With the inauguration and foundation stone laying of many development projects from Darbhanga, the life of the people of the state is going to become easier:PM
The construction of Darbhanga AIIMS will bring a huge change in the health sector of Bihar:PM
Our government is working with a holistic approach towards health in the country: PM
Under One District One Product scheme Makhana producers have benefited, Makhana Research Center has been given the status of a national institution, Makhanas have also received a GI tag:PM
We have given the status of classical language to Pali language: PM

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

గౌరవనీయ బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, నా మంత్రివర్గ సహచరులు, బీహార్ ఉప ముఖ్యమంత్రులు శ్రీ విజయ్ కుమార్ సిన్హా, శ్రీ సమ్రాట్ చౌదరి, దర్భంగా ఎంపీ గోపాల్ ఠాకూర్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశిష్ట అతిథులు, నా ప్రియమైన మిథిలా సోదరీ సోదరులందరికీ నా నమస్కారాలు!

మిత్రులారా,

పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ లో నేడు తొలి దశ పోలింగ్ జరుగుతోంది. వికసిత జార్ఖండ్ (అభివృద్ధి చెందిన జార్ఖండ్) దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఆ రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జార్ఖండ్ ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా,

మిథిల ముద్దుబిడ్డ, తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన గాయని శారదా సిన్హా గారికి నా నివాళి. భోజ్ పురి, మైథిలీ సంగీతానికి శారదా సిన్హా అందించిన అసమానమైన సేవలు అమోఘమైనవి. తన పాటల ద్వారా ఛఠ్ పండుగ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఆమె అసాధారణ కృషి చేశారు.

 

మిత్రులారా,

నేడు బీహార్ సహా దేశమంతా గణనీయమైన అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తోంది. ఒకప్పుడు మాటలకే పరిమితమైన ప్రాజెక్టులు, సౌకర్యాలు నేడు సాకారమవుతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్ గా అవతరించే దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నాం. ఈ మార్పులను చూడగలగడం, ఈ అభివృద్ధి ప్రస్థానంలో భాగం కావడం మా తరం అదృష్టం.

మిత్రులారా,

దేశసేవకూ, ప్రజల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. దేశసేవపై మాకున్న ఈ నిబద్ధతతోనే రూ.12,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఒకే కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం. ఇందులో రోడ్డు, రైలు, గ్యాస్ మౌలిక సదుపాయాలున్నాయి. మరీ ముఖ్యంగా, దర్భంగా ప్రజల స్వప్నమైన ఏఐఐఎంఎస్ స్థాపనను సాకారం చేసే దిశగా ముందడుగు పడింది. దర్భంగా ఏఐఐఎంఎస్ నిర్మాణంతో బీహార్ ఆరోగ్య రక్షణ రంగం విశేషమైన పురోగతి సాధిస్తుంది. మిథిల, కోసి, తిర్హుత్ ప్రజలకే కాకుండా పశ్చిమ బెంగాల్, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఇది ఆవశ్యకమైన వైద్య సేవలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఏఐఐఎంఎస్ ఆస్పత్రిలో నేపాల్ ప్రజలు కూడా చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది. అనేక ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కూడా ఈ సంస్థ కల్పిస్తుంది. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా దర్భంగా, మిథిల, మొత్తం బిహార్ రాష్ట్రానికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా,

మన దేశ జనాభాలో ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు. ఎక్కువగా వ్యాధులకు గురవుతుండడంతో వైద్య చికిత్సల ఆర్థిక భారం వారిపై భారీగా పడుతోంది. మనలో చాలా మందిమి సాధారణ నేపథ్యాల నుంచి వచ్చిన వారిమే. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైతే, కుటుంబం మొత్తానికీ అది ఎంతగా బాధ కలిగిస్తుందో మనకు బాగా తెలుసు. గతంలో పరిస్థితి దారుణంగా ఉండేది. ఆస్పత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వైద్యుల కొరత ఉండేది, మందుల ఖరీదు ఎక్కువగా ఉండేది. సరైన రోగనిర్ధారణ సౌకర్యాలు ఉండేవి కావు. ప్రభుత్వాలు మాత్రం అర్థవంతమైన చర్యలు తీసుకోకుండా హామీలు, వాగ్దానాలకే పరిమితమయ్యాయి. బీహార్ లో నితీశ్ అధికారంలోకి రాకముందు పేదల కష్టాలను ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అనారోగ్యాన్ని మౌనంగా భరించడం తప్ప ప్రజలకు మరో గత్యంతరం ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం ఎలా పురోగమిస్తుంది? కాలం చెల్లిన మనస్తత్వాన్ని, పాత విధానాలను రెండింటినీ మార్చడం అత్యావశ్యకం.

