గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ భారత్‌లో అధికారికంగా పర్యటించిన సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళికపై సంయుక్త ప్రకటన:

1. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ 2025 సెప్టెంబరు 2 నుంచి 4 వరకు భారత్‌లో అధికారికంగా పర్యటించారు.

2. 2025 సెప్టెంబరు 4న ప్రధానమంత్రులిద్దరూ విస్తృత స్థాయిలో చర్చించారు. అనంతరం నాయకులిద్దరూ వివిధ అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మోదీ ఇచ్చిన విందుకు వాంగ్ హాజరయ్యారు. గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కూడా ఆయన కలిశారు. సింగపూర్ ప్రధానమంత్రి వాంగ్ రాజ్‌ఘాట్‌ను కూడా సందర్శించి మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా వాంగ్‌ను కలిశారు.

3. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తవుతాయి. భారత్, సింగపూర్ మధ్య నమ్మకం, పరస్పర గౌరవం, అనేక రంగాల్లో విస్తృత సహకారం ప్రాతిపదికలుగా సుదీర్ఘ స్నేహ సంప్రదాయం నెలకొని ఉన్నదని ప్రధానులిద్దరూ అంగీకరించారు. 2024 సెప్టెంబరులో సింగపూర్‌లో భారత ప్రధానమంత్రి మోదీ అధికారిక పర్యటన, 2025 జనవరిలో భారత్‌లో గౌరవ సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం అధికారిక పర్యటన, 2025 ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన మూడో భారత్-సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశాల వంటి ఇటీవలి ఉన్నత స్థాయి కార్యక్రమాలు సహా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారు సమీక్షించి, సంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంకేతికత, విద్య, ప్రజా, సాంస్కృతిక రంగాలు సహా సమగ్ర సహకారంగా ఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి.

4. 2024 సెప్టెంబరులో సింగపూర్‌లో భారత ప్రధానమంత్రి మోదీ అధికారిక పర్యటన సందర్భంగా.. ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్పీ)గా మలచుకునే దిశగా ఒప్పందాన్ని ప్రధానులిద్దరూ గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దశాదిశలను నిర్దేశించేలా, ఎనిమిది రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేలా.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వాస్తవిక ప్రణాళికను రూపొందించి, స్వీకరించేందుకు వారు అంగీకరించారు. ఆ ఎనిమిది రంగాలు: (i) ఆర్థిక సహకారం; (ii) నైపుణ్యాల అభివృద్ధి; (iii) డిజిటలీకరణ; (iv) సుస్థిరత; (v) అనుసంధానం; (vi) ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు; (vii) ప్రజా, సాంస్కృతిక సంబంధాలు; (viii) రక్షణ, భద్రతాపరమైన సహకారం.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ప్రణాళిక

  • ఆర్థిక సహకారం: కొత్త, భవిష్యత్ దార్శనిక రంగాల్లో ఆర్థిక సంబంధాల బలోపేతం, సహకారాన్ని పెంపొందించుకోవడం

  • సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ), వాణిజ్యమూ పెట్టుబడుల సంయుక్త కార్యాచరణ బృందం వార్షిక సమావేశం ద్వారా.. ఇరుదేశాల వాణిజ్య ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, మార్కెట్లలో ప్రవేశ సౌలభ్యాన్ని మరింత పెంచడం;

  • ఇరు పక్షాల మధ్య చర్చల కొనసాగింపు.. అలాగే, సీఈసీఏ మూడో సమీక్షను ప్రారంభించడంలో పురోగతి సాధించడంతోపాటు 2025లో వస్తువుల ఒప్పందంలో ఆసియాన్ భారత్ వాణిజ్యాన్ని (ఏఐటీఐజీఏ) విశేషంగా సమీక్షించడం;

