భారతదేశంగెలుచుకొన్న పతకాల చారిత్రక సంఖ్య మన మనస్సుల ను ఆనందం తో నింపివేసింది: ప్రధాన మంత్రి
జపాన్ప్రజల ను మరియు జపాన్ ప్రభుత్వాన్ని అపూర్వమైనటువంటి ఆతిథ్యానికి గాను ప్రశంసించినప్రధాన మంత్రి

భారతదేశం క్రీడల చరిత్ర లో టోక్యో పారాలింపిక్స్ ఎల్లప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగివుంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన దళం లోని ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క సభ్యురాలు అసహాయ శూరులే, వారు ప్రేరణ మూర్తులే అని ఆయన అన్నారు.

క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు నిరంతరం సమర్థన ను ఇస్తూవస్తున్నందుకు గాను కోచ్ లను, సహాయ సిబ్బంది ని, ఎథ్ లీట్ ల కుటుంబాల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. అరుదైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు, ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించినందుకు, అలాగే ఈ ఒలింపిక్ క్రీడోత్సవాలు జరిగినన్ని రోజులూ హుషారు గా ఉండడం మరియు అంతా కలసివుండడం అనేటటువంటి ఎంతో ముఖ్యమై సందేశాన్ని వ్యాప్తి చేసినందుకు గాను జపాన్ ప్రజల ను, మరీ ముఖ్యంగా టోక్యో నివాసులను, జపాన్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి పొగడారు.

అనేక ట్వీట్ ల లో ప్రధాన మంత్రి ఈ కింది విధం గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు:

‘‘భారతదేశం క్రీడల చరిత్ర లో, టోక్యో #Paralympics కు సదా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ ఆటల పోటీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరి జ్ఞాపకాల పొరల లో ఎప్పటికీ నిలచిపోతాయి; అంతేకాకుండా, క్రీడల ను ఎంపిక చేసుకొనేందుకు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు తరాల తరబడి ప్రోత్సాహాన్ని అందించగలుగుతాయి. మన దళం లో ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క సభ్యురాలు అసహాయ శూరులు, ప్రేరణ మూర్తులూను.
 

సంఖ్య లో భారతదేశం గెలుచుకొన్న పతకాలు మన అందరి హృద‌యాల ను ఆనందం తో నింపివేశాయి. ఆటగాళ్ల కు నిరంతర సమర్థన ను ఇస్తూ వస్తున్నందుకు గాను మన కోచ్ లను, సహాయ సిబ్బంది ని, మన క్రీడాకారుల కుటుంబ సభ్యుల ను నేను ప్రశంసించదలుస్తున్నాను. క్రీడల లో మన ప్రాతినిధ్యం మరింత ఎక్కువ గా పెరిగేటట్టు మన సాఫల్యాల నుంచి మనం స్ఫూర్తి ని పొందుదాం.

నేను ఇంతకు ముందు చెప్పినట్లు, జపాన్ ప్రజల ను, మరీ ముఖ్యం గా టోక్యో నివాసుల ను, జపాన్ ప్రభుత్వాన్ని వారి అపూర్వమైన ఆతిథ్యానికి గాను, ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకొన్నందుకు గాను, ఈ ఒలింపిక్ క్రీడోత్సవాలు సాగినంత కాలం ఒకరితో మరొకరు కలుపుకోగోలు గా మెలగాలనే, హుషారు గా ఉండాలనే అతి ముఖ్యం అయినటువంటి సందేశాన్ని వ్యాప్తి లోకి తీసుకు వచ్చినందుకు గాను పొగడి తీరాల్సిందే.’’

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Congress insulted Banjaras, only Mahayuti can realise Viksit Bharat dream: Modi

Media Coverage

Congress insulted Banjaras, only Mahayuti can realise Viksit Bharat dream: Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi prays to Goddess Kushmanda on fourth day of Navratri
October 06, 2024

On fourth day of Navratri, the Prime Minister, Shri Narendra Modi has prayed to Goddess Kushmanda.

The Prime Minister posted on X:

“नवरात्रि के चौथे दिन देवी कूष्मांडा का चरण-वंदन! माता की कृपा से उनके सभी का जीवन आयुष्मान हो, यही कामना है। प्रस्तुत है उनकी यह स्तुति..”