 

మిత్రులారా,

మన ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణకు సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది. వ్యాధి నివారణ మా ప్రథమ ప్రాధాన్యం. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ మా రెండో ప్రాధాన్యం. మూడోది- ఉచితంగా, తక్కువ ధరల్లో చికిత్స, ఔషధాలను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. నాలుగోది, చిన్న నగరాల్లో కూడా అత్యున్నత స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. చివరిగా, వైద్యుల కొరత సమస్యను పరిష్కరించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవల్లో సాంకేతికత వినియోగాన్ని విస్తరించడం మా అయిదో ప్రాధాన్యం.

సోదర సోదరీమణులారా,

ఇంట్లో ఎవరైనా జబ్బుల పాలవ్వాలని ఏ కుటుంబమూ అనుకోదు. మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఆయుర్వేదం, పౌష్టికాహార ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దారుఢ్యాన్ని ప్రోత్సహించేలా ఫిట్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోంది. పేలవమైన పరిశుభ్రత, కలుషిత ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలీ అనేక సాధారణ అనారోగ్యాలకు కారణం. అందువల్లే స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రతి ఇంటికీ టాయిలెట్ల నిర్మాణం, స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించడం వంటి కార్యక్రమాల్ని అమలు చేస్తున్నాం. ఈ చర్యలు నగరాల పరిశుభ్రతకే కాకుండా వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా దోహదపడతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో మన ప్రధాన కార్యదర్శి స్వయంగా గత మూడు నాలుగు రోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమానికి నేతృత్వం వహించారని తెలిసింది. ఈ ప్రచారానికి సహకరించిన ఆయనకు, బీహార్ ప్రభుత్వ ఉద్యోగులు, దర్బంగా పౌరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే 5 - 10 రోజుల పాటు మరింత ఉత్సాహంతో ఈ కృషిని కొనసాగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

మిత్రులారా,

మొదట్లోనే చికిత్స అందిస్తే చాలా వ్యాధులను తీవ్రతరం కాకుండా నివారించవచ్చు. అయితే, వైద్య పరీక్షలు ఖరీదైనవిగా ఉండడంతో చాలావరకూ ప్రజలు అనారోగ్య సమస్యలను సకాలంలో గుర్తించలేకపోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను స్థాపించాం. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను తొలి దశలోనే గుర్తించడంలో ఈ కేంద్రాలు దోహదపడతాయి.

మిత్రులారా,

ఆయుష్మాన్ భారత యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా పేద రోగులు చికిత్స పొందారు. ఈ పథకం లేకపోతే, వారిలో చాలా మందికి ఆసుపత్రిలో చేరే స్తోమత లేదు. ఎన్‌డీఎ ప్రభుత్వ ఈ కార్యక్రమం చాలా మందిపై భారాన్ని గణనీయంగా తగ్గించడం సంతోషం కలిగిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వారు చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు మొత్తంగా దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఒకవేళ ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించి ఉంటే, అది నెల రోజుల పాటు పతాక శీర్షికల్లో నిలిచేది. కానీ, ఈ పథకం ద్వారా ఆ మొత్తం మన పౌరుల చేతులు దాటకుండా ఉండగలిగింది.

