Central Govt to set up National Academic Depository announced in Budget 2016-17
National Academic Depository to digitally store school learning certificates & degrees

నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్‌ ఎ డి) ఏర్పాటుకు, ఆ సంస్థ కార్యకలాపాల ఆరంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. డిజిటల్ ఇండియాలో మరొ కొత్త కోణాన్ని ఆవిష్కరించి, డిజిటల్ ఇండియా విజన్ పరిధిని పెంచడం ఈ నిర్ణయం లోని ముఖ్య ఉద్దేశం.

2017-18 విద్యాసంవత్సరం నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఎన్ ఎ డి వచ్చే మూడు నెలల్లో ఏర్పాటై, తన కార్యకలాపాలను ఆరంభిస్తుంది.

పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సర్టిఫికెట్లు, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇచ్చే అవార్డులను భద్రంగా దాచిపెట్టేందుకు సెక్యూరిటీస్ డిపాజిటరీ తరహాలో డిజిటల్ డిపాజిటరీని స్థాపించగలమని 2016-17 బడ్జెట్టు ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నాడించారు.

సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చట్టం, 1992 ప్రకారం రిజిస్టరైన ఎన్‌ ఎస్‌ డి ఎల్ డాటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, సి డి ఎస్‌ ఎల్ వెంచర్స్ లిమిటెడ్ లు ఎన్‌ ఎ డి కార్యాచరణను పర్యవేక్షిస్తాయి.

ఈ వ్యవస్థలోకి అధికారికంగా సమాచారాన్ని అప్‌లోడ్‌ చేసే విద్యాసంస్థలే ధ్రువీక‌రించాల్సి ఉంటుంది. ఎన్‌ ఎ డి లోని డాటా సరళతను డిపాజిటరీలు చూసుకుంటాయి. విద్యాసంస్థలు, బోర్డులు, అర్హత నిర్ధారణ సంస్థలు, విద్యార్థులు, బ్యాంకులు, ఉద్యోగాలిచ్చే కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు వంటి ఇతర ధ్రువీక‌రణ సంస్థలు ఎన్ ఎ డి లో రిజిస్టర్ కావాలి.

ఇది విద్యార్థులు, ఇతర అధీకృత‌ వినియోగదారుల సెక్యూరిటీ ఫీచర్ల ఆధారంగా ప్రింటెడ్ కాపీ లేదా డిజిటల్ కాపీని అందిస్తుంది. అధీకృత‌ వినియోగదారుల కోరిక మేరకు అకడమిక్ అవార్డులను కూడా ఎన్ ఎ డి ఆన్‌లైన్ లో ధ్రువపరుస్తుంది.

అకడమిక్ అవార్డులు, ఇతర సమాచారాన్ని (ఉదాహరణకు ఉద్యోగమిచ్చే కంపెనీలు, విద్యాసంస్థలకు) విద్యార్థి కోరిక మేరకు ఎన్ ఎ డి అందిస్తుంది. ఎన్ ఎ డి తన వద్దనున్న డాటాబేస్‌పై విశ్వసనీయత, నిజాయితీ, గోప్యతను పాటిస్తుంది. దీంతోపాటు విద్యాసంస్థలు, బోర్డులు, అర్హత నిర్ధారణ సంస్థలు ఈ విషయంలో తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఎన్ ఎ డి శిక్షణనిస్తుంది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The quiet foundations for India’s next growth phase

Media Coverage

The quiet foundations for India’s next growth phase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 డిసెంబర్ 2025
December 30, 2025

PM Modi’s Decisive Leadership Transforming Reforms into Tangible Growth, Collective Strength & National Pride