షేర్ చేయండి
 
Comments

మహాత్మ గాంధీ తన జీవిత కాలం లో ఎంతటి స్ఫూర్తి ప్రదాత గా నిలచారో నేటి ప్రపంచాని కి అంతే స్ఫూర్తిప్రదాత అని నేను విశ్వసిస్తాను: శ్రీ నరేంద్ర మోదీ

భారతదేశ ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి దేశ విదేశాల లో తన ప్రసంగాలు మరియు కార్యాచరణ ద్వారా మహాత్మ గాంధీ ఆదర్శాలు, సిద్ధాంతాలు, ప్రబోధాలు దేశం లోనే కాకుండా ప్రపంచం అంతటా కూడా సదా ప్రతిధ్వనించేలా చేశారు.

జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని 2019వ సంవత్సరం జనవరి 30వ తేదీ న ప్రధాన మంత్రి జాతి కి అంకితం చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం లో అత్యంత ప్రధాన ఘట్టం గా నాటి ఐక్యత స్ఫూర్తి ని, సమష్టి శక్తి ని ఇది పునఃసృష్టిస్తుంది. చిటికెడు ఉప్పు బ్రిటిష్ వలస పాలన పునాదుల ను కదలించిన సందర్భాని కి మహాత్ముడు నాడు నిర్వహించిన దండి యాత్ర, ఆయన వెంట నడిచిన 80 మంది సత్యాగ్రహుల పోరాట పటిమ ప్రతిరూపాలు. మహాత్ముని ప్రబోధాల స్ఫూర్తి తో శ్రీ నరేంద్ర మోదీ తన మానస పుత్రిక వంటి ‘స్వచ్ఛభారత్ అభియాన్’ను గాంధీ జయంతి ని పురస్కరించుకుని 2014వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీ న న్యూ ఢిల్లీ లో ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ- 2019వ సంవత్సరం లో మహాత్మ గాంధీ 150వ జయంతి కల్లా ‘‘ఒక పరిశుభ్ర భారతావనిని ఆవిష్కరించడమే’’ ఆయన కు మన అసలైన నివాళి గా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

మహాత్ముని కాలం లో స్వాతంత్ర్య కాంక్ష కు ప్రతిరూపమైన దేశవ్యాప్త మహోద్యమాని కి ప్రతీక గా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు స్వచ్ఛత ఒక ప్రజా ఉద్యమం గా రూపుదాల్చింది. తదనుగుణం గా గడచిన నాలుళ్ల నుండి దేశంలో మూలమూలనా ప్రజా జీవితాన్ని పరివర్తన వైపు నడుపుతోంది ఈ కార్యక్రమం. సాధారణ ప్రజానీకం లో అవగాహన ఇనుమడించడమే ఇందుకు నిదర్శనం. బహిరంగ మల మూత్రాదుల విసర్జన రహితం గా రూపొందే దిశ గా రాష్ట్రాల స్థాయి లోనూ తీవ్ర పోటీ నెలకొంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాలలో 100 శాతం పారిశుధ్య సాధన లక్ష్యాని కి చేరువ లో ఉంది.https://twitter.com/narendramodi/status/973583560308293632

 

స్వాతంత్ర్య సమరం లో భారతీయుల చైతన్యాన్ని తారస్థాయి కి చేర్చిన అంశాల లో మహాత్మ గాంధీ చేపట్టిన ఖాదీ ఉద్యమం కూడా ఒకటి. కానీ, ఖాదీ పై నాటి ఆసక్తి నేడు కనిపించడం లేదు. అయితే, ప్రధాన మంత్రి ఖాదీ కి ప్రత్యేకించి తన ఉపన్యాసాల ద్వారా మళ్లీ ఊపిరులు ఊదారు. ఖాదీ ఉత్పత్తుల వైపు జనం మళ్లీ ఆసక్తి చూపే విధం గా తన నెల వారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం ద్వారా ఉత్తేజితుల ను చేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల పునరుద్ధరణ అవసరాన్ని ఆయన ప్రస్ఫుటం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ పిలుపు ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే- ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు ఒక్కసారి గా జోరు అందుకొన్నాయి.

 

 

మహాత్ముని 150వ జయంతి ని రెండు సంవత్సరాల వేడుకలు గా మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగం గా ప్రభుత్వం అనేక కార్యక్రమాల నిర్వహణ కు ప్రణాళికల ను రచించి అమలు చేస్తోంది. ఆ మేరకు జాతి పిత దార్శనికత ను స్మరించుకుంటూ న్యూ ఢిల్లీ లో 2018 సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 2 వరకు మహాత్మ గాంధీ అంతర్జాతీయ పారిశుధ్య సదస్సు ను (ఎంజిఐఎస్ సి) నిర్వహించింది. ఈ నాలుగు రోజుల కార్యక్రమం లో కేంద్ర మంత్రుల తో పాటు పారిశుధ్య రంగం లో అగ్రగాములైన పలు దేశాల ప్రతినిధులు పాల్గొని తమ ప్రయోగాల ను, అనుభవాల ను కలబోసుకున్నారు.

