షేర్ చేయండి
 
Comments

సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ యొక్క జ‌యంతి సంద‌ర్భం గా 2019వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన గుజ‌రాత్ లోని కేవ‌డియా లో గ‌ల స్టాట్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద భార‌త‌దేశ‌పు ఉక్కు మ‌నిషి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజ‌లి ని స‌మ‌ర్పించ‌నున్నారు.

ఏక్ తా దివ‌స్ ప‌రేడ్ లో కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ పాలుపంచుకొంటారు. ఆయ‌న కేవడియా లో సాంకేతిక విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న స్థలి ని సంద‌ర్శిస్తారు; ఆ త‌రువాత సివిల్ స‌ర్వీస్ ప్రబేశన‌ర్స్ తో ముఖాముఖి సంభాషిస్తారు.

అక్టోబ‌రు 31వ తేదీ ని జాతీయ ఏక‌త దినం గా 2014వ సంవ‌త్స‌రం నుండి జ‌రుపుకొంటున్నాము. అంతే కాదు అన్ని వ‌ర్గాల వారు ఆ రోజు న ర‌న్ ఫ‌ర్ యూనిటీ లో పాల్గొంటున్నారు.

‘‘ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ్ భార‌త్’’ ల‌క్ష్య సాధనకై సాగే ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’లో పెద్ద సంఖ్యల లో పాలుపంచుకోవ‌ల‌సింది గా ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 27వ తేదీ నాడు త‌న ‘మ‌న్ కీ బాత్’ (‘మ‌న‌సు లో మాట‌’) కార్య‌క్ర‌మం లో విజ్ఞప్తి చేశారు.

‘‘మిత్రులారా, 2014వ సంవ‌త్స‌రం నుండి ఏటా అక్టోబ‌ర్ 31వ తేదీ ని ‘జాతీయ ఏక‌త దినం’ గా జ‌రుపుకొంటున్నామన్న సంగతి మీకు తెలుసును. మ‌న దేశం యొక్క ఏక‌త ను, అఖండ‌త ను మ‌రియు భ‌ద్ర‌త ను ఎట్టి ప‌రిస్థితుల లోను ప‌రిర‌క్షించాలి అనే సందేశాన్ని ఈ దినం ప్ర‌భోదిస్తున్న‌ది. మునుప‌టి సంవ‌త్స‌రాల లో మాదిరిగానే ఈ సంవ‌త్స‌రం లో కూడాను- అక్టోబ‌ర్ 31వ తేదీ నాడు – ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’ ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతున్నది. ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’ అనేది ఏక‌త్వాని కి ఒక సంకేతం గా నిలుస్తున్నది. ఒక దేశ ప్ర‌జ‌ క‌ల‌సిక‌ట్టుగా ఉంటూ- ఒకే దిశ లో- ఉమ్మడి ల‌క్ష్యం కోసం.. అదే.. ‘ఏక్ భార‌త్, శ్రేష్ఠ్ భార‌త్’ ఆవిష్కారం కోసం సాగిపో
తుంది’’ ఆయ‌న అన్నారు.

