్రయాణ సౌకర్యం ప్రకటన

సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు

21.

ట్రాక్ 1.5 విదేశాంగ విధానం, భద్రతా చర్చల ఏర్పాటు

విదేశాంగ విధానం, భద్రత

22.

ఇండో-పసిఫిక్‌పై ద్వైపాక్షిక చర్చా యంత్రాంగం ఏర్పాటు

ఇండో-పసిఫిక్

23.

ఇండియా-జర్మనీ డిజిటల్ సమావేశం (2025-2027)కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక స్వీకరణ


 

సాంకేతికత, ఆవిష్కరణలు

24.

పునరుత్పాదక ఇంధనాలు, హరిత హైడ్రోజన్, పీఎం ఈ-బస్ సేవ, వాతావరణ అనుకూల పట్టణ మౌలిక వసతుల్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే.. ద్వైపాక్షిక హరిత, సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం (జీఎస్‌డీపీ)లో భాగంగా 1.24 బిలియన్ యూరోల కొత్త నిధుల కేటాయింపులు

హరిత, సుస్థిరాభివృద్ధి

25.

అంతర్జాతీయంగా పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులకు భారత్-జర్మనీ వేదిక పరిధిలో బ్యాటరీ స్టోరేజి వర్కింగ్ గ్రూపు ప్రారంభం

హరిత, సుస్థిరాభివృద్ధి

26.

భారత్-జర్మనీ త్రైపాక్షిక అభివృద్ధి సహకారంలో భాగంగా ఘనా (వెదురు డిజైన్, ప్రాసెసింగ్ కోసం డిజిటల్ సాంకేతికత కేంద్రం), కామెరూన్ (జాతీయ స్థాయిలో బంగాళాదుంప విత్తన ఆవిష్కరణకు వాతావరణ అనుకూల ఆర్ఏసీ టెక్నాలజీ ల్యాబు), మలావి (మహిళలు, యువతకు వ్యవసాయ విలువ ఆధారిత వ్యవస్థలో సాంకేతిక ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక కేంద్రం)లో ప్రాజెక్టులను వేగవంతం చేయడం

హరిత, సుస్థిరాభివృద్ధి

27.

అహ్మదాబాద్‌లో జర్మన్ కాన్సుల్ ప్రారంభం

సాంస్కృతిక, ప్రజా సంబంధాలు

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal

Media Coverage

India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.