ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సోన్ ప్రయాగ్ నుంచి కేదారనాథ్ వరకు (12.9 కి.మీ) రోప్ వే ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 4,081.28 కోట్ల మూలధన వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ రోప్ వేను నిర్మించాలని భావిస్తున్నారు. అత్యాధునిక ట్రై-కేబుల్ డిటాచబుల్ గండోలా (3ఎస్) సాంకేతికత ఆధారంగా ఒక దిశలో గంటకు 1,800 మంది ప్రయాణికుల (పీపీహెచ్ పీడీ) సామర్థ్యంతో, మొత్తంగా రోజుకు 18,000 మందిని తీసుకెళ్లగలిగేలా దీన్ని రూపొందించాలని యోచిస్తున్నారు.

పర్యావరణ హితమైన పద్ధతుల్లో సౌకర్యవంతంగా, వేగంగా కేదారనాథ్ కు చేరుకునేలా రూపొందిస్తున్న ఈ రోప్ వే ప్రాజెక్టు యాత్రికులకు ఒక వరం. ఒక వైపు ప్రయాణం కోసం ప్రస్తుతం 8 – 9 గంటల సమయం పడుతుండగా, ఈ రోప్ వే పూర్తయితే ఆ సమయం దాదాపు 36 నిమిషాలకు తగ్గుతుంది.

రోప్ వే ప్రాజెక్టు నిర్మాణ సమయంతో పాటు ప్రారంభమైన తర్వాతా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆతిథ్యం, ప్రయాణం, ఆహార పానీయాల వంటి అనుబంధ పర్యాటక పరిశ్రమలతోపాటు ఏడాది పొడవునా పర్యాటకం ద్వారా విశేషమైన అవకాశాలు లభిస్తాయి.

సామాజిక - ఆర్థిక అభివృద్ధి సమతౌల్యం, కొండ ప్రాంతాల్లో మరింత మెరుగైన అనుసంధానం, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని పెంపొందించడం దిశగా ఈ రోప్ వే ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన ముందడుగు.

గౌరీకుండ్ నుంచి కేదారనాథ్ ఆలయానికి 16 కి.మీ. మేర ఎత్తయిన కొండ ప్రాంతంలో కష్టతరమైన ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. ప్రస్తుతం కాలి నడకన లేదా గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. ప్రతిపాదిత రోప్ వే ద్వారా ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు సౌలభ్యం కలిగించేందుకు, సోన్ ప్రయాగ నుంచి కేదారనాథ్ మధ్య అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించగలమన్న భరోసానిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.

12 పవిత్ర జ్యోతిర్లింగాలలో కేదారనాథ్ ఒకటి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో 3,583 మీ. (11968 అడుగులు) ఎత్తులో ఉంది. అక్షయ తృతీయ (ఏప్రిల్-మే) నుంచి దీపావళి (అక్టోబర్-నవంబర్) వరకు ఏటా దాదాపు 6 నుంచి 7 నెలల పాటు ఈ ఆలయం యాత్రికుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఏటా ఆ సమయంలో దాదాపు 20 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour