దేశంలో పరివర్తనాత్మకమైన, సమ్మిళిత పరిపాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల చెక్కుచెదరని నిబద్ధతతో పనిచేస్తుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. కరుణతో నిండిన తమ ప్రభుత్వం సాధికారత, మౌలిక వసతులు, సమ్మిళితత్వంపై దృష్టి సారించి 25 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.
పీఎం ఆవాస యోజన, పీఎం ఉజ్వల యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి మార్పులకు శ్రీకారం చుట్టిన పథకాలు తీసుకొచ్చిన ప్రభావం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ పథకాలు గృహనిర్మాణం, స్వచ్ఛమైన వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలను అందించినట్లు ప్రధాని తెలియజేశారు. ప్రయోజనాలను పారదర్శకంగా, సమర్థంగా అందించడంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), డిజిటల్ సమ్మిళితత్వం, గ్రామీణ మౌలిక వసతుల ప్రాధాన్యాన్ని వివరించారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘కరుణతో నిండిన ప్రభుత్వం, పేదల సంక్షేమానికి అంకితం!
గడచిన దశాబ్దంలో సాధికారిత, మౌలిక వసతులు, సమ్మిళితత్వంపై దృష్టి సారించి పేదరికం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను విముక్తులను చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలను చేపట్టింది. మేం చేపట్టిన అన్ని కీలక పథకాలు పేదల జీవితాల్లో మార్పులను తీసుకొచ్చాయి. పీఎం ఆవాస యోజన, పీఎం ఉజ్వల యోజన, జన ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు గృహనిర్మాణం, స్వచ్ఛమైన వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలను ప్రజలకు అందించాయి. డీబీటీ, డిజిటల్ సమ్మిళితత్వం, గ్రామీణ మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను చివరి వ్యక్తి వరకు వేగంగా చేరవేశాయి.
వాటి కారణంగానే 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని ఓడించారు. ప్రతి పౌరుడూ గౌరవప్రదంగా జీవించడానికి వీలున్న సమ్మిళితమైన, స్వావలంబన సాధించిన భారత్‌ను నిర్మించడానికి ఎన్డీయే కట్టుబడి ఉంటుంది.’’
11YearsOfGaribKalyan"
A compassionate government, devoted to Garib Kalyan!
— Narendra Modi (@narendramodi) June 5, 2025
Over the past decade, the NDA Government has taken pathbreaking steps to uplift several people from the clutches of poverty, focussing on empowerment, infrastructure and inclusion. All our key schemes have transformed the…
‘‘గత 11 ఏళ్లలో మా ప్రభుత్వం వేసిన ప్రతి అడుగూ... సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికే అంకితమైంది. ఈ సమయంలో మేం సాధించిన విజయాలు అనూహ్యమైనవే కాదు, 140 కోట్ల మంది జీవితాలను సులభతరం చేస్తున్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ ప్రయత్నాలతో అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను.
11YearsOfGaribKalyan"
बीते 11 साल में हमारी सरकार का हर कदम सेवा, सुशासन और गरीब कल्याण को समर्पित रहा है। इस दौरान हमारी उपलब्धियां ना सिर्फ अभूतपूर्व हैं, बल्कि 140 करोड़ देशवासियों के जीवन को आसान बनाने वाली हैं। मुझे पूरा विश्वास है कि देश को आगे ले जाने के अपने इन प्रयासों के साथ हम विकसित और… pic.twitter.com/rz9vQ76y7l
— Narendra Modi (@narendramodi) June 5, 2025
సమగ్రాభివృద్ధి దిశగా మా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు గొప్ప మార్పులకు దారి తీశాయి. అలాగే పేదలు, అణగారిన వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చాయి.
11YearsOfGaribKalyan"
Our Government’s efforts towards all round development have led to transformative outcomes and benefitted the poor and marginalised. #11YearsOfGaribKalyan https://t.co/Ub2ZGJAZ1F
— Narendra Modi (@narendramodi) June 5, 2025


