సమావేశ ఇతివృత్తం: అంతర్జాతీయ అనిశ్చితుల సమయంలో భారతదేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడం
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా వికసిత భారత్‌ను సాధించవచ్చు: ప్రధాని
ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులకు ఊతమివ్వడం సహా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించిన ఆర్థికవేత్తలు

2025-26 కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధావులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌లో మంగళవారం చర్చించారు.

‘అంతర్జాతీయ అనిశ్చితుల వేళ భారత వృద్ధి వేగాన్ని కొనసాగించడం’ అన్న అంశం నేపథ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

విలువైన అభిప్రాయాలను వెల్లడించిన వారికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే దిశగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోగలిగితే వికసిత భారత్ ను సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయ అనిశ్చితులు - భౌగోళిక ఉద్రిక్తతల  కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడం, ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఉపాధిని మెరుగుపరిచే వ్యూహాలను రూపొందించడం, అన్ని రంగాల్లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణ వ్యూహాలను రూపొందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, సుస్థిరమైన గ్రామీణ ఉపాధి అవకాశాలను కల్పించడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రభుత్వ నిధులను సమీకరించడం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం, ఉద్యోగాల సృష్టి, ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం, ఎగుమతులను పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి ముఖ్యమైన అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో డాక్టర్ సుర్జీత్ భళ్లా, డాక్టర్ అశోక్ గులాటి, డాక్టర్ సుదీప్తో ముండ్లే, శ్రీ ధర్మకీర్తి జోషి, శ్రీ జనమేజయ సిన్హా, శ్రీ మదన్ సబ్నవీస్, ప్రొఫెసర్ అమితా బాత్రా, శ్రీ రిధమ్ దేశాయ్, ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ప్రొఫెసర్ భరత్ రామస్వామి, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్, శ్రీ సిద్ధార్థ సన్యాల్, డా. లవీశ్ భండారి, శ్రీమతి రజనీ సిన్హా, ప్రొఫెసర్ కేశబ్ దాస్, డాక్టర్ ప్రీతమ్ బెనర్జీ, శ్రీ రాహుల్ బజోరియా, శ్రీ నిఖిల్ గుప్త, ప్రొఫెసర్ శాశ్వత్ అలోక్ సహా పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు పాల్గొన్నారు. 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Technical textiles critical to footwear sector

Media Coverage

Technical textiles critical to footwear sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఏప్రిల్ 2026
April 29, 2026

Leadership That Plays, Builds & Delivers: PM Modi’s Vision Igniting Youth, Women & Northeast India