ద్వైపాక్షిక సంబంధాల కోసం సరిహద్దులో శాంతి, ప్రశాంతత ప్రాముఖ్యత ముఖ్యమన్న ప్రధానమంత్రి
గతేడాది కజాన్ లో అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో వస్తున్న స్థిర, సానుకూల పురోగతిని స్వాగతించిన ప్రధానమంత్రి
ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలన్న అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానాన్ని అంగీకరించిన ప్రధానమంత్రి
స్థిరమైన, ఊహించగలిగిన, నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలతో ప్రాంతీయ- ప్రపంచ శాంతి, శ్రేయస్సు: ప్రధానమంత్రి

కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారు. అలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవాల్సిన ప్రాధాన్యతను ప్రధాన మంత్రి స్పష్టంగా వెల్లడించారు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సాధ్యమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
గత ఏడాది కజాన్ లో అధ్యక్షుడు జిన్ పింగ్ తో జరిగిన సమావేశానికి అనుగుణంగా పరస్పర గౌరవం, కైలాస్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభంతో సహా పరస్పర ప్రయోజనం, పరస్పర సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన, సానుకూల పురోగతిని ప్రధాన మంత్రి స్వాగతించారు.

ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు అధ్యక్షుడు జిన్ పింగ్ కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు. శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షత వహించడానికి ప్రధాని మద్దతు తెలుపుతూ టియాంజిన్లో అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలవడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. అదే విధంగా భారత్, చైనా మధ్య స్థిరమైన, అంచనా వేయదగిన, నిర్మాణాత్మక సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడతాయని ప్రధాని పేర్కొన్నారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Apple steps up India push as major suppliers scale operations, investments

Media Coverage

Apple steps up India push as major suppliers scale operations, investments
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 నవంబర్ 2025
November 15, 2025

From Bhagwan Birsa to Bullet GDP: PM Modi’s Mantra of Culture & Prosperity