 

సోదర సోదరీమణులారా,

70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ యోజనలో చేరుస్తామని ఎన్నికల సమయంలో నేను హామీ ఇచ్చాను. నేను మాట నిలబెట్టుకున్నాను. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచితంగా వైద్య చికిత్సను బీహార్ లో కూడా ప్రారంభించాం. త్వరలోనే వృద్ధులందరికీ ఆయుష్మాన్ వయా వందన కార్డు లభిస్తుంది. ఆయుష్మాన్ తోపాటు.. జన ఔషధి కేందద్రాల్లో తక్కువ ధరలోనే ఔషధాలు అందుబాటులో ఉంచుతున్నాం.

స్నేహితులారా,

మెరుగైన ఆరోగ్య సేవల కోసం మేం చేపట్టిన నాలుగో కార్యక్రమం. చిన్న పట్టణాల్లో సైతం అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్య సదుపాయాలను కల్పించి, వైద్యుల కొరతను పరిష్కరిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల వరకూ దేశం మొత్తం మీద ఒకే ఒక్క ఎయిమ్స్ ఉంది. అదీ ఢిల్లీలోనే ఉండేదని గమనించండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. అదనంగా మరో నాలుగైదు ఎయిమ్స్‌లను నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. మా ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి దేశవ్యాప్తంగా నూతన ఎయిమ్స్‌లను నెలకొల్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు డజన్ల ఎయిమ్స్ ఉన్నాయి. గడచిన దశాబ్దంలో వైద్య కళాశాలలు రెట్టింపయ్యాయి. వీటి ద్వారా పెద్య సంఖ్యలో వైద్యులను తీర్చిదిద్దడంతో పాటు చికిత్స సౌకర్యాలు విస్తరించాయి. ప్రతి ఏటా, దేశానికి సేవలందించేందుకు బీహార్‌కు చెందిన యువత ఇకపై ఎయిమ్స్ నుంచి వైద్యులుగా పట్టభద్రులవుతారు. మేము ముఖ్యమైన మరో అంశాన్ని కూడా చేసి చూపించాం. గతంలో డాక్టర్ కావాలి అంటే ఆంగ్లం తెలిసి ఉండటం తప్పనిసరి. మరి ఇంగ్లీషులో చదువుకొనే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు తమ కలలను ఎలా సాకారం చేసుకుంటారు? అందుకే మా ప్రభుత్వం ఇంజినీరింగ్, వైద్య విద్యను వారి మాతృభాషలోనే అభ్యసించేలా వీలు కల్పించింది. ఈ విధమైన మార్పు కోసం కలలు కన్న కర్పూర్ జీ ఠాకూర్ జీకి ఈ సంస్కరణ గొప్ప నివాళి. ఆయన స్వప్నాన్ని మేం నిజం చేశాం. గత పదేళ్లలో లక్ష మెడికల్ సీట్లను పెంచాం. రానున్న ఐదేళ్లలో మరో 75,000 సీట్లను పెంచేందుకు ప్రణాళిక రూపొందించాం. అదే విధంగా బీహార్ యువతకు ప్రయోజనం చేకూరేలా మా ప్రభుత్వం మరో ఉదాత్త నిర్ణయం తీసుకుంది. హిందీతో సహా ఇతర భారతీయ భాషల్లో వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది. ఇది దళిత, వెనుకబడిన వర్గాలు, గిరిజన కుటుంబాలకు చెందిన వారి పిల్లలకు కూడా డాక్టరయ్యే వీలు కల్పిస్తుంది.

మిత్రులారా,

క్యాన్సర్‌ను నిర్మూలించేందుకు మా ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముజఫర్‌పూర్‌లో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బీహార్‌లోని క్యాన్సర్ రోగులకు ప్రయోజనం కలుగుతుంది. రోగులు ఢిల్లీ, ముంబయి వెళ్లాల్సిన అవసరం లేకుండా క్యాన్సర్‌కు సమగ్ర చికిత్సను ఈ ఆసుపత్రి అందిస్తుంది. త్వరలోనే బీహార్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కంటి ఆసుపత్రి కూడా ప్రారంభమవుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం నేను కాశీలో ఉన్నప్పుడు కంచి కామకోటి శంకరాచార్య అక్కడ కంటి ఆసుపత్రిని ప్రారంభించారని మంగళ్‌ నాకు చెప్పారు. గుజరాత్‌లో పనిచేస్తున్నప్పుడు మొదటగా అమలు చేసిన నమూనా ఆధారంగానే కాశీలోని ఈ ఆసుపత్రి కూడా ఉంది. ఈ ఆసుపత్రుల్లో అందిస్తున్న అసమానమైన సేవలను చూసి స్ఫూర్తి పొంది, అలాంటి కంటి ఆసుపత్రినే బీహార్ లోనూ నిర్మించాలని నేను కోరాను. ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని, ఇప్పుడే ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఆసుపత్రి పనులు వేగంగా జరుగుతున్నాయని మీకు తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. నూతనంగా ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజలకు విలువైన వనరుగా మారుతుంది.

 

స్నేహితులారా,

నితీష్ బాబు నాయకత్వంలో బీహార్‌లో రూపొందించిన పరిపాలనా విధానం అద్భుతంగా ఉంది. బీహార్‌ను ఆటవిక రాజ్యం నుంచి విముక్తి చేసేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయం. ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్, బీహార్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం, చిన్న, సన్నకారు రైతులకు, ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం ద్వారానే వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుంది. దానికి ఎన్డీయే దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది. విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు తదిరతమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా బీహార్ ఖ్యాతి పెరుగుతోంది. ఉడాన్ యోజన ద్వారా దర్భంగాలో విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబయి లాంటి ప్రధాన నగరాలకు నేరుగా విమానయాన సౌకర్యం ఉంది. త్వరలోనే ఇక్కడి నుంచి రాంచీకి కూడా విమాన సేవలు ప్రారంభమవుతాయి. రూ.5,500 కోట్లతో నిర్మిస్తున్న అమాస్ - దర్భంగా ఎక్స్‌ప్రెస్ వే పనులు కూడా జరుగుతున్నాయి. అదనంగా, రూ.3,400 కోట్ల నిధులు వెచ్చించి నిర్మించనున్న నగర గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే నీటి మాదిరిగానే గ్యాస్ కూడా పైపుల ద్వారా ఇళ్లకే సరసమైన ధరల్లో సరఫరా అవుతుంది. ఇలాంటి చరిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలు బీహార్ మౌలిక వసతులను మెరుగుపరచి, అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.

మిత్రులారా,

‘‘పగ్-పగ్ పొఖరీ మాచ్ మఖాన్, మధుర్ బోల్ ముస్కీ ముఖ్ పాన్’’ - ‘‘సరస్సులో అడుగడుగునా చేపలు, మఖానా, మధురంగా మాట్లాడే నోటిలో తాంబూలం’’ అన్న నానుడికి దర్భంగా ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి చెందిన రైతులు, మఖానా (తామర గింజలు), చేపల పెంపకందారుల సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా బీహార్‌లోని రైతులకు రూ.25,000 కోట్ల మేర లబ్ధి చేకూరింది. మిథిల రైతులకు కూడా ప్రయోజనాలు అందాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా స్థానిక మఖానా సాగుదారులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోగలుగుతున్నారు. మఖానా రైతులకు మద్దతు అందించేందుకు మఖానా పరిశోధనా కేంద్రానికి జాతీయ హోదాను కల్పించాం. మఖానాకు జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. అలాగే మత్స్య సంపద యోజన ద్వారా చేపల రైతులకు అన్ని విధాలా అవసరమైన సాయం అందిస్తున్నాం. చేపల పెంపకందారులు ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులు పొందడానికి అర్హులు. అలాగే స్థానికంగా లభించే మంచి నీటి చేపలకు మంచి మార్కెట్ ఉంది. వీటి ఉత్పత్తిదారులకు పీఎం మత్స్య సంపద యోజన అన్ని స్థాయిల్లోనూ అవసరమైన సాయం అందిస్తుంది. భారత్‌ను అతి పెద్ద చేపల ఎగుమతిదారుగా నిలబెట్టేందుకు మేం కృషి చేస్తున్నాం. తద్వారా దర్భంగాలోని చేపల పెంపకందారులకు పెద్ద మొత్తంలో ప్రయోజనం పొందుతారు.