  • భారత సెమీకండక్టర్ పరిశ్రమ, సానుకూల వ్యవస్థ వృద్ధికి చేయూతనివ్వడం.. అందులో భాగంగా భారత్ - సింగపూర్ సెమీకండక్టర్ విధాన చర్చల కింద సహకారం, సింగపూర్ కంపెనీలతో భాగస్వామ్యాలకు అవకాశాలు, క్రియాశీలంగా ఉండే సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థల అభివృద్ధి, పరస్పర ప్రయోజనకరమైన పరిశోధన - అభివృద్ధి సహకారాల అన్వేషణ, శ్రామికశక్తి అభివృద్ధికి ప్రోత్సాహం, సమాచార వినిమయం ద్వారా వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడం, అత్యుత్తమ విధానాల పరస్పర మార్పిడి, ప్రత్యక్ష పెట్టుబడులు, భారతీయ - సింగపూర్ సంస్థల మధ్య అవకాశమున్న భాగస్వామ్యాలు;

  • వెంచర్లూ భాగస్వామ్యాల ఏర్పాటు, వైజ్ఞానిక వినిమయంలో ప్రభుత్వాల నడుమ సహకారం, నైపుణ్య శిక్షణ, పర్యావరణ హిత ప్రమాణాల అమలు, బృహత్ప్రణాళికలు, ప్రోత్సాహం సహా... సంయుక్తంగా పర్యావరణ హిత మార్గాల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, అధునాతన తయారీ సామర్థ్యాలతో సమగ్ర పారిశ్రామిక పార్కులు

  • భారత్-సింగపూర్ మూలధన మార్కెట్ అనుసంధానాన్ని సంయుక్తంగా మెరుగుపరచడం.. అలాగే ఎన్ఎస్ఈ-ఐఎఫ్ఎస్సీ-ఎస్‌జీఎక్స్ గిఫ్ట్ కనెక్ట్ వంటి ఉమ్మడి కార్యక్రమాలపై సన్నిహిత సహకారాన్ని నిర్మించడం,

  • భారత్, సింగపూర్‌లోని వాణిజ్య వర్గాల మధ్య భాగస్వామ్యాలు, ముఖ్యంగా ద్వైపాక్షిక సహకార ఎజెండాను అమలు చేసే రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం.. భారత్-సింగపూర్ వాణిజ్య రౌండ్ టేబుల్ సమావేశాల (ఐఎస్‌బీఆర్) వంటి వ్యాపార సంబంధాలనూ విస్తృతం చేయడం,

  • అంతరిక్ష రంగంలో ఉమ్మడి సహకారాన్ని ప్రోత్సహించడం.. ఇందులో భాగంగా భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, ఆధీకృత కేంద్రం (IN-SPACe)- సింగపూర్ అంతరిక్ష సాంకేతికత, పరిశ్రమల కార్యాలయం మధ్య, అలాగే ఇరుదేశాల అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకారం; అంతరిక్ష విధానమూ చట్టాల్లోనూ, అలగే భూ పరిశీలన, ఉపగ్రహ కమ్యూనికేషన్ సాంకేతికత, అనువర్తనాలు వంటి ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాల్లో పరిశోధన - అభివృద్ధి కార్యకలాపాల్లోనూ సహకారం,

  • భారత్, సింగపూర్‌లోని సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రమేయంతో ఇరుపక్షాల వాణిజ్య అవసరాలను తీర్చే లక్ష్యంతో అవకాశమున్న చోట్ల చట్టపరమైన, వివాద పరిష్కార సహకారాన్ని పెంపొందించుకోవడం.

    నైపుణ్యాల అభివృద్ధినైపుణ్యాలుసామర్థ్యాభివృద్ధిలో భాగస్వామ్యం

  • తమిళనాడులోని చెన్నైలో అధునాతన తయారీపై సంయుక్తంగా జాతీయ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు... పారిశ్రామిక సంబంధాలను పెంచడం, పాఠ్యాంశాల్లో ప్రమాణాలపై సహకారం, శిక్షకులకు శిక్షణ, నైపుణ్య ధ్రువీకరణ వ్యవస్థల ఏర్పాటు, ఎప్పటికప్పుడు సమీక్షలు, మదింపులతో నాణ్యతను కాపాడుకోవడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అధునాతన తయారీ, విమానయానం, నిర్వహణపరమైన మరమ్మతులూ సమగ్ర మరమ్మతులూ (MRO) సహా ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాల్లో నైపుణ్య కేంద్రాల అభివృద్ధి దిశగా ప్రైవేటు రంగంతో సహకరించడంపైనా ఇది దృష్టిపెడుతుంది.

