-
వేలం నుంచివచ్చిన మొత్తాన్ని నమామి గంగే వంటి మంచి పనికి మద్దతుగా వినియోగం
ప్రధానమంత్రిశ్రీ నరేంద్రమోదీ పదవీ కాలంలో ఇంతవరకూ వచ్చిన మెమెంటోల వేలానికి సంబంధించి గత పక్షం రోజులుగా సాగిన వేలం ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది.
ఈ వేలం ప్రక్రియకు దేశ ప్రజలనుంచి విశేషస్పందన లభించింది. ఈ వేలం ప్రక్రియలో రెండు భాగాలున్నాయి. అందులో ఒకటి రెండు రోజులపాటు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో జరిగిన రెండు రోజుల బహిరంగ వేలం, మరొకటి పి.ఎం.మెమొంటోస్ డాట్ జిఒవి. డాట్ ఇన్ ద్వారా జరిగి నఈ వేలం ప్రక్రియ.
ఈ వేలం సందర్భంగా 1800 మెమెంటోలను అత్యధిక మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చిన వారికి విజయవంతంగా వేలం వేయడం జరిగింది. ఈ వేలం ప్రక్రియనుంచి వచ్చిన మొత్తం నమామి గంగే సత్కార్యానికి మద్దతుగా వినియోగిస్తారు.
వేలం ప్రక్రియకు సంబంధించిన ముఖ్యాంశాలు:ఎన్‌జిఎంఎ వద్ద నిర్వహించిన వేలం సందర్భంగా ప్రత్యకంగా హస్తకళాకారులు రూపొందించిన చెక్క బైక్ 5 లక్షల రూపాయల ధర పలికింది. అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్నట్టు చిత్రీకరించిన ఒకప్రత్యేక పెయింటింగ్‌కు కూడా ఇటువంటి ధరే పలకింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి రైల్వే స్టేషన్‌తో ఉన్న ప్రత్యేకబంధాన్ని చిత్రకారుడు తన చిత్రకళానైపుణ్యంతో చిత్రీకరించిన చిత్రమది.
ఈ -వేలంలో కూడా కొన్ని మంచి ధర పలికాయి.
– శివుడి విగ్రహం ధరను రూ 5000 ప్రారంభ ధరగా నిర్ణయించగా, అది వేలంలో 200రెట్లు ఎక్కువ ధరకు అంటే 10లక్షల రూపాయలు పలికింది.
– అశోకస్తంభం నమూనా బేస్ ధర రూ 4000గానిర్ణయించగా అది 13 లక్షల రూపాయల ధర పలికింది.
-అస్సాంలోని మజూలి నుంచి అందుకున్నసంప్రదాయ హొరాయ్( అస్సాం ప్రభుత్వ సంప్రదాయ చిహ్నం- స్టాండ్‌తోసహా ఒక ట్రే) బేస్ ధర్ రూ 2000 కాగా వేలంలో అది రూ 12 లక్షలు పలికింది.
-ఎస్‌జిపిసి, అమృత్‌సర్ నుంచి అందుకున్న డివినిటీ మెమెంటో బేస్ ధర రూ10,000గా నిర్ణయించగా, అది వేలంలో రూ10.1 లక్ష ధర పలికింది.
-గౌతమ బుద్ధుడి విగ్రహం బేస్‌ధర రూ 4000కాగా, వేలంలో అది రూ 7లక్షల రూపాయలు పలికింది.
– నేపాల్ మాజీ ప్రధానమంత్రి శ్రీ సుశీల్ కొయిరాలనుంచి స్వీకరించిన సంప్రదాయ ఇత్తడి సింహ విగ్రహం రూ 5.20 లక్షల ధర పలికింది.
-ఎంబోసింగ్ కలిగిన వెండి కలశం బేస్ ధరను రూ 10,000గా నిర్ణయించగా అది వేలంలో రూ 6 లక్షలు పలికింది.




ఇంకా ఎన్నో మెమెంటోలు వేలంలో వాటి బేస్‌ధర కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ధర పలికాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను అందుకున్న మెమెంటోలను వేలం వేసేవారు. వాటి నుంచివచ్చిన మొత్తాన్ని బాలికా విద్యకు అందించే వారు.ఇదే పద్ధతిని కొనసాగిస్తూ, పవిత్ర గంగా నది శుధ్దికి ఈ వేలం నుంచి వచ్చిన మొత్తాన్ని అందజేయనున్నారు.