స్నేహితులారా,

కోశి, మిథిల ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదల సమస్యను పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది బడ్జెట్లో బీహార్లో వరదలను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికను చేర్చాం. నేపాల్ భాగస్వామ్యంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోగలమని ఆశిస్తున్నాను. ఈ సమస్యను తగ్గించడానికి మా ప్రభుత్వం రూ.11,000 కోట్లతో ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతోంది.

 

మిత్రులారా,

భారతీయ సంస్కృతికి బీహార్ ప్రధాన కేంద్రంగా ఉంది. దీన్ని సంరక్షించుకోవాల్సిన సమష్టి బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకే ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధితో పాటుగా వారసత్వ సంస్కృతీ పరిరక్షణకు సైతం అంకితమైంది. ప్రస్తుతం, నలంద విశ్వవిద్యాలయం పూర్వ వైభవాన్ని, ప్రతిష్ఠను తిరిగి సాధించేందుకు కృషి చేస్తోంది.

స్నేహితులారా,

వైవిధ్యమైన మన దేశంలోని ఎన్నో భాషలు మన సంస్కృతిలో విలువైన భాగం. వాటిని మాట్లాడటం మాత్రమే కాదు వాటి పరిరక్షణ కూడా ముఖ్యమే. ఇటీవలే పాళీ భాషకు ప్రాచీన హోదాను కల్పించాం. ఇది బుద్ధభగవానుని బోధనలను, బీహార్ ప్రాచీన చరిత్రను అద్భుతంగా లిఖించింది. ఈ వారసత్వాన్ని యువతరానికి అందించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో మైథిలీ భాషను చేర్చింది ఎన్డీయే ప్రభుత్వమేనని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ భాష జార్ఖండ్ లో రెండో రాష్ట్ర భాషగా గుర్తింపు సాధించింది.

మిత్రులారా,

మిథిల, దర్భంగా ప్రాంతాల్లో ప్రతి మలుపులోనూ సాంస్కృతిక వైభవం స్పష్టంగా కనిపిస్తోంది. సీతామాత పాటించిన విలువలు, సుగుణాలు ఈ నేలకు ఆశీర్వాదాలు. రామాయణ సర్క్యూట్ లో భాగంగా దర్భంగాతో సహా దేశంలో డజనుకు పైగా నగరాలను ఎన్డీయే ప్రభుత్వం అనుసంధానిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో పర్యాటకం పెరుగుతుంది. అలాగే దర్భంగా-సీతామర్హి-అయోధ్య మార్గంలోని అమృత్ భారత్ రైలు సర్వీసు ప్రజలకు మేలు చేకూర్చింది.

స్నేహితులారా,

దర్భంగా రాజ్య మహారాజు కామేశ్వర్ సింగ్‌జీ చేసిన విశిష్టమైన సేవలను ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందు, ఆ తర్వాత భారత అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పది. నా పార్లమెంటు నియోజకవర్గం కాశీలోనూ ఆయన చేసిన సేవల గురించి గొప్పగా, గౌరవంగా మాట్లాడుకుంటారు. మహారాజా కామేశ్వర్ సింగ్ చేసిన సేవలు దర్భంగాకు గర్వకారణం, మనందరికీ ఆదర్శనీయం.

 

స్నేహితులారా,

వైవిధ్యమైన మన దేశంలోని ఎన్నో భాషలు మన సంస్కృతిలో విలువైన భాగం. వాటిని మాట్లాడటం మాత్రమే కాదు వాటి పరిరక్షణ కూడా ముఖ్యమే. ఇటీవలే పాళీ భాషకు ప్రాచీన హోదాను కల్పించాం. ఇది బుద్ధభగవానుని బోధనలను, బీహార్ ప్రాచీన చరిత్రను అద్భుతంగా లిఖించింది. ఈ వారసత్వాన్ని యువతరానికి అందించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో మైథిలీ భాషను చేర్చింది ఎన్డీయే ప్రభుత్వమేనని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ భాష జార్ఖండ్ లో రెండో రాష్ట్ర భాషగా గుర్తింపు సాధించింది.