  • సాంకేతిక వృత్తి విద్య - శిక్షణ (టీవీఈటీ), నైపుణ్యాల అభివృద్ధిలో సామర్థ్యాభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడం, ఉన్నత విద్యా సంస్థల మధ్య సాంకేతిక విద్యా రంగంలో సహకారం, ఉద్యోగుల్లో కొత్త నైపుణ్యాల శిక్షణతోపాటు ప్రస్తుత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సమాచారం, అత్యుత్తమ పద్ధతుల విషయంలో పరస్పర మార్పిడి, విద్యార్థులూ సిబ్బంది వినిమయం, విద్యార్థుల ఇంటర్న్ షిప్పులూ పరిశ్రమలతో సిబ్బంది ఎటాచ్మెంట్లనూ పెంచడం, బోధకులకు శిక్షణ. విద్య, నైపుణ్యాభివృద్ధి ఎజెండాలో పురోగతిని ముందుకు తీసుకెళ్లి, సమీక్షించడం కోసం ఇరుపక్షాలూ ఓ ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తాయి,

  • సింగపూర్-అస్సాం నర్సింగ్ టాలెంట్ స్కిల్స్ కోఆపరేషన్ వంటి రాష్ట్ర స్థాయి నైపుణ్య సహకారానికి చేయూతనిచ్చేలా నైపుణ్యాభివృద్ధి కోసం సింగపూర్‌ - భారత్ మధ్య ప్రస్తుత సహకారాన్ని మరింత బలోపేతం చేయడం,

  • డిజిటలీకరణ: డిజిటల్, ఆర్థిక సాంకేతికతల్లో సహకారాన్ని బలోపేతం చేయడం

  • ఫిన్‌టెక్‌పై సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా.. భారత్ - సింగపూర్ మధ్య డిజిటల్ ఫైనాన్స్‌ను, ఫిన్ టెక్‌లో సహకారంతోపాటు సైబర్ భద్రతనూ మూలధన మార్కెట్ అనుసంధానాలనూ బలోపేతం చేయడం,

  • డిజిటల్ మార్గాల్లో అనుభవాలను పంచుకోవడంతోపాటు సాంకేతిక నైపుణ్య పరస్పర వినిమయం.. అలాగే, ప్రయోగాత్మక ప్రాజెక్టుల ద్వారా వాటి అమలును పర్యవేక్షించడం,

  • డిజిటల్ రంగంలో భాగస్వామ్యాలు లక్ష్యంగా ఇరు పక్షాల అంకుర సంస్థలు - చిన్న, మధ్య తరహా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం,

  • సైబర్ విధానాలు, సీఈఆర్టీ -  సీఈఆర్టీ సమాచార వినిమయం, సైబర్ భద్రతా సామర్థ్యాభివృద్ధి, సైబర్ సంబంధిత అంశాల్లో ఇరువైపులా భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడం,

  • గిఫ్ట్ సిటీ-సింగపూర్ సహకారానికి సంబంధించి.. విధాన చట్రంపై చర్చలను ప్రారంభించడానికి, అలాగే అది వర్తించే డేటా రకాల వంటి వినియోగ సందర్భాలను గుర్తించి, ట్రయల్ చేయడానికి భారత్, సింగపూర్‌లోని సంబంధిత ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల అధికారులతో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటు,

  • ఆవిష్కరణలతోపాటు సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, డిజిటల్ సాంకేతికతలపై ప్రస్తుతం  ఉమ్మడి కార్యాచరణ బృందం పరిధిలో కీలక, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో సహకార అవకాశాలను పరిశీలించడం.

  • వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఏఐ సిద్ధంగా ఉన్న డేటా సెట్‌లను అభివృద్ధి చేయడానికి, డేటా ఆధారిత ఏఐ వినియోగ నమూనాలను నిర్మించడంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా కృత్రిమ మేధస్సుపై సహకారాన్ని అన్వేషించడం

  • యూపీఐ-పే నవ్‌ లింకేజ్‌ను ఉపయోగించి దేశాల మధ్య చెల్లింపుల సామర్థ్యాన్ని పెంచడం, కాగితరహిత, సురక్షిత, వ్యాపార, వ్యక్తిగత చెల్లింపుల మార్గాలను విస్తరించడం, పరిమితిని పెంచడం

  • భారత, సింగపూర్ మధ్య ట్రేడ్‌ ట్రస్ట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేసి పరస్పరం అనుసంధానమైన ఈ-బిల్స్ ఆఫ్ లేడింగ్ ద్వారా నమ్మదగిన, సురక్షిత వాణిజ్య పత్రాలను మార్పిడి చేయడం.

  • స్థిరత్వం: సుస్థిర అభివృద్ధి, హరిత వాణిజ్యంలో సహకార అవకాశాలను అన్వేషించడం

  • గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి, వాణిజ్యంలో సహకారాన్ని పెంచడం.

  • పట్టణ నీటి నిర్వహణ రంగంలో సహకారాన్ని అన్వేషించడం.

  • పౌర అణు రంగంలో సహకార మార్గాలను అన్వేషించడం.

  • పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 ప్రకారం వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొవడానికి పరస్పర లాభదాయకమైన ద్వైపాక్షిక సహకార వ్యూహాన్ని అభివృద్ధి చేయడం.

  • సింగపూర్ సభ్యదేశంగా ఉన్న సంస్థలైన అంతర్జాతీయ సౌర కూటమి, ప్రపంచ బయోఇంధన కూటమి వంటి బహుపాక్షిక వేదికలపై హరిత, సుస్థిర కార్యక్రమాలపై కలసి పని చేయడం.

  • భారత్‌, సింగపూర్ మధ్య, అలాగే మూడో దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా ఆహార భద్రతపై సహకారాన్ని లోతుగా అభివృద్ధి చేయడం.

  • ఎంపిక చేసిన ఎగుమతులకు దేశ స్థాయి. గుర్తింపు అవకాశాలను అన్వేషించడం ద్వారా ఈ సహకారాన్ని బలోపేతం చేయడం.

  • అనుసంధానం: సముద్ర, విమానయాన అనుసంధానతను విస్తరించడం.

  • భారత్‌, సింగపూర్‌ మధ్య హరిత, డిజిటల్ రవాణా మార్గం (జీడీఎస్‌సీ) స్థాపనకు మద్దతు ఇవ్వడం ద్వారా సింగపూర్, భారత్‌లోని నౌకాశ్రయాల మధ్య సముద్ర అనుసంధానాన్ని మరింతగా పెంచవచ్చు. ఇది హరిత సముద్ర ఇంధన కారిడార్ స్థాపనకు కృషి చేస్తుంది.

  • భారత్‌లో అభివృద్ధి చెందుతున్న విమానయాన, అంతరిక్ష రంగాల్లో రెండు దేశాల సంస్థల మధ్య భాగస్వామ్యాల ద్వారా అనుబంధ వ్యవస్థ సహకారాన్ని మరింతగా పెంపొందించడం, సింగపూర్ నైపుణ్యాన్ని పంచుకోవడం, ఉద్యోగ శిక్షణ అవకాశాలను అందించడం.

  • రెండు దేశాల మధ్య ప్రయాణ అవకాశం పెరుగుదలను గుర్తించిన ఇరు దేశాల ప్రధానులు వైమానిక అనుసంధానాన్ని పెంపొందించడానికి ద్వైపాక్షిక వాయు సేవల ఒప్పందాన్ని విస్తరించడం గురించి చర్చించాలని రెండు దేశాల పౌర విమానయాన అధికారులను ప్రోత్సహించారు.

  • భారత విమానాశ్రయాల కోసం విమానాశ్రయ సలహా, నిర్వహణ సేవలలో అనుభవం, నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడంతో సహా సామర్థ్య నిర్మాణం, విమానాశ్రయ అభివృద్ధిలో భాగస్వామ్యాలను అన్వేషించడం.