“ప్రియ‌మైన నా దేశ‌వాసులారా, స‌ర్ దార్ ప‌టేల్ గారు ఏక‌త్వం తాలూకు పాశం తో దేశ ప్ర‌జ‌ల ను ఒక్కటి చేశారు. ఈ ఐక్య‌త మంత్రం మ‌న జీవితాని కి ఒక సంస్కారం వంటిది. మ‌రి భిన్న‌త్వాల తో నిండిన‌టువంటి మ‌న దేశం లో మ‌నం అన్ని మార్గాల లోను, ప్ర‌తి ఒక్క మ‌లుపు వ‌ద్ద, ప్రతి ఒక్క అల్పవిరామ ప్రదేశం వద్ద ఈ ఏక‌త్వ మంత్రాన్ని బ‌లోపేతం చేద్దాము. ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, మ‌న దేశం ఎప్ప‌టి కీ చాలా స‌కారాత్మ‌క భావ‌న‌ల‌ తోను, ఐక‌మ‌త్యాన్ని, స‌ముదాయిక సామ‌ర‌స్యాన్ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం లో అప్ర‌మ‌త్తం గాను ఉంటూ వ‌స్తోంది. మ‌నం మ‌న చుట్టుప‌క్క‌ల దృష్టి సారించిన‌ట్ల‌యితే, ధార్మిక స‌ద్భావన ను పెంచి పోషించ‌డం కోసం అవిశ్రాంతం గా కృషి చేస్తున్న వ్య‌క్తుల తాలూకు ఉదాహ‌ర‌ణ ల‌ను అనేకం గా చూడగ‌లుగుతాము’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఆయ‌న ఇంకా ఇలా అన్నారు.. ‘‘గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో కేవ‌లం ఢిల్లీ లో కాకుండా భార‌త‌దేశం లోని వంద‌లాది న‌గ‌రాల తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల రాజ‌ధాని న‌గ‌రాలు, జిల్లా కేంద్రాలు, చివ‌ర‌ కు రెండో అంచె లేదా మూడో అంచె ల కు చెందిన చిన్న ప‌ట్ట‌ణాల లో కూడాను అసంఖ్యాక మహిళలు, పురుషులు- వారు న‌గ‌ర నివాసులు కావ‌చ్చు, లేదా ప‌ల్లెవాసులు కావ‌చ్చు- బాల‌లు, యువ‌తీయువకులు, వ‌య‌స్సు మ‌ళ్ళిన‌ వారు, దివ్యాంగులు.. ఇలా పెద్ద సంఖ్యల లో ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’లో పాలు పంచుకొంటున్నారు.’’

ఫిట్ ఇండియా యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి వ‌క్కాణిస్తూ, ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’ అనేది ఒక విశిష్ట‌మైన కార్య‌క్ర‌మం.. ఇది మేధ‌స్సు కు, శ‌రీరాని కి మ‌రియు ఆత్మ‌ కు ప్ర‌యోజ‌న‌కారి. ‘‘ ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’లో మ‌నం కేవ‌లం ప‌రుగు తీసి ఊరుకోము. ఆ కార్య‌క్ర‌మం లో పాల్గొన‌డం అంటే అది ఫిట్ ఇండియా యొక్క స్ఫూర్తి సైతం ప్ర‌తిబింబిస్తుంది. మ‌నం ‘ఏక్ భార‌త్, శ్రేష్ఠ భార‌త్’తో సంధానం అవుతాము. కాబ‌ట్టి, మ‌న దేహం కోసం మాత్ర‌మే కాకుండా, మ‌న మ‌స్తిష్కం, ఇంకా విలువ‌ల తాలూకు వ్య‌వ‌స్థ భార‌త‌దేశాన్ని ఉన్న‌త శిఖ‌రాల కు తీసుకు పోవడం కోసం ఏక‌త భావ‌న తో మమేకం చేస్తుంది.’’

runforunity.gov.in పేరు తో ఒక వెబ్ పోర్ట‌ల్ ను కూడా ప్రారంభించ‌డ‌మైంది. దీనిలో ఎవరైనా దేశవ్యాప్తం గా నిర్వహించబడుతున్నటువంటి ర‌న్ ఫ‌ర్ యూనిటీ తాలూకు వివిధ వేదిక‌ల ను గురించిన స‌మాచారాన్ని తెలుసుకోవచ్చును.

 

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
All citizens will get digital health ID: PM Modi

Media Coverage

All citizens will get digital health ID: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
శ్రీఎస్. సెల్వగణపతి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 28, 2021
షేర్ చేయండి
 
Comments

శ్రీ ఎస్. సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మా పార్టీ కి శ్రీ ఎస్. సెల్వగణపతి గారు పుదుచ్చేరి నుంచి ప్రప్రథమ రాజ్య సభ ఎంపి అవడం అనేది బిజెపి లో ప్రతి ఒక్క కార్యకర్త కు అపారమైన గౌరవాన్ని కలిగించేటటువంటి విషయం. పుదుచ్చేరి జనత మా యందు ఉంచిన నమ్మకానికి మేం కృత‌జ్ఞులం. పుదుచ్చేరి ప్రగతి కి మేం పాటుపడుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.