 

మహాత్మునికి ఎంతో ప్రియమైన ‘వైష్ణవ్ జన్ తో’ కీర్తన ను ఈ సందర్భం గా 124 దేశాల కళాకారులు స్వరబద్ధం చేయగా ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది. తద్వారా ఈ అద్భుత భారతీయ భజన గీతాని కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

అహమదాబాద్ పరిధి లో మహాత్ముడు నెలకొల్పిన సాబర్ మతీ ఆశ్రమాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ భారత దౌత్యం లో అగ్ర స్థానాని కి చేర్చారు. తదనుగుణం గా చైనా అధ్యక్షులు శ్రీ శీ జిన్ పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ, జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే ల వంటి కీలక దేశాధినేత లు ప్రధాన మంత్రి శ్రీ మోదీ సాహచర్యం లో సాబర్ మతీ ఆశ్రమాన్ని సందర్శించి మహాత్ముని కి నివాళి ని అర్పించారు. నిజానికి సాబర్ మతీ ఆశ్రమం సందర్శన తన జీవితం లో మరచిపోలేని, మనోవికాస క్షణాల ను మిగిల్చిన ఒక మధుర ఘట్టం అంటూ చైనా అధ్యక్షులు అభివర్ణించారు. స్వావలంబన కు ప్రతీక అయిన రాట్నాన్ని గాంధీజీ ఉపయోగించిన రీతి లో ప్రధాన మంత్రి సహా అంతర్జాతీయ నాయకులు కూడా ఉపయోగించి రాట్నం తో నూలు ను వడికిన చిత్రాలు మహాత్ముని రోజుల ను గుర్తు కు తెచ్చాయి.

 

 

 

విదేశాల లో గాంధీజీ ని గురించి చిరస్మరణీయ అవగాహన ను ప్రోది చేస్తూ- బ్రిస్ బేన్ నుండి హనోవర్, అశ్గాబాత్ వరకు ప్రపంచం లోని వివిధ నగరాల లో మహాత్ముని శిలా ప్రతిమల ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. https://twitter.com/narendramodi/status/533948745717526528

రాజ్ కోట్ లో గల ఆల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాల లో మహాత్మ గాంధీ ప్రదర్శనశాల ను కూడా 2018వ సంవత్సరం లో ప్రధాన మంత్రి ప్రారంభించారు. మహాత్మ గాంధీ 1887లో ఈ పాఠశాలలోనే మెట్రిక్యులేశన్ ఉత్తీర్ణులయ్యారు.

మహాత్మ గాంధీ ప్రతిపాదించిన అనేక ఆలోచనల ను ప్రధాన మంత్రి ఆచరణ లోకి తెచ్చారు. ఆ మేరకు 21వ శతాబ్దం లోనూ ఆ సిద్ధాంతాలు ఎంతటి ఆదర్శప్రాయమైనవో నిరూపించారు. అలాగే న్యూ ఇండియా ను సృష్టించే ఉద్యమం దిశ గా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మహాత్ముని బోధనల ను ఉపయోగించారు. మహాత్ముడు బోధించిన విలువల కు, ఆచరించిన సిద్ధాంతాల కు ప్రధాన మంత్రి తన చర్య ల ద్వారా క్రియారూపాన్ని ఇచ్చారు. బాపూజీ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం లో శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ఎంతటిదో 2018వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీ న ఆయన తన సొంత బ్లాగ్ లోరాసుకున్న మాట లు తెలియజేస్తాయి. అందులో- ‘‘భారతదేశం వైవిధ్యభరితమైనటువంటి పుణ్యభూమి. కానీ, విభేదాల కు అతీతం గా ఈ నేల మీద జన్మించిన వారందరి ని ఒకే తాటి మీద కు తెచ్చి, వలసవాదం పై పోరు దిశ గా నడిపి ప్రపంచ యవనిక పైన భారతదేశాన్ని సమున్నతం గా నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయన మహాత్మ గాంధీ ఒక్కరే. ఏ దేశం కోసమైతే ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టారో ఆ దేశం కోసం బాపూజీ కన్న కలల ను పండించడం కోసం ఇవాళ 1.3 బిలియన్ భారతీయులమైన మనం సమష్టి గా శ్రమించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని రాశారు.

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India’s Solar Learning Curve Inspires Action Across the World

Media Coverage

India’s Solar Learning Curve Inspires Action Across the World
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Enthusiasm is the steam driving #NaMoAppAbhiyaan in Delhi
August 01, 2021
షేర్ చేయండి
 
Comments

BJP Karyakartas are fuelled by passion to take #NaMoAppAbhiyaan to every corner of Delhi. Wide-scale participation was seen across communities in the weekend.