ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రూ. 16,300 కోట్ల వ్యయంతో జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్ సీఎంఎం)ను ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగం.. మరి ఇతర సంస్థల ద్వారా రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.

ఆత్మనిర్భర భారత్ లో భాగంగా.. ఉన్నత సాంకేతిక పరిశ్రమలు, హరిత ఇంధనం, రక్షణ రంగాల్లో ఈ ఖనిజాల అనివార్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక ఖనిజాల రంగంలో సవాళ్ల పరిష్కారం కోసం రెండేళ్లుగా వివిధ కార్యక్రమాలను చేపట్టింది.

కీలక ఖనిజాల రంగంలో భారత్ స్వావలంబన సాధించడం కోసం ఒక ప్రభావవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి అనుగుణంగా గతేడాది జూలై 23న కేంద్ర బడ్జెట్ లో కీలక ఖనిజాల మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఖనిజాన్వేషణ, తవ్వకం, మలినాల తొలగింపు, శుద్ధి, కాలం చెల్లిన ఉత్పత్తుల పునరుద్ధరణ సహా విలువ ఆధారిత వ్యవస్థలోని అన్ని దశలూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కీలక ఖనిజాల మిషన్ లో ఉంటాయి. దేశంలోను, తీరప్రాంతాల్లోనూ కీలక ఖనిజాల అన్వేషణను ఈ మిషన్ ముమ్మరం చేస్తుంది. ఆయా ఖనిజాల మైనింగ్ ప్రాజెక్టుల నియంత్రణా పరమైన ఆమోద ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడడం దీని లక్ష్యం. అంతేకాకుండా కీలక ఖనిజాల అన్వేషణకు ఈ మిషన్ ఆర్థిక ప్రోత్సాహకాలనూ అందిస్తుంది. తద్వారా ఖనిజాలకు సంబంధించి అధిక వ్యయం, వ్యర్థాల భారాన్ని తగ్గించేలా ప్రోత్సహిస్తుంది.

కీలక ఖనిజాలకు సంబంధించి విదేశీ ఆస్తులను సమకూర్చుకుని, ఆ వనరులు సమృద్ధంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకునేలా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. దేశంలో కీలక ఖనిజాల నిల్వ సదుపాయాలను పెంపొందించాలని కూడా ఇది ప్రతిపాదిస్తుంది.

కీలక ఖనిజాలకు సంబంధించి ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు, వాటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నిబంధనలు కూడా ఈ మిషన్ లో ఉన్నాయి. కీలక ఖనిజ సాంకేతికతలో పరిశోధనను ప్రోత్సహించడంతోపాటు అత్యున్నత కేంద్రాన్ని (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేయాలని కూడా ఇది ప్రతిపాదిస్తుంది.

అన్ని ప్రభుత్వ సంస్థలనూ ఇందులో భాగం చేస్తూ.. సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ మిషన్ లక్ష్యాలను సాధిస్తుంది.

1957 నాటి గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని 2023లో సవరించి కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీతను పెంచారు. అనంతరం గనుల మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక ఖనిజాలకు చెందిన 24 బ్లాకులను వేలం వేసింది. అంతేకాకుండా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గత మూడేళ్లలో 368 కీలక ఖనిజాన్వేషణ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం 2024-25లో 195 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి, జిఎస్ఐ వివిధ కీలకమైన ఖనిజాల కోసం 227 ప్రాజెక్టులను చేపట్టబోతోంది. ఆవిష్కరణలను పెంపొందించడం కోసం ‘సైన్స్ అండ్ టెక్నాలజీ – అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం (ఎస్ అండ్ టీ ప్రిజం) కార్యక్రమాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ 2023లో ప్రారంభించింది. తద్వారా అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలకు నిధులందించి పరిశోధన - అభివృద్ధి అంశాల్లోను, వాణిజ్యీకరణలోనూ అంతరాలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్ అయిన కబిల్ అర్జెంటీనాలోని కాటమార్కా ప్రావిన్స్ లో లిథియం అన్వేషణ, వెలికితీత  కోసం దాదాపు 15703 హెక్టార్ల విస్తీర్ణంలో స్థలాన్ని సమకూర్చుకుంది. ఇప్పటికే 2024-25 కేంద్ర బడ్జెట్ లో అనేక కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీనివల్ల దేశంలో కీలక ఖనిజాల లభ్యత పెరగడమే కాకుండా, దేశంలో ప్రాసెసింగ్ సదుపాయాల ఏర్పాటు దిశగా పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ కార్యక్రమాలు కీలక ఖనిజాలను పొందడంపట్ల భారత నిబద్ధతను చాటుతాయి.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy navigated well external uncertainties: RBI Bulletin

Media Coverage

Indian economy navigated well external uncertainties: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2026
July 23, 2026

Digital Rails, PLI Jobs & Swift Justice: How PM Modi’s Governance is Rewiring India’s Future