మన పుస్తకాలయాల లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం పైన మరియు సృజనాత్మకమైన రచన ను అభివృద్ధిపరచడం పైన శ్రద్ధ తీసుకోవడం అనేవి గ్రంథ పఠనానికి ఉన్న ప్రాముఖ్యం పట్ల చైతన్యాన్ని మరీ ముఖ్యం గా యువతీ యువకుల లో వ్యాప్తి చేస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
గ్రంథాలయాల ఉత్సవం 2023 ను మాన్య రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము న్యూ ఢిల్లీ లో ఈ రోజు న ప్రారంభించినందుకు శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రాజా రాంమోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేశన్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఆ తరహా ప్రయాస లు పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం విషయం లో చైతన్యాన్ని, మరీ ముఖ్యం గా యువతీ యువకుల లో వ్యాప్తి చేయగలవు. మన గ్రంథాలయాల లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం పట్ల శ్రద్ధ ను తీసుకొంటూ ఉండడాన్ని మరియు సృజనశీల రచన కు ఊతాన్ని అందిస్తుండడాన్ని చూస్తే సంతోషం గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Such efforts will spread awareness on the importance of reading, particularly among the youth. Good to see the emphasis on improving infrastructure in our libraries and boosting creative writing. https://t.co/43MXiqNmVm
— Narendra Modi (@narendramodi) August 6, 2023


