అధ్యక్షుల వారు ఘనా జాతీయ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’తో నన్ను గౌరవించడం నాకు అత్యంత గర్వకారణం కావడంతో పాటు గౌరవం కూడా.

అధ్యక్షుడు శ్రీ మహామా గారికీ, ఘనా ప్రభుత్వంతో పాటు ఘనా ప్రజలకూ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయుల తరఫున వినమ్రతతో స్వీకరిస్తున్నాను.
ఈ సన్మానాన్ని నేను మా యువత ఆకాంక్షలకూ, వారి ఉజ్జ్వల భవితకూ, మా సమృద్ధ సాంస్కృతిక భిన్నత్వానికే కాకుండా భారత్, ఘనాల చరిత్రాత్మక సంబంధాలకూ అంకితం చేస్తున్నాను.