  • విమానయాన రంగంలో పరిశుభ్రమైన, స్థిరమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా స్థిరమైన విమానయాన ఇంధనంపై సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.

  • ఆరోగ్య సేవలు, వైద్యం: ఆరోగ్య సేవలు, వైద్య రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం

  • ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం కింద సహకారాన్ని మరింతగా పెంచడం. ఇందులో మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, వ్యాధి పర్యవేక్షణ, తల్లి-బిడ్డ ఆరోగ్యం, పోషకాహారం, ఆరోగ్య విధానాలు,, వైద్య ఉత్పత్తులపై దృష్టి సారించడం,నియంత్రణ సులభతరం చేసే సహకార పరిశోధనపై దృష్టి పెట్టడం, సంక్రమించే, సంక్రమించని వ్యాధులను ఎదుర్కోవడం, ఆరోగ్య భద్రత, పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం.

  • ఆరోగ్య సహకారంపై ఏర్పాటైన సంయుక్త కార్యనిర్వాహక వర్గాన్ని క్రమం తప్పకుండా సమావేశపరచడం.

  • నర్సింగ్ నైపుణ్యాల శిక్షణలో సమాచారం, జ్ఞానాన్ని పంచుకోవడం చేసుకోవడం ద్వారా నర్సింగ్ నైపుణ్యాల అభివృద్ధి రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చయడం. అదే విధంగా ప్రస్తుతం సింగపూర్, అస్సాం రాష్ట్రం మధ్య నర్సింగ్ ప్రతిభ నైపుణ్యాల సహకారంపై అవగాహన ఒప్పందం ప్రకారం సింగపూర్‌లో ఉపాధిని మెరుగుపరచడం.

  • డిజిటల్ ఆరోగ్యం/ వైద్య సాంకేతికత రంగాల్లో సహకార పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధిలో కొనసాగుతున్న సహకారాన్ని మరింతగా విస్తరించడం. కొత్త ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు

  • ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి: ప్రజల మధ్య సంబంధాలను, సాంస్కృతిక అనుబంధాలను మద్దతివ్వడం

  • భారత్‌- సింగపూర్ మధ్య దీర్ఘకాలిక సామాజిక, సాంస్కృతిక, ప్రజల మధ్యకు సంబంధాలను మరింత బలోపేతం చేయడం. ముఖ్యంగా సముద్ర వారసత్వం వంటి పరస్పర ఆసక్తి కలిగిన రంగాల్లో సహకారాన్ని అన్వేషించడం

  • పారిశ్రామిక శిక్షణా సంస్థల విద్యార్థులతో సహా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం, విస్తరించడం. సింగపూర్-భారత్‌ భాగస్వామ్య సంస్థ ద్వారా నిర్వహించే అనుభవజ్ఞ శిక్షణా కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా భారతీయ కంపెనీలలో సింగపూర్ ఇంటర్న్‌ల అనుబంధం వంటివి కలిగి ఉంటాయి

  • పార్లమెంటరీ మార్పిడి కార్యక్రమాల ద్వారా మరింత లోతైన పార్లమెంటరీ అనుసంధానాన్ని ప్రోత్సహించడం.

  • సీనియర్‌ ప్రభుత్వాధికారుల స్థాయిలో అధ్యయన సందర్శనల ద్వారా ప్రజాసేవ మార్పిడిని, శిక్షణను సులభతరం చేయడం.

  • రాయబారి/దౌత్య సంబంధాల విషయంలో సంబంధిత అధికారుల మధ్య క్రమం తప్పకుండా సలహా సమావేశాలను నిర్వహించడం ద్వారా సమస్యలకు వేగంగా పరిష్కారాలు కనుగొనడం..

  • రెండు దేశాల ఆలోచనా సంస్థలు, అకాడమిక్‌ సంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య స్థిరమైన సంబంధాలనీ, పరస్పర అనుసంధానాన్నీ ప్రోత్సహించడం.

  • కళాకారులు, కళాబృందాలు, ప్రదర్శనల ద్వారా సాంస్కృతిక మార్పిడిని కొనసాగించడం, ప్రోత్సహించడం.

  • రక్షణ, భద్రతా సహకారం: ప్రాంతీయ శాంతి స్థిరత్వాన్ని ప్రోత్సహించే వ్యూహాత్మక సహకారం.

  • అన్ని స్థాయిల్లో రక్షణ, భద్రతా సహకారంపై నిరంతర మార్పిడులు, అనుసంధానాన్ని ప్రోత్సహించడం. ఇద్దరు రక్షణ మంత్రుల మధ్య సమావేశాలు, సీనియర్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సైనిక సహకారం, మార్పిడికి సంబంధించి రక్షణ విధాన చర్చలు కూడా ఉంటాయి. ఇందులో భారత్‌, సింగపూర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి వివిధ రూపాలలో నిర్వహించే సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఉంటాయి.

  • క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆటోమేషన్, మానవ రహిత నౌకలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రక్షణ సాంకేతికత సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడం.

  • సముద్ర భద్రత, జలాంతర్గామి రక్షణ రంగాల్లో సహకారాన్ని కొనసాగించడం. అలాగే ఇండో-పసిఫిక్‌, ఇండో-పసిఫిక్‌ మహా సముద్రాల కార్యక్రమాలపై ఏషియన్‌ దృక్పథం సూత్రాలు, సహకార రంగాలకు అనుగుణంగా ప్రాంతీయ భద్రతా వ్యవస్థలతో సన్నిహితంగా పనిచేయడం.

  • అంతర్జాతీయ అనుసంధాన అధికారుల ద్వారా సంబంధిత సమాచార విలీన కేంద్రాల మధ్య సముద్ర ప్రాంత అవగాహనలో సహకారాన్ని బలోపేతం చేయడం.

  • మలక్కా జలసంధి నిఘాపై భారత్‌ ఆసక్తిని సింగపూర్ కృతజ్ఞతతో గుర్తించింది.

  • సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో పరస్పర సహకారాన్ని బలపరచడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి 1267 ఆంక్షల కమిటీ నిషేధించిన వాటితో సహా ప్రపంచ, ప్రాంతీయ ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా, ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా, ద్వైపాక్షిక యంత్రాంగాలు, ఎఫ్‌ఏటీఎఫ్‌, ఇతర బహుపాక్షిక వేదికల ద్వారా పోరాడటానికి రెండు దేశాల సహకారాన్ని బలోపేతం చేస్తాయి.

  • రెండు దేశాల మధ్య జరిపే నేర విచారణలు, న్యాయ ప్రక్రియలలో సహకారాన్ని సులభతరం చేసే ద్వైపాక్షిక్ష పరస్పర చట్ట సహాయ ఒప్పందం కింద సహకారాన్ని బలోపేతం చేయడం.

  • సింగపూర్‌, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్య జరుగుతున్న విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల ద్వారా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించేందుకు కట్టుబడి ఉన్నాయి.

  • సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో పురోగతిని ప్రతి ఏడాది పర్యవేక్షించేందుకు భారత్‌-సింగపూర్ మంత్రుల రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఒక అగ్రగామి యంత్రాంగంగా సంస్థాగతీకరించడానికి ఇద్దరు ప్రధానులు అంగీకరించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM SVANidhi Yojana: How UP became India's top state for street vendor loans

Media Coverage

PM SVANidhi Yojana: How UP became India's top state for street vendor loans
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM chairs 11th Governing Council Meeting of NITI Aayog
June 11, 2026
Vision of Viksit Bharat should become the collective resolve of every State, district, block and village: PM
PM calls India's 70 crore youth its asset, urges States to transform this Demographic dividend into Development dividend
PM encourages States to create opportunities for youth and MSMEs and actively attract investments from countries with which India has signed FTAs
States to strengthen ODOP and leverage opportunities in defence manufacturing: PM
PM emphasizes that AI should be viewed as an opportunity and people should be equipped with future ready skills
PM highlights the need for coordinated efforts to address emerging social challenges such as drug abuse and cyber fraud
PM draws attention to concerns arising from El Niño and urges States to conserve water and promote natural farming
CMs/LGs/Administrators congratulate PM Modi on completing 12 years in office
States express solidarity with the Centre to withstand the global geo-political crisis and to strengthen India’s resilience
All States and 5 UTs attend meeting; first time when CMs of all 28 States participate
Theme of meeting : Inclusive Human Development for Viksit Bharat@2047

