లార్డ్ బుద్ధుడు మనకు జీవితానికి ఎనిమిది మంత్రాలు ఉన్నాయి: ప్రధాని
కోవిడ్ రూపంలో మానవత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, లార్డ్ బుద్ధుడు మరింత సందర్భోచితంగా మారారు: ప్రధాని
లార్డ్ బుద్ధుని మార్గంలో నడవడం ద్వారా మనం గొప్ప సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో భారతదేశం చూపించింది: ప్రధాని
దేశాలు ఒకదానితో ఒకటి చేతులు కలపడం మరియు ఒకరికొకరు బలం అవుతున్నాయి, బుద్ధుని విలువలను తీసుకుంటాయి: ప్రధాని

భగవాన్ బుద్ధుడు ప్రస్తుతం కరోనా మహమ్మారి తాలూకు సంకటపూర్ణమైన కాలం లో   మరింత ఎక్కువ పొంతన కలిగిన వారు గా మారారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  బుద్ధుడు చూపించిన దారి లో నడచి వెళ్తూ అత్యంత కఠినం అయినటువంటి సవాలు ను అయినా సరే, మనం ఎలాగ ఎదుర్కోగలుగుతామో భారతదేశం చాటి చెప్పింది.  బుద్ధుని బోధనల ను అనుసరిస్తూ యావత్తు ప్రపంచం అఖండ సంఘీభావం తో ముందుకు సాగిపోతోంది.  ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినం కార్యక్రమం లో ప్రధాన మంత్రి తాను ఇచ్చిన సందేశం లో ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కాన్ ఫెడరేశన్ చేపట్టినటువంటి ‘కేర్ విత్ ప్రేయర్’ కార్యక్రమం ప్రశంసార్హం గా ఉందని పేర్కొన్నారు.

మన మనస్సు కు, మన వాణి కి మధ్య సామంజస్యం, మరి అంతేకాకుండా మన కార్యాలు మన ప్రయాస ల మధ్య సంకల్పం అనేవి మనల ను దు:ఖం నుంచి దూరం గా పోయేందుకు, సంతోషం వైపున కు తీసుకుపోవడం లో మార్గాన్ని చూపగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇది మనల ను మంచి కాలాల్లో జన సంక్షేమానికై పాటు పడేందుకు ప్రేరణ ను అందిస్తుంది, మనం కఠిన కాలాల ను ఎదుర్కొనేందుకు శక్తి ని కూడా ప్రసాదిస్తుంది.  భగవాన్ బుద్ధుడు మనకు ఈ సద్భావాన్ని సాధించుకోవడం కోసం ఎనిమిది విధాలైన మార్గాలను అందించారు అని ప్రధాన మంత్రి అన్నారు.

బుద్ధుడు త్యాగం, సహనం ల యొక్క  అగ్ని లో తపించుకుపోయిన బుద్ధుడు ఎప్పుడైతే  మాట్లాడడం మొదలుపెడతారో, అప్పుడు అవి కేవలం మాటలుగా బయటకు రావు.. అప్పుడు యావత్తు ‘ధమ్మం’ తాలూకు చక్రం తిరుగాడడం మొదలు పెడుతుంది, మరి ఆయన వద్ద నుంచి ప్రవహించేటటువంటి జ్ఞానం విశ్వ కల్యాణానికి సమానమైన పదం గా మారిపోతుంది.  ఈ కారణం గానే ఇవాళ ఆయన కు అనుచరులు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు.

శత్రుత్వం తో శత్రుత్వం సమాప్తం కాదు అని ‘ధమ్మ పదా’న్ని ఉట్టంకిస్తూ శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.  అందుకు బదులు గా, ప్రేమ తో, పెద్ద మనస్సు తో, సద్భావం తో శత్రుత్వాన్ని శాంతింపచేయవచ్చును.  విషాదం ఆవరించిన కాలాల్లో, ప్రపంచం ఈ ప్రేమ, సద్భావాల తాలూకు శక్తి ని అనుభూతించింది.  బుద్ధుడు అందించినటువంటి ఈ జ్ఞానం తో మానవాళి యొక్క ఈ అనుభవం సమృద్ధం అయింది అంటే మరి దాంతో లోకం సఫలత తాలూకు, సమృద్ధి తాలూకు కొత్త శిఖరాల ను అందుకొంటుంది అని చెప్తూ ప్రధాన మంత్రి తన సందేశాన్ని ముగించారు.  

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch