రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తన వెంట రాగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లోని విడిఎన్‌కెహెచ్ లో అఖిల రష్యా ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించారు. 

 

నేతలు ఇద్దరూ విడిఎన్‌కెహెచ్ లోని రోసాటమ్ మండపంలో కలియదిరిగారు.  రోసాటమ్ మండపాన్ని 2023 నవంబరు లో ప్రారంభించడమైంది. ఇది విజ్ఞానశాస్త్ర పరమైన, సాంకేతిక విజ్ఞాన పరమైన అభివృద్ధి సూచికలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్రదర్శన మండపాలలో ఒకటి.  పరమాణు శక్తిని పౌర ప్రయోజనాలకు వినియోగించుకొనే  రంగంలో భారతదేశం-రష్యా సహకారాన్ని ప్రత్యేకంగా వివరించే ఛాయాచిత్రాల ప్రదర్శనను ప్రధాన మంత్రి చూశారు.  భారతదేశంలో కూడంకుళం పరమాణు విద్యుత్తు కేంద్రాని (కెకెఎన్ పిపి)కి గుండెకాయగా ఉన్న వివిఇఆర్-1000 తాలూకు శాశ్వత కార్యాచరణ ప్రధాన నమూనా అయిన ‘‘అటామిక్ సింఫనీ’’ని కూడా ప్రధాన మంత్రి తిలకించారు.

 

భారతదేశాని కి, రష్యా కు చెందిన విద్యార్థుల బృందంతో మండపం వద్ద ప్రధాన మంత్రి మాట్లాడారు.  విజ్ఞానశాస్త్రం- సాంకేతికవిజ్ఞాన రంగంలో భావి తరాల మేలు కోసం, భూగ్రహం మేలు కోసం ఇంకా ఏయే అవకాశాలను వినియోగించుకోవచ్చో పరిశీలించవలసిందంటూ విద్యార్థులను ప్రధాన మంత్రి ప్రోత్సహించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional