ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫాట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేట్లను ఖరారు చేయాలన్న రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఈ  ఏడాది రబీ సీజన్ కోసం అవసరమైన తాత్కాలిక బడ్జెట్ సుమారు రూ.24,475.53 కోట్లు.

ప్రయోజనాలు:

  •   రైతులకు రాయితీపై, సరసమైన, సహేతుకమైన ధరలకు ఎరువులు అందుబాటులోకి వస్తాయి.

  • అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ఎరువులు, పెట్టుబడి ధరల ధోరణుల దృష్ట్యా పి అండ్ కె ఎరువులపై రాయితీని సవరిస్తున్నారు.

అమలు వ్యూహంలక్ష్యాలు:

రైతులకు సరసమైన ధరలకు ఈ ఎరువులు అందుబాటులో ఉంచడానికి ఈ ఏడాది రబీ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు వర్తించే) కోసం ఆమోదించిన రేట్ల ఆధారంగా పి&కె ఎరువులపై రాయితీ అందిస్తారు.

నేపథ్యం:

ఎరువుల తయారీదారులు/దిగుమతిదారుల ద్వారా ప్రభుత్వం 28 గ్రేడ్‌ల పి అండ్ కె ఎరువులను రైతులకు రాయితీ ధరలకు అందుబాటులో ఉంచుతోంది. పి అండ్ కె ఎరువులపై ఎన్‌బీఎస్ పథకం ద్వారా 01.04.2010 నుంచి రాయితీ అందిస్తున్నారు. రైతు హితమైన విధానానికి అనుగుణంగా, రైతులకు సరసమైన ధరలకు పి అండ్ కె ఎరువులు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా ఎరువులు, ఉత్పాదక పెట్టుబడి అంటే యూరియా, డిఏపీ, ఎంవోపీ, సల్ఫర్ ధరల్లో ఇటీవలి ధోరణులకు అనుగుణంగా, ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రాబోయే రబీ సీజన్ 01.10.24 నుంచి 31.03.25 వరకు కాలానికి ఎన్‌బీఎస్ రేట్లను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమోదించి, నోటిఫై చేసిన ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు రాయితీ అందిస్తారు. దీనివల్ల రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి వస్తాయి.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India poised to become world's 4th largest economy by 2026; GDP to grow 6.8% in FY25: PHDCCI

Media Coverage

India poised to become world's 4th largest economy by 2026; GDP to grow 6.8% in FY25: PHDCCI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జనవరి 2025
January 15, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Country’s Development Coupled with Civilizational Connect