మిత్రులారా,

మిథిల, దర్భంగా ప్రాంతాల్లో ప్రతి మలుపులోనూ సాంస్కృతిక వైభవం స్పష్టంగా కనిపిస్తోంది. సీతామాత పాటించిన విలువలు, సుగుణాలు ఈ నేలకు ఆశీర్వాదాలు. రామాయణ సర్క్యూట్ లో భాగంగా దర్భంగాతో సహా దేశంలో డజనుకు పైగా నగరాలను ఎన్డీయే ప్రభుత్వం అనుసంధానిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో పర్యాటకం పెరుగుతుంది. అలాగే దర్భంగా-సీతామర్హి-అయోధ్య మార్గంలోని అమృత్ భారత్ రైలు సర్వీసు ప్రజలకు మేలు చేకూర్చింది.

స్నేహితులారా,

దర్భంగా రాజ్య మహారాజు కామేశ్వర్ సింగ్‌జీ చేసిన విశిష్టమైన సేవలను ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందు, ఆ తర్వాత భారత అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పది. నా పార్లమెంటు నియోజకవర్గం కాశీలోనూ ఆయన చేసిన సేవల గురించి గొప్పగా, గౌరవంగా మాట్లాడుకుంటారు. మహారాజా కామేశ్వర్ సింగ్ చేసిన సేవలు దర్భంగాకు గర్వకారణం, మనందరికీ ఆదర్శనీయం.

 

మిత్రులారా,

బీహార్‌లోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కేంద్రంలోని నా ప్రభుత్వం, ఈ రాష్ట్రంలోని నితీష్ ప్రభుత్వం ఏకమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల నుంచి బీహార్ ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం అందించేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. మరోసారి దర్భంగాలో ఎయిమ్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు. రాబోయే నిర్మాణ్ పర్వ్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. నాతో కలసి చెప్పండి

 

మిత్రులారా,

బీహార్‌లోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కేంద్రంలోని నా ప్రభుత్వం, ఈ రాష్ట్రంలోని నితీష్ ప్రభుత్వం ఏకమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల నుంచి బీహార్ ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం అందించేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. మరోసారి దర్భంగాలో ఎయిమ్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు. రాబోయే నిర్మాణ్ పర్వ్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. నాతో కలసి చెప్పండి

 

భారత్ మాతాకి జై!

భారత్ మాతాకి జై!

భారత్ మాతాకి జై!

ధన్యవాదాలు

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
As we build opportunities, we'll put plenty of money to work in India: Blackstone CEO Stephen Schwarzman at Davos

Media Coverage

As we build opportunities, we'll put plenty of money to work in India: Blackstone CEO Stephen Schwarzman at Davos
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Bharat Ratna, Shri Karpoori Thakur on his birth anniversary
January 24, 2026

The Prime Minister, Narendra Modi, paid tributes to former Chief Minister of Bihar and Bharat Ratna awardee, Shri Karpoori Thakur on his birth anniversary.

The Prime Minister said that the upliftment of the oppressed, deprived and weaker sections of society was always at the core of Karpoori Thakur’s politics. He noted that Jan Nayak Karpoori Thakur will always be remembered and emulated for his simplicity and lifelong dedication to public service.

The Prime Minister said in X post;

“बिहार के पूर्व मुख्यमंत्री भारत रत्न जननायक कर्पूरी ठाकुर जी को उनकी जयंती पर सादर नमन। समाज के शोषित, वंचित और कमजोर वर्गों का उत्थान हमेशा उनकी राजनीति के केंद्र में रहा। अपनी सादगी और जनसेवा के प्रति समर्पण भाव को लेकर वे सदैव स्मरणीय एवं अनुकरणीय रहेंगे।”