ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజ్యసభ ఎంపీ తిరు ఇళయరాజా న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ఇళయరాజా మొట్టమొదటిసారి పాశ్చాత్య సంప్రదాయ స్వరసమ్మేళనం వాలియంట్‌ను లండన్‌లో ఇటీవలే ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్‌హార్మనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి వినిపించారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ‘మేస్ట్రో’ భారతీయ సంగీత జగతితోపాటు ప్రపంచ సంగీతంపైన కూడా పెను ప్రభావాన్ని ప్రసరించిన సంగతిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేస్తూ, ఇళయరాజాను ‘‘సంగీత దిగ్గజం, మార్గదర్శి’’ అని, ఆయన స్వర రచనలు ప్రపంచ స్థాయిలో శ్రేష్ఠత్వాన్ని మళ్లీ మళ్లీ నిర్వచిస్తూనే ఉంటాయంటూ ప్రశంసలు కురిపించారు.

శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘మన సంగీత రంగంలో, మన సంస్కృతిపై మహత్తర ప్రభావాన్ని ప్రసరించిన మేధావి, సంగీత రంగ దిగ్గజం, రాజ్య సభ ఎంపీ తిరు ఇళయరాజా జీతో భేటీ కావడం సంతోషం కలిగించింది.

ఆయన అచ్చమైన మార్గదర్శి. కొన్ని రోజుల కిందటే లండన్‌లో మొట్టమొదటి పాశ్చాత్య సంప్రదాయ స్వరసమ్మేళనం ‘వాలియంట్’ను ఆయన సమర్పించి, మరో సారి చరిత్ర సృష్టించారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఫిల్‌హార్మనిక్ ఆర్కెస్ట్రా కూడా జత కలిసింది. ఈ మహత్వపూర్ణ, అద్భుతకృత్యం ఆయన అసమాన సంగీత యాత్రలో మరో గొప్ప మజిలీ. ఆయన నిరుపమ సంగీత ప్రస్థానం ప్రపంచ స్థాయిలో శ్రేష్ఠత్వాన్ని పునర్‌నిర్వచిస్తూ మునుముందుకు సాగిపోతూనే ఉంటుంది.

@ilaiyaraaja” .

 

 

 

"நாடாளுமன்ற மாநிலங்களவை உறுப்பினர் திரு இளையராஜா அவர்களை சந்தித்ததில் மகிழ்ச்சி அடைகிறேன். இசைஞானியான அவரது மேதைமை நமது இசை மற்றும் கலாச்சாரத்தில் மகத்தான தாக்கத்தை ஏற்படுத்தியுள்ளது. எல்லா வகையிலும் முன்னோடியாக இருக்கும் அவர், சில நாட்களுக்கு முன் லண்டனில் தனது முதலாவது மேற்கத்திய செவ்வியல் சிம்பொனியான வேலியண்ட்டை வழங்கியதன் மூலம் மீண்டும் வரலாறு படைத்துள்ளார். இந்த நிகழ்ச்சி, உலகப் புகழ்பெற்ற ராயல் பில்ஹார்மோனிக் இசைக்குழுவுடன் இணைந்து நடத்தப்பட்டது. இந்த முக்கியமான சாதனை, அவரது இணையற்ற இசைப் பயணத்தில் மற்றொரு அத்தியாயத்தைக் குறிக்கிறது - உலக அளவில் தொடர்ந்து மேன்மையுடன் விளங்குவதை இது எடுத்துக்காட்டுகிறது.

@ilaiyaraaja"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report

Media Coverage

Manufacturing to hit 25% of GDP as India builds toward $25 trillion industrial vision: BCG report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 డిసెంబర్ 2025
December 12, 2025

Citizens Celebrate Achievements Under PM Modi's Helm: From Manufacturing Might to Green Innovations – India's Unstoppable Surge