తమిళనాడులోని పరమకుడి- రామనాథపురం మధ్య 46.7 కి.మీ మేర 4 వరుసల రహదారిని నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో (హెచ్ఏఎం) రూ. 1,853 కోట్ల మూలధన వ్యయంతో చేపట్టనున్నారు. 

మధురై, పరమకుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోటి మధ్య అనుసంధానం ప్రస్తుతం ఉన్న 2 వరుసల జాతీయ రహదారిపై, రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. అధిక ట్రాఫిక్ వల్ల ఈ రహదారులన్నీ ఇరుకుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కీలక పట్టణాలతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు పరమకుడి నుంచి రామనాథపురం వరకు దాదాపు 46.7 కి.మీ మేర జాతీయ రహాదారి-87ను నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇది రద్దీని తగ్గించి, భద్రతను మెరుగుపరటమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరమకుడి, సత్తిరకుడి, అచుందన్వాయల్, రామనాథపురం పట్టణాల రవాణా అవసరాలను తీరుస్తుంది. 

ఈ మార్గం 5 ప్రధాన జాతీయ రహదారులైన ఎన్‌హెచ్-38, ఎన్‌హెచ్-85, ఎన్‌హెచ్-36, ఎన్‌హెచ్-536, ఎన్‌హెచ్-32లను.. 3 రాష్ట్ర రహదారులైన ఎస్‌హెచ్-47, ఎస్‌హెచ్-29, ఎస్‌హెచ్-34లను కూడా అనుసంధానిస్తుంది. ఇది దక్షిణ తమిళనాడు వ్యాప్తంగా కీలకమైన ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు ఆటంకం లేని అనుసంధానతను అందించనుంది. ఈ కారిడార్ 2 ప్రధాన రైల్వే స్టేషన్లు (మధురై, రామేశ్వరం), 1 విమానాశ్రయం (మదురై), 2 చిన్న ఓడరేవులను (పాంబన్, రామేశ్వరం) కూడా కలుపుతుంది. ఈ మార్గం బహుళ నమూనా అనుసంధానతను అందిస్తూ ఈ ప్రాంతంలో వస్తువులు, ప్రయాణికులు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లటాన్ని వేగవంతం, సులభతరం చేయనుంది. 

నిర్మాణం పూర్తయిన అనంతరం పరమకుడి-రామనాథపురం ఈ ప్రాంత ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ప్రధాన మతపరమైన, ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానతను బలోపేతం చేయనుంది. రామేశ్వరం, ధనుష్కోటి పర్యాటకాన్ని పెంచనుంది. వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 8.4 లక్షల పనిదినాలు, పరోక్షంగా 10.45 లక్షల పనిదినాల ఉపాధి లభించనుంది. దీని నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాలలో వృద్ధి, అభివృద్ధి, సంపద సృష్టిలో కొత్త అవకాశాలను తీసుకురానుంది. 

 

అంశం

వివరాలు

ప్రాజెక్టు పేరు

4 వరుసల పరమకుడి - రామనాథపురం విభాగం

విభాగం

మధురై - ధనుష్కోటి కారిడార్ (ఎన్‌హెచ్-87)

పొడవు (కి.మీ)

46.7

మొత్తం వ్యయం (రూ. కోట్లు)

997.63

భూ సేకరణ ఖర్చు (రూ. కోట్లు)

340.94

మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లు)

1,853.16

నిర్మాణ పద్ధతి

హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏ‌ఎం)

అనుసంధానం కానున్న ప్రధాన రహదారులు

జాతీయ రహదారులు: ఎన్‌హెచ్-38, ఎన్‌హెచ్-85, ఎన్‌హెచ్-36, ఎన్‌హెచ్-536, ఎన్‌హెచ్-32

రాష్ట్ర రహదారులు: ఎస్‌హెచ్ -47, ఎస్‌హెచ్ -29, ఎస్‌హెచ్- 34

అనుసంధానం కానున్న ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలు

 

చిన్న తరహా ఓడరేవులు: పంబన్, రామేశ్వరం

అనుసంధానం కానున్న ప్రధాన నగరాలు, పట్టణాలు

మధురై, పరమకుడి, రామనాథపురం, రామేశ్వరం

ఉపాధి కల్పన సామర్థ్యం

ప్రత్యక్షంగా 8.4 లక్షల పనిదినాలు, పరోక్షంగా 10.5 లక్షల పనిదినాలు

2024-25లో రోజువారీ వార్షిక సగటు ట్రాఫిక్ (ఏఏడీటీ)

అంచనా- 12,700 ప్రయాణ కార్ యూనిట్లు (పీసీయూ)

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential

Media Coverage

WEF Davos: Industry leaders, policymakers highlight India's transformation, future potential
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 జనవరి 2026
January 20, 2026

Viksit Bharat in Motion: PM Modi's Reforms Deliver Jobs, Growth & Global Respect