ఒప్పందాలు

వరుస సంఖ్య

ఒప్పందం పేరు

వివరణ

1.

భారత్‌-కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏకోసం నిబంధనావళి

· ప్రతిష్టాత్మకమైనఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా చర్చలను ప్రారంభించడానికి నిబంధనావళి ఖరారైంది.

· వస్తువులుసేవల వాణిజ్యంతో పాటుపరస్పరం అంగీకరించిన ఇతర విధానపరమైన అంశాలపై ఈ చర్చలు జరుగుతాయిఒక సమగ్రమైనసమతుల్యమైనఇరు దేశాలకు మేలు చేసే విధంగా ఈ ఒప్పందాన్ని సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన నిర్మాణంఫ్రీక్వెన్సీ,పద్ధతులను ఈ నిబంధనావళి అందిస్తుంది.

· ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత భారత్కెనడాల మధ్య ఆర్థిక సంబంధాలను గణనీయంగా బలోపేతం చేస్తుందిఅంతేకాకుండా 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2.

సాంకేతికతఆవిష్కరణల్లో సహకారంపై భారత్‌-కెనడా-ఆస్ట్రేలియా త్రైపాక్షిక ఒప్పందం

· ఆస్ట్రేలియా-కెనడా-భారత్‌ సాంకేతికతఆవిష్కరణల భాగస్వామ్యం కింద అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఆవిష్కరణల్లో త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం

3.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,  మేనేజ్‌మెంట్ కుండ్లీలోని ఉమ్మడి పప్పుధాన్యాల ప్రోటీన్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రకటన

· భారతదేశం-కెనడా పప్పు ధాన్యాల ప్రోటీన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనువర్తిత ఆవిష్కరణల ద్వారా ఆహార శుద్ది సామర్థ్యాలనుపోషకాహార ఆధారిత ఆహార వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.

· సూక్ష్మపోషక లోపాలను పరిష్కరించడానికి అధునాతన ప్రోటీన్ వెలికితీతబలవర్థకమైన పప్పు ఉత్పత్తుల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.

4.

యురేనియం ఖనిజ సాంద్రీకృతాల  సరఫరా కోసం భారత అణుశక్తి శాఖ,  కెనడాకు చెందిన కామెకో సంస్థ మధ్య  వాణిజ్య ఒప్పందం.

· యురేనియం ఖనిజ సాంద్రీకృతాల  సరఫరా కోసం కెనడాకు చెందిన కామెకో సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం

· దేశంలో అణుశక్తి విస్తరణ దిశగా అత్యంత కీలకమైన చర్య.

·       వికసిత్‌ భారత్ దార్శనికతలో భాగంగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే భారత్‌ లక్ష్యానికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది

5.

గ్లోబలింక్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలికెనడాలోని మిటాక్స్ మధ్య ఒప్పందం

· కెనడియన్ విద్యాసంస్థల అధ్యాపక సభ్యుల పర్యవేక్షణలో సైన్స్ఇంజనీరింగ్గణితం నుంచి మానవీయ శాస్త్రాలుసాంఘిక శాస్త్రం వరకు వివిధ విద్యా విభాగాల్లో 12 వారాల పూర్తి నిధులతో కూడిన పరిశోధన ఇంటర్న్‌షిప్‌ను చేపట్టడానికి ఏటా 300 మంది అర్హత కలిగిన భారతీయ విద్యార్థులకు మూడు సంవత్సరాల పాటు (2027 నుంచిపూర్తిగా నిధులతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు.

6.

కీలక ఖనిజాల సహకారంపై ఒప్పందం

· సురక్షితమైనస్థితిస్థాపకమైన కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్కెనడాల మధ్య కుదిరిన పరస్పర ప్రయోజనకరమైన సహకారం.

· ఇరు దేశాల్లో పెట్టుబడుల ప్రోత్సాహాన్నిప్రాజెక్టుల గుర్తింపును సులభతరం చేస్తుందికీలకవ్యూహాత్మక ఖనిజాల అన్వేషణగనుల తవ్వకంలబ్ధిసమర్థవంతమైన వెలికితీత కోసం ప్రాసెసింగ్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానంఉత్తమ పద్ధతుల మార్పిడిని ఇది ప్రోత్సహిస్తుంది.

7.

పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంపై ఒప్పందం

· పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుందిఇంధన నిల్వసౌర శక్తిపవన శక్తిబయోమాస్/బయో-ఇంధన రంగాల్లో  సమాచార మార్పిడిఉత్తమ పద్ధతులుఅనుభవాల పాఠాలుసామర్థ్య పెంపునకు తోడ్పాటునందిస్తుంది.

8.

సాంస్కృతిక సహకారంపై ఒప్పందం

· సంస్కృతిజ్ఞానాభివృద్ధి ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.

· ఉమ్మడి ప్రాజెక్టులుప్రదర్శన కళలుదృశ్య కళలుఇతర సృజనాత్మక పరిశ్రమలుఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో సాంస్కృతిక కార్యకలాపాలనుసహకార ప్రాజెక్టులను నిర్వహిస్తుంది.

 

ముఖ్యమైన ప్రకటనలు

 

9. కృత్రిమ మేధ, వైద్యం, వ్యవసాయం, ఆవిష్కరణల వంటి రంగాల్లో వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థల మధ్య 24 ఒప్పందాలు

10. ప్రపంచ జీవ ఇంధన కూటమిలో భాగస్వామిగా చేరనున్న కెనడా.

11.అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యదేశంగా చేరనున్న కెనడా.

12.హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్‌లో కెనడా చర్చల భాగస్వామిగా చేరడానికి భారత్‌ మద్దతు.

13. భారత్-కెనడా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ స్థాపన.

14. భారత్-కెనడా సీఈఓ ఫోరం పునర్నిర్మాణం-ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, ప్రాధాన్యతా రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కీలక వేదిక.

15. భారత్-కెనడా రక్షణ చర్చలు.

16. కెనడా విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో కొత్తగా కెనడా-భారత్‌ ఉమ్మడి ప్రతిభ, ఆవిష్కరణ వ్యూహాన్ని ప్రారంభించడం .

17. 2026 మార్చి 17 నుంచి 30 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ ట్రైబ్స్ ఫెస్ట్‌లో కెనడా భాగస్వామ్యం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How AI & next-gen tech driving India’s MedTech growth

Media Coverage

How AI & next-gen tech driving India’s MedTech growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi