వలసవాద మనస్తత్వం నుంచి బయటపడుతూ జాతీయ చైతన్యం పునరుజ్జీవనం దిశగా సాగుతున్న భారత్‌ ప్రయాణాన్ని ఈ గ్యాలరీ తెలియజేస్తోందన్న ప్రధాని
పరమ్‌ వీర్ గ్యాలరీ భారతదేశ శౌర్య పరంపర, జాతీయ సంకల్పంతో యువతను అనుసంధానించేందుకు.. వారిలో స్ఫూర్తిని నింపడానికి దోహదపడుతుందన్న ప్రధాని

రాష్ట్రపతి భవన్‌లో పరమ్‌ వీర్ గ్యాలరీని ఏర్పాటు చేయటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇందులోని చిత్రాలు దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు లభించిన హృదయపూర్వక నివాళిగా పేర్కొన్నారు. వారి త్యాగాలకు సంబంధించిన కృతజ్ఞతా చిహ్నంగా దీనిని ఆయన అభివర్ణించారు. భారత్ ‍ఐక్యత, సమగ్రత కోసం ప్రాణాలను ధారపోసి అత్యున్నత త్యాగంతో మాతృభూమిని రక్షించిన ఆ ధీర యోధులను ఈ చిత్రాలు గౌరవిస్తాయని ఆయన పేర్కొన్నారు. 

ఇద్దరు పరమ్‌ వీర చక్ర గ్రహీతలు, ఇతర ఆవార్డుల గ్రహీతల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గ్యాలరీని జాతికి అంకితం చేయడం అనేది ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

చాలా కాలం పాటు రాష్ట్రపతి భవన్‌లోని గ్యాలరీలలో బ్రిటీష్ కాలం నాటి సైనికుల చిత్రాలు ప్రదర్శనకు ఉండేవని ఇప్పుడు వాటి స్థానంలో పరమ్‌ వీర చక్ర గ్రహీతల చిత్రాలు వచ్చినట్లు ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రపతి భవన్‌లో పరమ్‌ వీర్ గ్యాలరీని ఏర్పాటు చేయడం అనేది వలసవాద మనస్తత్వం నుంచి బయటపడేందుకు, దేశాన్ని సరికొత్త జాతీయ చైతన్యంతో అనుసంధానించేందుకు భారత్ చేస్తున్న కృషికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అండమాన్ నికోబార్ దీవులలోని పలు ద్వీపాలకు పరమ్‌ వీర చక్ర గ్రహీతల పేర్లు పెట్టిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

యువతకు ఈ గ్యాలరీ ప్రాముఖ్యతను ఆయన తెలియజేశారు. యువత భారతదేశ శౌర్య పరంపరతో అనుసంధానమయ్యేందుకు ఈ చిత్రాలు, గ్యాలరీ ఒక శక్తిమంతమైన వేదికగా నిలుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. జాతీయ లక్ష్యాలను సాధించడంలో అంతర్గత శక్తి, దృఢ సంకల్పానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ గ్యాలరీ యువతను ప్రేరేపిస్తుందని ఆయన తెలిపారు. ఇది వికసిత్‌ భారత్ స్ఫూర్తిని చాటిచెప్పే ఒక మహా తీర్థయాత్ర కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"హే భారత పరమ్‌ వీరులారా...
మీకు మా నమస్సులు ఓ మహా వీరులారా!

ఈ జాతి కృతజ్ఞతతో ఉంది. మీ బలిదానాలకు 
భారత మాత గౌరవం కోసం నిలిచిన మీకు!

రాష్ట్రపతి భవన్‌లోని పరమ్ వీర్ గ్యాలరీలో ఉన్న వీర యోధుల ఈ చిత్రాలు దేశ రక్షకులకు సమర్పించే భావపూరిత నివాళులు. అత్యున్నత త్యాగంతో మాతృభూమిని రక్షించిన వీరులు, భారతదేశ ఐక్యత- సమగ్రత కోసం ప్రాణాలర్పించిన వారి పట్ల దేశం మరో రూపంలో కృతజ్ఞతను చాటుకుంది. ఇద్దరు పరమ్‍ వీర చక్ర గ్రహీతలు, ఇతర అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యుల గౌరవ సమక్షంలో ఈ పరమ్‍ వీర్‌ గ్యాలరీని జాతికి అంకితం చేయడం అనేది మరింత విశేషమైనది."

"చాలా కాలం వరకు రాష్ట్రపతి భవన్‌ గ్యాలరీలో బ్రిటీష్ కాలం నాటి సైనికుల చిత్రాలు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో దేశపు పరమ్‌ వీర గ్రహీతల చిత్రపటాలు వచ్చాయి. రాష్ట్రపతి భవన్‌లో పరమ్‌ వీర్ గ్యాలరీ ఏర్పాటు చేయటం అనేది వలసవాద మనస్తత్వం నుంచి బయటపడి భారత్‌ను నవచేతనతో అనుసంధానించే కార్యక్రమానికి ఒక చక్కని ఉదాహరణ. ప్రభుత్వం కొన్ని ఏళ్ల క్రితం అండమాన్ నికోబార్ దీవుల్లోని అనేక ద్వీపాలకు పరమ్‌ వీర్‌ చక్ర విజేతల పేర్లను పెట్టింది."

"ఈ చిత్రాలు, ఈ గ్యాలరీ మన యువతకు భారతదేశ శౌర్య పరంపరతో మమేకమవటానికి ఒక ప్రముఖ వేదిక. జాతీయ లక్ష్యం కోసం ఆత్మబలం, సంకల్పం ఎంత ముఖ్యమో ఈ గ్యాలరీ యువతకు తెలియజేస్తుంది. ఇది 'వికసిత్‌ భారత్' స్ఫూర్తిని చాటే ఒక మహా తీర్థక్షేత్రంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను."

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon people to celebrate National Handloom Day by showcasing India's rich handloom heritage
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, has called upon citizens to celebrate National Handloom Day on 7th August by promoting India's rich and diverse handloom traditions.

“Share your videos with your favourite handloom products, including GRWM videos on social media”, Shri Modi said.

Shri Modi posted on X;

Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.

Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.

Don’t forget to use #NationalHandloomDay.