Prime Minister Shri Narendra Modi chaired the 11th Governing Council Meeting of NITI Aayog at Rashtrapati Bhavan Cultural Centre, New Delhi, earlier today. This year’s theme was Inclusive Human Development for Viksit Bharat@2047. It was attended by Chief Ministers, Lt. Governors and Administrators representing 28 States and 5 UTs. This was the first time when Chief Ministers of all 28 States participated in the Governing Council Meeting of NITI Aayog.

Prime Minister noted that at a time when many major economies are facing uncertainty and economic challenges, India’s growth story continues to inspire the world. He emphasized the need to further strengthen the nation’s resolve towards self-reliance and highlighted the importance of adopting and implementing global best practices, particularly in the renewable energy sector.

Underscoring the importance of cooperative federalism, Prime Minister stated that the Centre and the States must work together to achieve the goal of a Viksit Bharat. He stressed that the vision of Viksit Bharat should become the collective resolve of every State, district, block and village.

Highlighting the strength of India’s demographic profile, Prime Minister observed that the country’s youth constitute its greatest asset, with nearly 70 crore Indians below the age of 25 years. Calling this a demographic dividend, he urged States to focus on transforming it into a development dividend through education, skilling and capacity-building initiatives that prepare young people for future opportunities and challenges.

Referring to India’s recently concluded trade agreements with several countries, Prime Minister encouraged States to create opportunities for youth and MSMEs and to equip stakeholders to effectively leverage the benefits arising from these agreements. He also urged States to actively attract investments from partner countries.

Emphasizing women-led development, Prime Minister called upon States to work towards increasing the number of Lakhpati Didis from 3 crore to 6 crore and stressed the importance of ensuring a safe and secure environment for Nari Shakti.

Prime Minister urged States to focus on One District One Product (ODOP) initiatives and develop export-oriented strategies around it. He also identified defence manufacturing as an emerging sector where India is establishing a distinct identity and encouraged States to formulate policies to leverage the opportunities arising from its growth.

Prime Minister highlighted the need for coordinated efforts to address emerging social challenges such as drug abuse and cyber fraud through preventive measures, awareness campaigns and effective governance.

Prime Minister also drew attention to concerns arising from El Niño conditions and appealed to States to promote water conservation and encourage natural and organic farming practices. He noted that the purchase of 11 lakh tonnes of organic manure by farmers during the current Kharif season reflected growing confidence in sustainable agriculture.

Prime Minister emphasized the need to evaluate progress at the district level, particularly through aspirational district parameters. Prime Minister suggested that on similar lines, 100 districts should be identified in the field of agriculture to bring positive results. He urged the States to take lead in this pursuit so that a phenomenal change can be achieved through the aspirational approach.

Prime Minister emphasised the need for a monitoring framework and targeted 100-day and five-year goals towards achieving the vision of Viksit Bharat@2047.

Highlighting the importance of good governance, transparency, and infrastructure for attracting investment, he urged States to focus on branding, ease of doing business, and emerging opportunities in sectors such as data centres and artificial intelligence. He emphasized that AI should be viewed as an opportunity and called for greater efforts to equip people with the skills required for the future economy.

The Chief Ministers/Lt. Governors/Administrators congratulated Prime Minister Modi on completing 12 years in his office. They also expressed solidarity with the Centre to withstand the global geo-political crisis and to strengthen India’s resilience with respect to energy requirements, and sustain its growth trajectory.

Prime Minister noted that the discussions were constructive and reflected the aspirations, hopes, experiences, best practices, and challenges of the States. Prime Minister expressed his gratitude to all the CMs, LGs and Administrators for participating in the meeting and expressed confidence that Together, through cooperation, innovation, and a shared commitment to development, India can accelerate its journey towards a Viksit Bharat by 2047.